మీరు చేసే సహాయమే మీకు సమస్యగా మారవచ్చు.. చాణక్యుడు చెప్పిన 3 రకాల వ్యక్తులు వీరే!
Chanakya Niti Telugu: కొన్ని లక్షణాలు కలిగిన వ్యక్తులకు ఎప్పుడు సహాయం చేయకూడదని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. ఒకవేళ సహాయం చేసిన జీవితంలో ఏదో ఒక సమయంలో పాశ్చాత్త పడాల్సి వస్తుందని నీతి శాస్త్రం తెలుపుతోంది. అయితే, ఎలాంటి వ్యక్తులకు సహాయం చేయడం మంచిది కాదు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Chanakya Niti Telugu News: సహాయం చేయడం అనేది సమాజంలో ఎంతో ఉన్నతమైన గుణంగా అందరూ భావిస్తూ ఉంటారు.. ఆపదలో ఉన్నవారికి చేతనైనంత సాయం అందించే వారికి సమాజంలో ఎల్లప్పుడూ గౌరవంతో పాటు మర్యాదలు దక్కుతూ ఉంటాయని మనందరికీ తెలుసు.. అయితే ప్రతిసారి సాయం చేయడం మంచికే దారితీయాలని లేదు.. కొన్నిసార్లు మనం చేసిన సహాయాన్ని గుర్తించి కృతజ్ఞతతో ఉండాల్సింది పోయి.. ఎదురు మనల్ని నిందించే లేదా మనకే నష్టం కలిగించే వ్యక్తులు కూడా ఉంటూ ఉంటారు.. అందుకే ఎవరికి సహాయం చేయాలి? ఎవరికి దూరంగా ఉండాలని విషయంలో విచక్షణ ఎంతో అవసరమని చాణక్యనీతి శాస్త్రం స్పష్టంగా చెబుతూ వస్తోంది. చాణక్యుడు అందించిన వివరాల ప్రకారం ప్రధానంగా మూడు రకాల వ్యక్తులకు సాయం చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుందని ఆయన అన్నారు..
నేర్చుకోవాలని ఆసక్తి లేనివారు..
ఆచార్య చానక్యుడు అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తి ఎంత జ్ఞానాన్ని బోధించినప్పటికీ.. అతనికి నేర్చుకోవాలని కోరిక గాని.. అర్థం చేసుకునే జ్ఞానం కానీ లేకపోతే ఆ ప్రయత్నాలు అన్ని వృధా అవుతూ ఉంటాయి. అలాంటి మూర్ఖుడిని మార్చాలని ప్రయత్నించడం లేదా వారికి సహాయం చేయడం వల్ల మన సమయంతో పాటు శ్రమ వృధా అవుతాయి. మంచి విషయాలను స్వీకరించలేని మనస్తత్వం కలవారికి దూరంగా ఉండటమే శ్రేయస్కరమని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది..
అత్యాశపరుడైన వ్యక్తులకు దూరంగా ఉండడం..
దురాశ లేదా ఎక్కువ కావాలని అనుకునే వ్యక్తులకు ఎప్పటికీ నమ్మకానికి అర్హులు కారని చాణక్యనీతి శాస్త్రం తెలుపుతోంది. అత్యాశతో నిండిన వ్యక్తి ఎప్పుడూ కేవలం స్వప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. తమ స్వార్థం లేదా లాభం కోసం ఎంతటి వారినైనా మోసం చేయడానికి.. వెన్నుపోటు పొడవడానికి కూడా వెనకాడకుండా ఉంటాడు. ఇలాంటి వారి పట్ల జాలి చూపించి సాయం చేస్తే.. రేపటి రోజున వారే మనల్ని నిలువునా ముంచేసే ప్రమాదం కూడా చాలా వరకు ఉంది..
తీవ్ర స్వార్ధపరులు..
స్వార్థపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తులకు ఎల్లప్పుడూ తగినంత దూరంగా ఉండడం చాలా మంచిదని చాణక్యనీతి శాస్త్రం తెలుపుతోంది. ఇలాంటి వ్యక్తులు కేవలం తమ అవసరాలతో పాటు ప్రయోజనాల కోసమే ఇతరులతో సంబంధాలను ఏర్పరచుకుంటూ ఉంటారు. ఎదుటివారిని వాడుకొని తమ పని పూర్తయ్యాక ముఖం చాటేస్తుంటారు. తమకు అబ్బం గడుపుకోవడం కోసం ఇతరులను ఎలాంటి ఇబ్బందుల్లోనైనా నెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వారిని గుడ్డిగా నమ్మి సాయం చేయకూడదని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది..
ఎదుటి వారి భావాలను గౌరవించాలని.. ఇతరులను కించపరిచే నైజాం ఉన్న వ్యక్తులతో సహవాసం చేస్తే వారి చెడు లక్షణాలు మన జీవితంపై కూడా ప్రభావం చూపుతూ ఉంటాయని.. చాణక్యనీతి శాస్త్రం హెచ్చరిస్తూ వస్తోంది. ఈ లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉంటూ.. కేవలం మంచి ప్రవర్తన కలిగిన వారికి సహాయం అందించినప్పుడే మన జీవితం పురోగతిని సాధిస్తుందని నీతి శాస్త్రం వివరిస్తూ వస్తోంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కలిగిన వారికి చాలా దూరంగా ఉండడం ఎంతో మంచిది..