SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఫ్యాటీ లివర్‌ను నయం చేసే 21 రోజుల సీక్రెట్ ప్లాన్.. డాక్టర్ ఏమంటున్నారంటే?

కాలేయం అనేది మన శరీరంలో ముఖ్యమైన అవయవం. ఇది మన శరీరంలో ఎన్నో విధులను నిర్వర్తిస్తుంది. ప్రధానంగా ఆహారం జీర్ణం అవ్వడానికి ఇది పనిచేస్తుంది. కాలేయం ఫుడ్‌ విటమిన్‌, ఖనిజాలు నిల్వ చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఫ్యాటీ లివర్‌ రివర్స్‌ చేసే 21 రోజుల డైట్‌.. దీంతో వైద్యులు ఏం సూచిస్తున్నారు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Sep 15, 2026, 02:14 PM IST | Updated: Sep 15, 2026, 02:18 PM IST
Image Credit: Fatty Liver Reversed Naturally in 21 Days
Join

Fatty Liver Reversed Naturally in 21 Days: ఫ్యాటీ లివర్‌ రివర్స్‌ చేయడం సాధ్యమేనా? కఠినమైన డైట్‌ పాటించడం వల్ల ఫ్యాటీ లివర్‌ రివర్స్‌ అయిపోతుందా? 21 రోజులపాటు ఈ డైట్‌ పాటిస్తే చాలు మీ ఫ్యాటీ లివర్‌ కూడా రివర్స్‌ అయిపోతుంది. కాలేయం మన శరీరంలో ప్రధానంగా జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా కొలెస్ట్రాల్‌ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. మన శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. మన అనారోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ ఫ్యాటీ లివర్‌కు కారణం. ఫిజికల్‌ యాక్టివిటీ కూడా తప్పనిసరి. ఆయుర్వేద వైద్యుల ప్రకారం కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా మన శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది. వైద్యులు సూచించిన 21 రోజుల కఠినమైన డైట్‌ ప్లాన్‌ పాటిస్తే ఈ కొవ్వు కాలేయ సమస్యను తగ్గించుకోవచ్చు.

లిక్విడ్‌ షుగర్‌..
ఫ్యాటీ లివర్‌ సమస్యలు రాకుండా ఉండాలంటే మొదట చక్కెర పూర్తిగా మానేయండి. అంటే సాఫ్ట్‌ డ్రింక్స్‌, ప్యాకేజ్‌ జ్యూస్‌ తీసుకోకూడదు. కేవలం పండు మాత్రమే తినండి. అందులో ఉసిరి, ఆరెంజ్‌, జామ, బొప్పాయి తినండి. వీటిల్లో ఫైబర్‌ కూడా పుష్కలంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగనివ్వవు.

సమతుల ఆహారం..
వైద్యుల ప్రకారం ఫుడ్‌ తీసుకునేటప్పుడు 1/2-1/4-1/4 ప్లేట్‌ పద్థతిలో తినాలి  మీరు తీసుకునే ఫుడ్‌లో ఎక్కువగా కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వండి. దీంతోపాటు ప్రోటీన్‌ పుష్కలంగా ఉండే ఫుడ్‌ తినండి. తృణధాన్యాలు, పోషకాలు ఉండే కార్బోహైడ్రేట్స్‌ కూడా తినండి.ఇది ఇన్సూలిన్‌ నిరోధకతను మెరుగు చేస్తుంది.

ఆరోగ్యకరమైన కొవ్వులు..
ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా డైట్‌లో చేర్చుకోండి. లివర్‌ ఫ్రెండ్లీ ఫుడ్స్‌ అయిన గింజలు, విత్తనాలైన బాదం, వాల్‌నట్‌, అవిసె గింజలు, గుమ్మడి గింజలు తినాలి. ఫ్రై చేసిన ఫుడ్స్‌కు కూడా దూరంగా ఉండాలి. అంతేకాదు ప్రాసెస్‌ చేసిన స్నాక్స్‌, అనారోగ్యకరమైన ఫ్యాట్స్‌కు దూరంగా ఉండాలి.

ఫిజికల్‌గా యాక్టీవ్‌..
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌ కూడా తప్పనిసరిగా చేయాలి. వైద్యుల ప్రకారం చిన్నపటి కండరాల బలం పెంచే వ్యాయామం, యోగాలో ఉత్కఠాసనా, సేతు బంధాసన, ప్లాంక్‌ పోజ్‌ చేస్తూ ఉండాలి. దీంతో కూడా మన కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

యోగా, ప్రాణాయామం..
శ్వాస సంబంధిత ఎక్సర్‌సైజులు చేయాలి. ఇది స్ట్రెస్‌ లెవల్స్‌ కూడా తగ్గిస్తుంది. తాలాసన, కోనాసన, వక్రాసన, పవనముక్తాసన, డయాఫ్రగ్మేటిక్‌ బ్రీథింగ్‌, అనులోమ్‌, విలోమ్‌ ప్రాణాయామం చేయాలి.

డిన్నర్‌ త్వరగా చేయండి..
రాత్రి మీరు తీసుకునే భోజనం త్వరగా తినండి. పడుకునే సమయానికి ముందు రెండు మూడు గంటల ముందు తినాలి. రాత్రి సమయంలో కేవలం తేలికపాటి ఫుడ్‌ మాత్రమే తీసుకోవాలి.

నిద్రకు ప్రాధాన్యం..
కాలేయ ఆరోగ్యం బాగుండాలంటే సరైన నిద్ర కూడా తప్పనిసరి. నిద్ర వల్ల పూర్తి మన శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది స్ట్రెస్‌ స్థాయిలను నిర్వహిస్తుంది. రెగ్యులర్‌గా ఒకే సమయానికి నిద్ర పోవాలి. ఇది మంచి నయం చేసే శక్తిని ఇస్తుంది.

నో ఆల్కహాల్‌..
ఆల్కహాల్‌ తీసుకుంటే కాలేయానికి అదనపు భారంగా మారుతుంది. ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. తద్వారా మీ కాలేయ ఆరోగ్యం మెరుగు అవుతుంది. అయితే మీకు ఇది వరకే కాలేయ సమస్యలు ఉంటే ముందుగా వైద్యులను సంప్రదించిన తర్వాతే మీ డైట్‌లో మార్పులు చేసుకోవాలి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES