SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రోజూ వాడే స్టీల్ బాటిల్‌ను ఇలా క్లీన్ చేస్తే.. క్రిములు మాయం, ఆరోగ్యానికి ఢోకా ఉండదు!

సాధారణంగా మనం ప్రతిరోజూ వాటర్‌ బాటిల్‌ ఆఫీస్‌, స్కూలుకు వెళ్లినా తీసుకు వెళ్తాం. అయితే, ఈ మధ్య కాలంలో స్టీల్‌ వాటర్‌ బాటిల్‌ ఉపయోగించడం ఎక్కువైంది. నీరు, టీ, కాఫీలు కూడా తీసుకు వెళ్తాం. అయితే, ఈ బాటిల్‌లో కోల్డ్‌, హాట్‌ రెండూ డ్రింక్స్‌ కూడా ఉపయోగిస్తాం. అయితే, రోజూ వాడే ఈ స్టీల్‌ వాటర్‌ బాటిళ్లు ఎలా శుభ్రం చేయాలి? తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Sep 15, 2026, 03:08 PM IST | Updated: Sep 15, 2026, 03:13 PM IST
Image Credit: How to Clean Stainless Steel Water Bottles
Join

How to Clean Stainless Steel Water Bottles: మనం ప్రతిరోజూ ఉపయోగించే స్టీల్‌ వాటర్‌ బాటిల్‌ కాస్త మాములుగా శుభ్రం చేయకూడదు. ఇంట్లో ఉండే పదార్థాలతోనే శుభ్రం చేస్తే తళతళ మెరవడమే కాకుండా బ్యాక్టిరియా కూడా తొలగిపోతుంది. ఈ మధ్యకాలంలో స్టీల్‌ వాటర్‌ బ బాటిల్‌ వాడకం ఎక్కువైంది. అయితే, రోజూ వాడతాం కాబట్టి కాస్త శుభ్రం చేయడం కూడా మెరుగ్గా ఉండాలి. స్టీల్‌ వాటర్‌ బాటిల్‌లో చల్లని లేదా వేడి నీరు, కాఫీ లేదా టీ కూడా నిల్వ చేసుకుంటాం. రోజూ వాడే ఈ స్టీల్‌ బాటిల్‌లో దుర్వాసన కూడా వస్తుంది.  ప్రధానంగా బాటిల్‌ లోపలి భాగంలో అడుగున శుభ్రం చేయడం కష్టతరం అవుతుంది.  అందుకే ఈ బాటిల్‌ను చాలా జాగ్రత్తగా శుభ్రం చేయాల్సి ఉంటుంది.

బేకింగ్‌ సోడా..
బేకింగ్‌ సోడాతో మరకలు, దుర్వాసన సులభంగా తొలగిపోతుంది. ఈ సోడాతో మీ స్టీల్‌ వాటర్‌ బాటిల్‌ కూడా తళతళ మెరిసిపోతుంది. లోతుగా వెళ్లి బ్యాక్టిరియా లేకుండా మీ బాటిల్‌ను క్లీన్‌ చేస్తుంది. గోరువెచ్చని నీరు, బేకింగ్‌ సోడా కలిపి శుభ్రం చేయండి.

వెనిగర్‌, గోరు వెచ్చని నీరు..
వైట్‌ వెనిగర్‌ సహజంగా క్లీనింగ్‌ ఏజెంట్‌గా పని చేస్తుంది. ఇది గిన్నెలు, బాటిల్‌పై మిగిలిన ఆహార పదార్థాలను కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తుంది.  ముందుగా గోరు వెచ్చని నీటిని బాటిల్‌ నిండా నింపాలి. ఆ తర్వాత ఇందులో వెనిగర్‌ కూడా వేయాలి. అలాగే ఓ అరగంటపాటు వదిలేయండి. ఆ తర్వాత బాగా కదుపుతూ శుభ్రం చేయండి. దుర్వాసన లేకుండా శుభ్రం అయిపోతుంది.

నిమ్మకాయ, ఉప్పు..
నిమ్మకాయ ఉప్పు కూడా కలిపి స్టీల్‌ వాటర్‌ బాటిల్‌ను శుభ్రం చేయవచ్చు. నిమ్మరసంలో ఒక చిటికెడు ఉప్పు వేసి బాటిల్‌ బాగా కదుపుతూ  క్లీన్‌ చేయాలి. ఇది కూడా బాటిల్‌ నుంచి దుర్వాసనను పోగొడుతుంది.

మూత కూడా ప్రత్యేకం..
బాటిల్‌ మూత మరింత ప్రత్యేకంగా శుభ్రం చేయాలి. ఇది ఎప్పుడూ మాయిశ్చర్‌గా ఉంటుంది. కాబట్టి బ్యాక్టిరియా ఎక్కువగా పేరుకుంటుంది. దీన్ని ప్రత్యేకంగా క్లీన్‌ చేయాల్సి ఉంటుంది. మూత కూడా గోరు వెచ్చని నీరు సోప్‌ వాటర్‌తో కడగాలి.

ఆరబెట్టడం కూడా..
స్టీల్‌ వాటర్‌ బాటిల్‌ను శుభ్రం చేయడం మాత్రమే కాదు.. వాటిని సరిగ్గా ఆరబెట్టాలి కూడా. దీంతోనే బాటిల్‌ క్లీనింగ్‌ వర్క్‌ పూర్తవుతుంది. బాటిల్‌, క్యాప్‌ రెండూ శుభ్రం చేసిన తర్వాత కాస్త గాలికి ఆరబెట్టాలి. అదనంగా దుర్వాసన ఏమైనా ఉంటే తగ్గిపోతుంది. ప్రతిరోజూ ఈ బాటిల్‌ వాడతాం కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

Also Read: అరటిపండు కంటే పవర్‌ఫుల్! ఈ ట్రోపికల్ ఫ్రూట్ తింటే శరీరంలో మార్పులు ఖాయం.. 

Also Read: డాక్టర్‌ రికమండ్ చేసిన డ్రింక్స్.. కీళ్ల నొప్పులు, బాడీ వాపులను తగ్గించే 5 పానీయాలు!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES