Chettinad Chicken Biryani Recipe: బిర్యానీ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. హైదరాబాద్ అంటే బిర్యానీకి ఫేమస్ అయితే, ఎప్పుడూ ఒకే విధమైన బిర్యానీ ట్రై చేయకండి. వాటిలో చిన్నపాటి మార్పులు చేస్తే అద్భుతమైన రుచి కూడా పొందుతారు. రుచికరమైన చెట్టినాడు స్టైల్ చికెన్ బిర్యానీ రిసిపీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు..
అరకిలో - చికెన్
అరకిలో - బాస్మతి రైస్
ఉల్లిపాయలు-2
టమోటాలు-2
పచ్చిమిర్చి-2
అల్లంవెల్లుల్లి పేస్ట్
పెరుగు -1/4
నెయ్యి-2 టీస్పూన్స్
పసుపు- టీస్పూన్
కారం -టీస్పూన్
లవంగాలు-3
యాలకులు-2
నూనె-2 టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
పుదీనా, కొత్తిమీర
దాల్చిన చెక్క,
తయారీ విధానం..
ముందుగా చికెన్ శుభ్రంగా కడగాలి. బాస్మతి బియ్యాన్ని కూడా ఓ అరగంటపాటు నానబెట్టుకోవాలి.
ముందుగా మనం చికెన్ కూడా మ్యారినేట్ చేయాలి. అల్లంవెల్లుల్లి, పెరుగు, పసుపు, కారం, ఉప్పు మీ మ్యారినేషన్‌కు తగినట్లుగా వేయాలి. బాగా కలిపి ఓ గంటపాటు మ్యారినేట్ చేయాలి.
ఇప్పుడు మందపాటి ప్యాన్ తీసుకుని అందులో యాలకులు, లవంగం, దాల్చిని వేసి దోరగా వేయించింది. ఇప్పుడు ఉల్లిపాయ కూడా సన్న చిలికలుగా కట్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు వేయించండి. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. ఇందులోనే మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసి వేయించాలి. కొన్ని నిమిషాలు మగ్గిన తర్వాత కట్ చేసిన టమోటాలు, పచ్చిమిర్చి, కారం, పసుపు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పెరుగు, పుదీనా, కొత్తిమీర కడూఆ వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించండి.
ఇప్పుడు చికెన్‌పైన నానబెట్టిన రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి మూత గట్టిగా దమ్ పెట్టి ఓ 20 నిమిషాలు ఉడికించండి. మంట లో ఫ్లేమ్‌లో ఉండాలి. తాజా కొత్తిమీర వేసి వేడివేడిగా వడ్డిస్తే రుచి బాగుంటుంది.