SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వేడి రోటీపై నెయ్యి ఎక్కువగా వేసుకుని తింటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Ghee Health Risks: వేడి వేడి రోటీలపై నెయ్యిని అధికంగా వేసుకుని తింటున్నారా? తప్పకుండా వైద్య నిపుణుల సూచిస్తున్న కొన్ని విసయాలు తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే ఇలా తింటే లాభాలతో పాటు దుష్ప్రభావాలు కూడా కలుగుతాయని వారు చెబుతున్నారు. అయితే, ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 25, 2026, 03:50 PM IST | Updated: Sep 25, 2026, 03:52 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Ghee Health Risks News: భారతీయ సంప్రదాయ వంటకాల్లో నెయ్యికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే దీనిని అన్ని రకాల వంటకాల్లో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే చాలా మందికి పెనంపై నుంచి అప్పుడే తీసిన రోటీని వేడి వేడిగా నెయ్యి వేసుకుని.. తినే అలవాటు ఉంటుంది. కొంతమంది నెయ్యిని విపరీతంగా పూసుకుని తింటూ ఉంటారు. అయితే, రుచిని పెంచే ఈ అలవాటు మన గుండెకు, శరీర ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది? దీనిపై ప్రముఖ ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శాచురేటెడ్ ఫ్యాట్ ముప్పు..
నెయ్యిలో పోషకాలు భారీ స్థాయిలో ఉన్నప్పటికీ.. అందులో శాచురేటెడ్ ఫ్యాట్ శాతం అత్యధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మనం తినే రోటీలపై అతిగా నెయ్యి వేయడంతో పాటు.. రోజువారీ కూరల్లో నూనె, వెన్న వంటి ఇతర కొవ్వు పదార్థాలు ఎక్కువగా వినియోగిస్తే.. శరీరంలో కొవ్వు శాతం ఒక్కసారిగా పెరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని నిపునులు తెలుపుతున్నారు. ఇది దీర్ఘకాలంలో రక్తనాళాల్లో పూడికలకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. దీని కారణంగా గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు..

చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరిగేందుకు..
శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండే.. ఆహారాలు ప్రతి రోజూ అతిగా తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) విపరీతంగా.. వేగంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఎల్డీఎల్ పెరిగితే.. అది ఏకంగా ధమనులను గట్టిపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని.. రక్తప్రసరణకు కూడా తీవ్ర అంతరాయం కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి.. దీని ఫలితంగా గుండెపోటుతో పాటు అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు గణనీయంగా పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణలు తెలుపుతున్నారు. ఇప్పటికే కొలెస్ట్రాల్ లేదా గుండె సమస్యలతో బాధపడేవారు నెయ్యిని వినియోగిస్తే తగిన మోతాదులో వినియోగించాలని వారు సూచిస్తున్నారు.

బరువు పెరిగే ప్రమాదం..
నెయ్యి ఎక్కువగా ఎప్పుడు వినియోగిస్తే.. కేలరీలు ఊహించని స్థాయిలో పెరుగుతాయి. ముఖ్యంగా రోటీలపై అధికంగా నెయ్యిని వినియోగిస్తే తప్పకుండా కేలరీల పరిమాణం పెరుగుతుంది. అంతేకాకుండా శరీరక శ్రమ లేనివారు తప్పకుండా బరువు పెరిగే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీని కారణంగా కొంతమందిలో ఊబకాయం వంటి సమస్యలకు కూడా దారి తీస్తుంది. కాబట్టి శరీర బరువును అదుపులో ఉంచుకోవాలనుకునేవారు తప్పకుండా అతిగా నెయ్యిని వినియోగించకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES