• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /Ee Taram Kathalu: భర్త చేసిన మోసం.. జీవితం ముగిసిపోయిందనుకుంది.. కానీ మూడేళ్ల తర్వాత ఏమైందంటే!

Ee Taram Kathalu: భర్త చేసిన మోసం.. జీవితం ముగిసిపోయిందనుకుంది.. కానీ మూడేళ్ల తర్వాత ఏమైందంటే!

Ee Taram Kathalu: మన చుట్టూ ఎన్నో కథలు ఉంటాయి. కొన్ని మనల్ని ఆలోచింపజేస్తే.. మరికొన్ని మన జీవితానికి స్ఫూర్తినిస్తాయి. అందుకే చిన్నప్పటి నుంచి కథలు, సినిమాలు మనకు ఎంతో ఇష్టం. మన చుట్టూ ఉన్నవారి నిజ జీవిత సంఘటనలు కూడా మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. అందుకే జీ తెలుగు న్యూస్.. ఓ చిన్న ప్రయత్నంగా పాఠకులు పంచుకున్న నిజ జీవిత సంఘటనలను మీ ముందుకు తీసుకొస్తున్నాం.. ప్రతి కథలో ఓ అనుభవం, ఓ సందేశం ఉంటుంది. ఈ కథలోని వ్యక్తుల గోప్యత కోసం పేర్లు, కొన్ని వివరాలను మార్చాం..

Written ByVishnu Priya
Published: Nov 18, 2026, 22:03 IST|Updated: Nov 18, 2026, 22:08 IST
joinshare
Ee Taram Kathalu: భర్త చేసిన మోసం.. జీవితం ముగిసిపోయిందనుకుంది.. కానీ మూడేళ్ల తర్వాత ఏమైందంటే!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ee Taram Kathalu:  సిరి చిన్నప్పటి నుంచి చాలా అమాయకంగా పెరిగింది. ప్రేమ, రిలేషన్‌షిప్స్ గురించి ఆమెకు పెద్దగా తెలియదు. సినిమాలు కూడా ఎక్కువగా చూసేది కాదు. చదువుపైనే దృష్టి పెట్టేది. ఎవరైనా ఏదైనా చెబితే సులభంగా నమ్మేసేంత మంచితనం ఆమెది. చదువు పూర్తయ్యాక సిరికి మంచి  ఉద్యోగం వచ్చింది. కొంతకాలానికి తల్లిదండ్రులు అదే ప్రాంతానికి చెందిన అర్జున్ అనే యువకుడితో ఆమెకు పెళ్లి చేశారు. అర్జున్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడు. పెళ్లైన మొదటి మూడేళ్లు సిరి జీవితం చాలా సంతోషంగా సాగింది.

అయితే ఆ తర్వాత అర్జున్ తనకు ఓ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ ఉందని సిరికి పరిచయం చేశాడు. ఆమె పేరు నందిని. పెళ్లికి ముందే అర్జున్‌కు ఆమె పరిచయం ఉందని చెప్పాడు. సిరి కూడా నందినిని సొంత స్నేహితురాలిలాగే చూసింది. నందిని ఇంటికి వస్తే భోజనం పెట్టి ఎంతో ఆప్యాయంగా చూసేది. కానీ నందినికి అప్పటికే పవన్ అనే వ్యక్తితో పెళ్లయింది. అంతకుముందు పవన్‌ను ఆమె ఏడు సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే కొంతకాలానికి నందిని, అర్జున్ మధ్య ఉన్న సంబంధం గురించి పవన్‌కు అనుమానం వచ్చింది. ఇద్దరూ కలిసి బయట తిరిగిన కొన్ని ఫొటోలు అతని చేతికి వచ్చాయి. వాటిని చూసిన పవన్ తీవ్రంగా బాధపడ్డాడు. చివరకు ఆ ఫొటోలను సిరికి పంపించాడు. ఆ ఫొటోలు చూసిన సిరి ఒక్కసారిగా షాక్ అయింది. తాను ఎంతో నమ్మిన భర్త ఇలా చేశాడని ఆమె ఊహించలేకపోయింది. అర్జున్ మాత్రం “ఇకపై ఆమెతో ఎలాంటి సంబంధం ఉండదు” అంటూ సిరిని ఒప్పించే ప్రయత్నం చేశాడు.

అమాయకమైన సిరి మరోసారి అతని మాటలను నమ్మింది. కానీ పరిస్థితి మారలేదు. చివరకు ఒకరోజు అర్జున్, నందిని కలిసి ఇంట్లోనే కనిపించడంతో సిరికి నిజం పూర్తిగా అర్థమైంది. ఇక ఆ బంధంలో ఉండలేనని నిర్ణయించుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

ఆ తర్వాత నందిని భర్త పవన్, నందిని తల్లి కలిసి అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబాలను పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. అక్కడ జరిగిన పరిణామాల తర్వాత అర్జున్ తీవ్ర అవమానానికి గురై ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ ఘటన సిరిని పూర్తిగా కుంగదీసింది. కానీ ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆమెకు అండగా నిలిచారు. నెమ్మదిగా ఆమె ఆ బాధ నుంచి బయటకు వచ్చింది.

రెండు, మూడు సంవత్సరాల తర్వాత సిరి జీవితంలోకి మరో మంచి వ్యక్తి వచ్చాడు. ఆమె గతాన్ని తెలుసుకున్నప్పటికీ ఆమెను గౌరవంగా స్వీకరించాడు. ఇప్పుడు సిరి ఎంతో సంతోషంగా జీవిస్తోంది.

సిరి చెప్పిన మాట ఒక్కటే.. “జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా అక్కడితో జీవితం ఆగిపోదు. మనల్ని నిజంగా ప్రేమించే వాళ్లు మనతో ఉంటే మళ్లీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టవచ్చు.”


గమనిక: ఈ సంఘటనను జీ తెలుగు న్యూస్‌తో ఓ పాఠకురాలు పంచుకున్నారు. ఇందులోని వ్యక్తుల గోప్యతను కాపాడేందుకు పేర్లు, కొన్ని గుర్తింపు వివరాలను మార్చాం. ఈ కథనం తను మాతో పంచుకున్న అనుభవం ఆధారంగా రాస్తున్నాం.

మీ జీవితంలోనూ ఇతరులకు ధైర్యం ఇచ్చే అనుభవం ఉందా..? అయితే మీ కథ మాకు పంపండి. మీ గోప్యత కోసం పేర్లు, గుర్తింపు వివరాలను మార్చి మీ కథనాన్ని అందిస్తాం..

zeetelugunews@gmail.com మెయిల్‌కు మీ జీవిత అనుభవాలను పంపించండి.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Moral Stories