SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

దీపావళి రోజు నూనె దీపాలు ఎందుకు వెలిగిస్తారో తెలుసా? దీని వెనుక ఉన్న ఆయుర్వేద రహస్యం ఇదే!

Diwali Traditions: మన పూర్వీకులు కార్తీక మాసం నుంచి ఆ తర్వాత వచ్చే నెల వరకు దీపాలను వివిధ నూనెలతో వెలిగిస్తూ ఉండేవారు.. అంతేకాకుండా ఈ సమయాల్లో కేవలం అభ్యంగన స్నానం మాత్రమే చేసేవారు.. దీని వెనక ఉన్న ఆయుర్వేదంతో పాటు సైన్స్ ఎవరికైనా తెలుసా? ఈ దీపావళి పండగ సందర్భంగా దీపాలు వెలిగించే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 08, 2026, 01:30 PM IST | Updated: Nov 08, 2026, 01:31 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Diwali Traditions News: వర్షాకాలం ముగుస్తూ శీతాకాలం ప్రారంభమవుతున్న రుతు సంధి సమయంలో ప్రకృతిలోనే కాదు మానవ శరీరంలోను తీవ్ర మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. వాతావరణంలో పెరిగే తేమతో పాటు ఉష్ణోగ్రతల్లో తగ్గుదల బ్యాక్టీరియాతో పాటు వైరస్లు కీటకాలు వేగవంతంగా విస్తరించడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటాయి. ఇదే సమయంలో మన పూర్వీకులు కార్తీక మాసంతో పాటు దీపావళి పేరుతో దీపారాధనతో పాటు అభ్యంగన స్నానాలను సాంప్రదాయంలో భాగంగా చేశారట.. వీటికి కేవలం ఆధ్యాత్మిక ప్రాధాన్యత మాత్రమే కలిగి ఉండడమే కాకుండా అద్భుతమైన ఆయుర్వేద, జీవశాస్త్ర ఆధారాలు కూడా ఉన్నాయని నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు..

శీతాకాలపు చల్ల గాలుల కారణంగా గాలిలో కాలుష్య కారకాలు కిందిస్థాయిలోనే నిలిచిపోతూ ఉంటాయట.. ఈ సమయంలో ఆవు నెయ్యి లేదా స్వచ్ఛమైన నువ్వుల నూనెతో వెలిగించే దీపాలు సహజంగా గాలిని శుద్ధి చేసేందుకు పని చేస్తాయట.. ముఖ్యంగా ఆవు నెయ్యి మండుతున్నప్పుడు విడుదలయ్యే సూక్ష్మ వాయువులు వాతావరణం లోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి.. ఇంటిని డీటాక్స్‌ఫై చేసి శ్వాస కోస వ్యవస్థను మెరుగుపరిచేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుందట.. ఇక నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల పరిసరాలోని తేమను నియంత్రించి సూక్ష్మజీవుల వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇది నాడీ వ్యవస్థను ఆరోగ్యవంతంగా చేసేందుకు కూడా సహాయపడుతుందట..

వర్షాకాలం ముగింపుతో దోమలతో పాటు క్రిమి కీటకాల బెడద విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. రసాయనాల కాయిల్స్‌తో పాటు లిక్విడ్ ఐటమ్స్ వినియోగించడం వల్ల దీర్ఘకాలికంగా శ్వాసకోశ సమస్యలు వచ్చే ముప్పు అధికంగా ఉంటుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా వేప నూనెతో పాటు ఆముదం లేదా నువ్వుల నూనెలతో కలిపి మట్టి దీపాలు వెలిగించడం వల్ల గాలిలో సహజంగా క్రిమి కీటకాలు మాయమవుతాయట.. అంతేకాకుండా ఇది దోమలతో పాటు పురుగులను సహజంగా తరిమికొట్టేందుకు ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు..

ఇక వాతావరణ మార్పుల వల్ల శరీరంలోని వాత దోషం పెరిగి.. చర్మం పొడిబారడంతో పాటు కీళ్ల నొప్పులు రావడం సహజం.. దీని నివారణకు ఆయుర్వేదం సూచించిన ఉత్తమ మార్గం అభ్యంగన స్నానం.. నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి శరీరమంతా మర్దన చేసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.. చర్మానికి తేమ అంది రోగ నిరోధక కవచంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. ఆ తర్వాత సున్నిపిండితో స్నానం చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకొని విషపదార్థాలు బయటికి వెళ్లిపోతూ ఉంటాయి. ఇక బయట వాతావరణాన్ని దీపాల ద్వారా శుద్ధి చేస్తూ.. శరీర ఆరోగ్యాన్ని అభ్యంగనం ద్వారా కాపాడుకోవడమే ఈ రుతుమార్పు వేల పాటించే సాంప్రదాయాల అసలైన సైన్స్.. అందుకే మన పెద్దలు ఈ దీపావళి సమయాల్లో దాదాపు నెల రోజులపాటు వివిధ నూనెలతో దీపాలను వెలిగించుతూ వచ్చేవారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES