International mens day 2026 history and key role in family: ప్రస్తుతం ఒకప్పటి పాత తరం ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. పూర్వకాలంలో మగాళ్లు, ఆడవళ్లు అని వేర్వేరుగా చూసేవారు. మహిళలు ఈ పనులు మాత్రమే చేయాలి. మగాళ్లు ఇవి మాత్రమే చేయాలని గిరిగీసుకుని ఉండేవారు. అదే విధంగా కొన్ని తరాలు కూడా ఈ సంప్రదాయాల్ని పాటించారు. కానీ ప్రస్తుతం ట్రెండింగ్ అంతా మారిపోయింది. అర్ధనారీశ్వరుడిలా మహిళలు చేసే ప్రతి పనిని మగాళ్లు కూడా బాధ్యతతోషేర్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఆడవాళ్లు వంటింటికి, పిల్లల్ని చూసుకొవడానికి పరిమితం అయ్యే వారు. కానీ ఇప్పుడు వారు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో వంట, పిల్లల బాధ్యతల్ని మగాళ్లు కూడా చూసుకుంటున్నారు. బాధ్యతలు కూడా సమంగా పంచుకుంటున్నారు.
ఒకరికొకరు అండగా ఉంటూ కాడికి రెండు ఎద్దుల్లా సమంగా కుటుంబ బాధ్యతల్ని మోస్తున్నారు. ఇది మహిళలే చేయాలి అనే ధోరణి పూర్తిగా మారిపోయింది. పురుషులు సైతం ఆడవారికి అన్ని విషయాల్లో అండగా ఉంటున్నారు. ఒక తల్లికి బిడ్డలా ఆ తర్వాత ఇంటి బాధ్యతల్ని తీసుకుంటున్నారు. తండ్రికి వారసుడిలా తన బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు. ఒక భార్యకు భర్తలా,తమ పిల్లలకు తండ్రిలా, అక్కాచెల్లెమ్మలకు అన్నతమ్ముడిలా ఉంటూ, ఒక మంచి స్నేహితుడిలా అన్ని బాధ్యతలు కూడా మగాడు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
మనసులో ఎంత ఒత్తిడి, వేదన ఉన్న కూడా కనీసం మగాడు నోరు విడిచి పైకి చెప్పుకోలేడు. ఇప్పటికి మగాడు పైకి కన్నీళ్లు పెట్టుకుంటే ఆడవాళ్లాలా ఏడుస్తావేంటని అంటారని.. తన మనసులో ఎంత బాధ ఉన్న కూడా వాటిని దిగమింగుకుని తన బాధ్యతలు నిర్వహిస్తాడు. అలాంటి బాధ్యత గల మగ మహారాజులందరికి అంకితం చేస్తు అంతర్జాతీయ పురుషుల దినోత్సవంను ప్రతి ఏటా నవంబర్ 19న మనం నిర్వహించుకుంటున్నాం.
నవంబర్ 19న ఎందుకంటే..?..
అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని 1999లో ట్రినిడాడ్, టొబాగోలోని వెస్ట్ ఇండీస్ విశ్వవిద్యాలయంలో చరిత్ర ప్రొఫెసర్ అయిన జెరోమ్ టీలుక్‌సింగ్ స్థాపించారు. తన తండ్రి పుట్టిన రోజు నేపథ్యంలో నవంబర్ 19 ఆయన తండ్రి జన్మదినం కావడంతో ఆ రోజున అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నేపథ్యంలో దీన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం 80కి పైగా దేశాలలో దీనిని గుర్తిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం తన 28వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో.. ఈ ఏడాది "భవిష్యత్తు అందరిదీ" అనే ఇతివృత్తాతంతో దీన్ని నిర్వహించుకుంటున్నాం.