Rose Water Benefits: రోజ్ వాటర్ రోజూ ముఖానికి రాసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. బామ్మల కాలంనాటి నుంచి బ్యూటీ రొటీన్‌లో రోజ్ వాటర్ తప్పనిసరిగా చేర్చుకునేవారు. సాధారణంగా ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన స్కిన్ టైప్ ఉంటుంది. రోజ్ వాటర్ ముఖానికి అప్లే చేయడం వల్ల గ్లోయింగ్ స్కిన్ పొందుతారు. మచ్చలు, రంధ్రాలు లేకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది. ఆ రెమిడీస్ ఏంటి తెలుసుకుందాం.
మన డైలీవారీ స్కిన్ కేర్ రొటీన్‌లో కొన్ని పదార్థాలు చేర్చుకుంటే సహజంగా గ్లోయింగ్ స్కిన్ పొందుతారు. మీ స్కిన్ కూడా మంచి టెక్చర్ పొందుతారు. ఈ రోజ్ వాటర్‌ను మీరు టోనర్, ఫేషియల్ మిస్ట్, క్లెన్సర్ మాదిరి కూడా ఉపయోగించవచ్చు. మచ్చ లేని స్కిన్ టోన్ పొందుతారు. ఇది ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్‌ను తగ్గస్తుంది. మీ బ్యూటీ రొటీన్‌లో రోజ్ వాటర్ చేర్చుకుంటే మీ చర్మం మంచి మీ చర్మ రంగు మరింత మెరుగు అవుతుంది.
రోజ్ వాటర్ మన చర్మానికి వాడటం వల్ల మంచి హైడ్రేటింగ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటాయి. రోజ్ వాటర్ మీరు వాడే క్వాంటిటినీ బట్టి ఉంటుంది. సరిగ్గా అప్లై చేస్తేనే మీరు మంచి ప్రభావం చూస్తారు. మీ ముఖం కూడా మృదువుగా మారతుంది. ఇందులో పాలీఫెనల్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.
ప్రతిరోజూ బయటకు వెళ్లి వర్క్ చేస్తాం కాబట్టి హానికర యూవీ కిరణాల నుంచి కూడా రోజ్ వాటర్ మంచి ఉపశమనం అందిస్తాయి. ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ కాకుండా కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. రానురాను మీ స్కిన్ గరుకుతనం తగ్గుతుంది.
రోజ్ వాటర్ వాడితే మంచి హైడ్రేటింగ్ టోనర్‌లా పనిచస్తుంది. కాటన్ ప్యాడ్స్‌తో కొన్ని చుక్కల రోజ్ వాటర్ ముఖానికి అప్లై చేయాలి.
ఫేషియల్ మిస్ట్..
మీ ముఖం పొడిబారినట్లు ఉంటే ముఖంపై రోజ్ వాటర్‌ను మిస్ట్ మాదిరి స్ప్రే చేసుకోవాలి. ఇది మంచి ఫేషియల్ మిస్ట్‌లా పనిచేస్తుంది.
మాస్క్ బేస్..
రోజ్ వాటర్‌ను మన ఫేషియల్ మాస్క్‌లా పనిచేస్తుంది. నేచురల్ క్లే మాస్క్ లేదా ఏదైనా మాస్క్‌లు తయారు చేసుకుంటే చర్మానికి మంచి ఉపశమనం అందించినట్టవుతుంది.
అయితే, అన్నీ రోజ్ వాటర్‌లు ఒకే విధంగా ప్రభావం చూపవు. అందులో ఏవైనా సంరక్షక పదార్థాలు యాడ్ చేయవచ్చు. మంచి వాసన రావడానికి కూడా ఏవైనా కెమికల్స్ వాడే అవకాశం ఉంది. షెల్ఫ్ లైఫ్ పెంచడానికి ఏవైనా పదార్థాలు వాడొచ్చు. దీనివల్ల కొంతమందికి ముఖంపై ర్యాష్ వచ్చే అవకాశం కూడా ఉంది.
మీరు ఎంచుకునే రోజ్ వాటర్ 100 శాతం ప్యూర్ స్టీమ్ డిస్టిల్లర్ మాత్రమే ఎంచుకోండి. parfum, Fragrance లేదా Alcohol Denat ఉంటే కొనుగోలు చేయకండి. డార్క్ గ్లాస్ బాటిల్‌లో ఉన్నవి మాత్రమే ఉపయోగించండి. అయితే, మీ చర్మ రకానికి సెట్ అవుతే మాత్రం. మీ రోజువారీ స్కిన్ కేర్ రొటీన్‌లో రోజ్ వాటర్ చేరిస్తే మంచి రంగు కూడా వస్తుంది.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)