దీపాలు పెట్టడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందా? లైట్ థెరపీకి దీపావళికి ఉన్న లింక్ ఇదే!
Light Therapy For Depression: దీపాలు పెట్టడం వల్ల డిప్రెస్‌తో పాటు అనేక రకాల సమస్యలు దూరమవుతాయని ఎంతమందికి తెలుసు? దీపావళి పండగకు లైట్ థెరపీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Light Therapy For Depression: చలికాలం మొదలయ్యే సమయంలో చాలామందిలో తెలియని నిరాశతో పాటు అలసట వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.. వైద్య పరిభాషలో దీనిని సీజనల్ డిప్రెషన్ లేదా సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అని చెప్పుకుంటూ ఉంటారు. సరిగ్గా ఇదే సమయంలో వచ్చే దీపావళితో పాటు కార్తిక మాసాల్లో ఇంటి నిండా దీపాలు వెలిగించడం కేవలం ఆధ్యాత్మిక ఆచారం మాత్రమే కాదని.. దీని వెనుక అద్భుతమైన న్యూరోలాజికల్ సైన్స్‌తో పాటు లైట్ థెరపీ సూత్రాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు..
వర్షాకాలం ముగిసి శీతాకాలం మొదలయ్యే అక్టోబర్‌తో పాటు నవంబర్ నెలల్లో పగటి సమయం తగ్గి.. రాత్రి టైమ్ విపరీతంగా పెరుగుతాయి. సూర్యకాంతి తీవ్రత గణనీయంగా తగ్గుతూ వస్తుంది. ప్రకృతిలో కాంతి తగ్గినప్పుడు మానవ శరీరంలోని జీవ సమాయం గందరగోళానికి గురవుతుందని నిపుణులు తెలుపుతున్నారు. సూర్యరశ్మి తగ్గడం వల్ల మెదడులో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ అధికంగా విడుదలవుతుంది. ఫలితంగా రోజంతా నీరసంలో పాటు బద్ధకం, మూడ్ స్వింగ్స్ ఎదురవుతాయి.
కంటిలోని రెటీనా ద్వారా గ్రహించే కాంతి మెదడులోని హైపోథాలమస్ భాగాన్ని గ్రహించేలా చేస్తుంది. శరీరంలో కాంతి ప్రవేశించినప్పుడు ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించే సెరోటోనిన్‌తో పాటు డోపమైన్ న్యూరోట్రాన్స్‌మిటర్ల స్థాయిలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి.. ఆధునిక వైద్యంలో సీజనల్ డిప్రెషన్‌ను తగ్గించడానికి 10,000 లక్స్ తీవ్రత కలిగిన లైట్ బాక్సులను ఉపయోగించి బ్రైట్ లైట్ థెరపీ చేస్తూ ఉంటారు..
దీపావళి రోజున వెలిగించే ప్రమిదల కాంతి, వరుస లైట్ల బ్రైట్‌నెస్ పర్యావరణంలోని చీకటిని తరిమికొట్టి.. మెదడుకు ఒక సానుకూల సంకేతాన్ని పంపేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. మట్టి ప్రమిదలలో ఆవనూనె, నువ్వుల నూనె లేదా నెయ్యితో వెలిగించే జ్యోతుల వెచ్చని కాంతి కంటి చూపుకు హాయినిచ్చి.. ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయులను సులభంగా తగ్గిస్తాయి.
చీకటి సమయంలో వెలిగే దీపాల వెలుగులు మానసిక ప్రశాంతతను పెంచడంతో పాటు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కలసి సంబరాలు చేసుకోవడం వల్ల ఒంటరితనం దూరమవుతుందట.. అంతేకాకుండా మెదడులో ఆక్సిటోసిన్ విడుదలై మానసిక ధైర్యం పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో మన పూర్వీకులు శీతాకాలపు ప్రారంభంలో వచ్చే మానసిక సమస్యలను పోగొట్టేందుకు దీపాల పండుగను ఒక సాంస్కృతిక చికిత్సగా రూపొందించారని తెలుస్తోంది..