SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఎలుకలను చంపాల్సిన పనిలేదు.. వంటింట్లోని ఈ ఒక్క వస్తువు మూలన పెడితే చాలు, పారిపోతాయి!

ఇంట్లో ఎలుకల బెడద నిత్యం ఎదురవుతున్నవారికి అది ఎంత చికాకు కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా వర్షాకాలంలో వీటి తీవ్రత మరింత పెరిగి, పదేపదే ఇంట్లోకి వస్తుంటాయి. అయితే వాటిని చంపాల్సిన అవసరం లేకుండానే, కొన్ని చిట్కాలతో సులభంగా ఇంట్లో నుంచి తరిమికొట్టవచ్చు.

Written By Renuka Godugu
Published: Sep 25, 2026, 02:09 PM IST | Updated: Sep 25, 2026, 02:12 PM IST
Image Credit: Get Rid of Rats Naturally
Join

Get Rid of Rats Naturally: ఇంట్లో ఎలుకలు ఉంటే అవి దుస్తులను కొరికేయడమే కాకుండా వస్తువులను కూడా పాడుచేస్తాయి. కిచెన్‌లో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. ఎలుకలు అక్కడ మలమూత్ర విసర్జన చేయడం వల్ల దుర్వాసన వస్తుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ర్యాట్ ప్యాడ్స్ ఏర్పాటు చేసినా అవి అంత సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు. వర్షాకాలంలో ఎలుకల సంఖ్య పెరగడం వల్ల ఇవి ఇంట్లోకి ప్రవేశించి వింత శబ్దాలు చేస్తూ పిల్లలను భయబ్రాంతులకు గురిచేస్తాయి. అంతేకాకుండా, ఎలుకలు కొరికే వస్తువులు లేదా ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, ఎలుకలను చంపకుండానే వాటిని తరిమికొట్టడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఎలుకలను పారద్రోలడానికి మీరు ఇంట్లోనే ఒక సహజమైన స్ప్రేను తయారు చేసుకోవచ్చు. దీని కోసం కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు, కేవలం పుదీనాను ఉపయోగిస్తే సరిపోతుంది. పుదీనా యొక్క ఘాటు వాసనను ఎలుకలు తట్టుకోలేవు. ఇంట్లోని కిటికీల వద్ద మరియు ఎలుకలు లోపలికి వచ్చే మార్గాల్లో ఈ స్ప్రేని చల్లితే, అవి ఇంట్లోకి రాకుండా పారిపోతాయి.

దీని కోసం పుదీనా ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేసి, ఎలుకలు తిరిగే ప్రదేశాలలో చల్లవచ్చు. లేదా పుదీనా ఆకులను నీటిలో బాగా ఉడకబెట్టి, ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపుకుని కూడా స్ప్రే చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఎలుకలను పారద్రోలవచ్చు.
ఇంకా కొన్ని జాగ్రత్తలుగా.. తలుపులు, కిటికీల వద్ద స్క్రీన్‌లను ఏర్పాటు చేయండి మరియు ఎక్కడా ఖాళీలు లేకుండా చూసుకోండి. ఎలుకలకు చెత్త వాసన అంటే ఇష్టం కాబట్టి, ఇంట్లో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. ఇంట్లోని మూలలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. ఇలా సహజమైన పద్ధతులను పాటించడం వల్ల కెమికల్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు లేకుండా, ఎలుకలను చంపకుండానే వాటిని ఇంట్లోకి రాకుండా నివారించవచ్చు.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES