• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /ఉదయాన్నే పరగడుపున బిర్యానీ ఆకు నీళ్లు తాగితే... కొవ్వు కరిగి, అదుపులోకి షుగర్ లెవల్స్!

ఉదయాన్నే పరగడుపున బిర్యానీ ఆకు నీళ్లు తాగితే... కొవ్వు కరిగి, అదుపులోకి షుగర్ లెవల్స్!

సాధారణంగా మనం వంటల్లో బిర్యానీ ఆకును ఉపయోగిస్తుంటాం. బిర్యానీ వండేటప్పుడు ఇది మంచి రుచిని ఇవ్వడమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. దీనినే 'తేజ్‌ పత్తా' అని కూడా పిలుస్తారు. అయితే, బిర్యానీ ఆకును తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Sep 14, 2026, 03:45 PM IST|Updated: Sep 14, 2026, 03:50 PM IST
joinshare
ఉదయాన్నే పరగడుపున బిర్యానీ ఆకు నీళ్లు తాగితే...  కొవ్వు కరిగి, అదుపులోకి షుగర్ లెవల్స్!
Image Credit: Bayleaf Benefits

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bayleaf Benefits: మన వంటగదిలోని మసాలా డబ్బాలో బిర్యానీ ఆకు అందుబాటులో ఉంటుంది. ఇది వంటలకు మంచి సువాసనను, రుచిని ఇస్తుంది. ఇందులో ఎసెన్షియల్ ఆయిల్స్ , ఔషధ గుణాలు ఉంటాయి. సాధారణంగా మనం ఎండబెట్టిన బిర్యానీ ఆకును వంటల్లో వాడుతుంటాం. కొన్ని నివేదికల ప్రకారం, దీనిలో మెడిసినల్ గుణాలు ఉండటం వల్ల, దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఐదు రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

జీర్ణ ఆరోగ్యం:
బిర్యానీ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది అజీర్తి, కడుపులో గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. ఇది కడుపులోని కండరాలను సడలించి, ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి ప్రేరేపిస్తుంది. మన ఆహారాన్ని తక్షణ శక్తిగా మార్చే గుణం దీనికి ఉంది. పూర్వ కాలం నుండి కూడా దీనిని ఔషధంగా వాడుతున్నారు, ఎందుకంటే ఇది జీర్ణ ఎంజైముల ఉత్పత్తికి సహాయపడి ఆహారాన్ని సమర్థవంతంగా విడగొడుతుంది.

డయాబెటిస్:
డయాబెటిస్ ఉన్నవారు కూడా బిర్యానీ ఆకును ఉపయోగించుకోవచ్చు. రాత్రిపూట బిర్యానీ ఆకును నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నీటిని వడగట్టుకుని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా అదుపులో ఉంచుతుంది. బయో కెమిస్ట్రీ న్యూట్రిషన్ జర్నల్ ప్రకారం, టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది.

రెస్పిరేటరీ కేర్..
బిర్యానీ ఆకు వల్ల జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే సువాసన వల్ల రొంప ఇతర శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉపశమిస్తాయి. అంతేకాకుండా, ఇది ఆస్తమా వంటి సమస్యలు రాకుండా నిరోధించడంలో కూడా సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం..
బిర్యానీ ఆకు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించే గుణం కూడా ఇందులో ఉంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి రక్షించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

స్ట్రెస్ రిలీఫ్..
బిర్యానీ ఆకులో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఉంటాయి. అధిక పని ఒత్తిడి లేదా చదువుల వల్ల మానసిక ఒత్తిడికి గురయ్యే వారు దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది యాంగ్జయిటీ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ బిర్యానీ ఆకు నానబెట్టిన నీటిని తీసుకోవడం మంచి అలవాటు.

Also Read: అరటిపండు కంటే పవర్‌ఫుల్! ఈ ట్రోపికల్ ఫ్రూట్ తింటే శరీరంలో మార్పులు ఖాయం.. 

Also Read: డాక్టర్‌ రికమండ్ చేసిన డ్రింక్స్.. కీళ్ల నొప్పులు, బాడీ వాపులను తగ్గించే 5 పానీయాలు!

బిర్యానీ ఆకును కేవలం నీళ్లలోనే కాకుండా, సూప్‌లు లేదా ఏదైనా కూరల్లో వాడుకోవడం ద్వారా కూడా మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం దీనిని నీళ్లలో వేసుకుని లేదా టీ రూపంలో కూడా మీ రోజువారీ అలవాటులో భాగంగా చేసుకోవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News