నాన్-స్టిక్ కోటింగ్ పాడవకుండా ప్యాన్ అంచుల జిడ్డును వదిలించే సీక్రెట్ ట్రిక్!
నాన్ స్టిక్ ప్యాన్ రెగ్యులర్‌గా ఇంట్లో వాడుతూ ఉంటాం. దీనిపై రిసిపీలు స్టిక్ అవ్వకుండా ఉంటాయి. సాధారణంగా మనం రిసిపీలు తయారు చేసినప్పుడు వాటి అంచులకు జిడ్డు ఎంత శుభ్రం చేసినా అలాగే పట్టేస్తుంది. త్వరగా వదలకుండా పోతుంది. ఎక్కువగా ఆయిల్ వాడుతూ ఉంటాం కాబట్టి వాటి ఆనవాళ్లు అలాగే ఉండిపోయి రానురాను గట్టిగా పట్టేసుకుంటుంది. అయితే, నాన్ స్టిక్ ప్యాన్ బలంగా రుద్ది కడగలేం. చూడటానికి ఇది డల్‌గా మారిపోతుంది. అయితే, నాన్ స్టిక్ ప్యాన్ సులభంగా జిడ్డు వదిలిపోవడం చాలా ఈజీ.
Non-Stick Pan Stubborn Grease: నాన్ స్టిక్ పాత్రలు కడిగేటప్పుడు ఇతర పాత్రల మాదిరి గట్టిగా రుద్ది కడగకూడదు. ఎందుకంటే నాన్ స్టిక్ కోటింగ్ పాడవుతుంది. ఇందులో ఎక్కువగా ఆయిల్ ఫుడ్ వండుతాం. నిత్యం దోశ, చపాతీలు వేసుకుంటాం.. కాబట్టి గట్టిగా పట్టేస్తుంది. ఇంట్లోని చిన్ని చిట్కాలు పాటిస్తే సులభంగా నాన్ స్టిక్ కోటింగ్ వదలకుండానే ఈజీగా జిడ్డును వదిలించేయవచ్చు. మీ వద్ద స్ట్రాంగ్ క్లెన్సర్, ఒక స్క్రబ్బర్ ఉంటే సరిపోతుంది. చిన్నపాటి స్టెప్స్‌తో మీరు నాన్ స్టిక్ పాడవకుండానే జిడ్డును వదిలించేయవచ్చు.
సోప్ వాటన్, వేడినీళ్లు..
ముందుగా బాగా జిడ్డుపట్టి ఉన్న నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. అందులో గోరువెచ్చని నీరు నిండుగా పోయండి. ఇందులోనే కొన్ని చుక్కల మైల్డ్ డిష్ వాషింగ్ లిక్విడ్ కూడా పోయాలి. ఇప్పుడు మృదువైన స్పాంజ్ లేదా గుడ్డ తీసుకుని తుడవండి. ప్రధానంగా జిడ్డుగా మారిపోయిన నాన్ స్టిక్ ప్యాన్ అంచులను రాయండి. కాసేపు ఓ 15 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. ఇప్పుడు అంటుకున్న జిడ్డు ఊడి వస్తుంది. దీంతో మీరు శుభ్రం చేయడం సులభం అవుతుంది.
బేకింగ్ సోడా వాడండి..
ఇప్పటికీ గ్రీజ్ అలాగే ఉంటే బేకింగ్ సోడాతో పేస్ట్ తయారు చేయండి. కేవలం జిడ్డు ఎక్కువగా పట్టిన ప్రాంతంలో అప్లై చేయండి. కొన్ని నిమిషాలు అలాగే ఉండనివ్వండి. ఇప్పుడు మృదువైన స్పాంజ్ తీసుకొని రబ్ చేయాలి. గట్టిగా స్క్రబ్ చేయడం వల్ల కోటింగ్ ఊడిపోయే ప్రమాదం ఉంది.
వైట్ వెనిగర్..
వైట్ వెనిగర్ కూడా జిడ్డును త్వరగా వదిలించేస్తుంది. వెనిగర్, నీటిని సమపాళ్లలో తీసుకోండి. ఇప్పుడు మృదువైన గుడ్డను తీసుకుని ప్యాన్ అంచులు రుద్దండి. అయితే, వెనిగర్ పెట్టి ఎక్కువ సమయంపాటు ప్యాన్ అలాగే ఉంచకూడదు. వెంటనే డిష్ వాష్ సోప్ లేదా లిక్విడ్‌తో రుద్దండి.
స్టీల్, గట్టి స్క్రబ్బర్ వాడకండి..
స్టీల్ స్ర్కబ్బర్ వాడితే త్వరగా జిడ్డు వదిలిపోతుందిలే అనుకుంటారు. కానీ, గ్రీజ్ అంత సులభంగా రాదు.. గట్టిగా రుద్దితే నాన్ స్టిక్ పైన స్క్రాచ్ పడే అవకాశం ఉంటుంది. మృదువైన స్పాంజ్, మైక్రోఫైబర్ గుడ్డను ఉపయోగించాలి.
ప్యాన్ ఆరబెట్టండి..
నాన్ స్టిక్ ప్యాన్ నుంచి గ్రీజ్ వదిలిపోతే వెంటనే ఆరబెట్టండి. మంచి టవల్ ఉపయోగించి శుభ్రం చేయండి. ఎక్కడైనా ప్యాన్ అంచులు తడిగా ఉండే గుడ్డతో శుభ్రం చేయండి. వాడిన వెంటనే ప్యాన్ శుభ్రం చేస్తే అంచులు ఇలా గ్రీజ్‌గా మారిపోవు. నాన్ స్టిక్ ప్యాన్ ఇలా శుభ్రం చేస్తే ఎక్కువ రోజులపాటు బాగుంటాయి.