• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /ప్రతి విద్యార్థీ తెలుసుకోవాల్సిన మహానాయకుడి కథ..శాస్త్రిజీ బయోగ్రఫీ.. నేటి తరానికి గొప్ప పాఠం!

ప్రతి విద్యార్థీ తెలుసుకోవాల్సిన మహానాయకుడి కథ..శాస్త్రిజీ బయోగ్రఫీ.. నేటి తరానికి గొప్ప పాఠం!

Lal Bahadur Shastri Biography: ప్రతి ఏటా అక్టోబర్ 2వ తేదీ రాగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది గాంధీ జయంతి. అయితే.. అదే పవిత్రమైన రోజున భరతమాత కన్న మరొక మహానాయకుడు, భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కూడా జన్మించారు. గాంధీజీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెస్తే.. శాస్త్రిజీ తన నిరాడంబరత, ధైర్యసాహసాలతో స్వతంత్ర భారతాన్ని ప్రగతి పథంలో నడిపించారు.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 02, 2026, 10:54 AM IST|Updated: Oct 02, 2026, 10:55 AM IST
joinshare
ప్రతి విద్యార్థీ తెలుసుకోవాల్సిన మహానాయకుడి కథ..శాస్త్రిజీ బయోగ్రఫీ.. నేటి తరానికి గొప్ప పాఠం!
Image Credit: Lal Bahadur Shastri Biography

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
నవరాత్రుల్లో సూర్యుడి ఎఫెక్ట్‌.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్‌ జాక్‌ఫాట్, బంపర్‌ లాభాలు!

నవరాత్రుల్లో సూర్యుడి ఎఫెక్ట్‌.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్‌ జాక్‌ఫాట్, బంపర్‌ లాభాలు!

2

CEC జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు కోరుతూ రోడ్డెక్కిన CJP.. ముంబైలో హైడ్రామా..

3

AP 3D Printed House: ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ విప్లవం..రూ.5 లక్షలకే పేదలకు 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్లు..

4

అక్టోబర్ 4న సూర్య, శని గ్రహాల అరుదైన యోగం.. ఈ 3 రాశులకు ధనలాభం, బంపర్ జాక్‌ఫాట్!

5

ప్రతి విద్యార్థీ తెలుసుకోవాల్సిన మహానాయకుడి కథ..శాస్త్రిజీ బయోగ్రఫీ.. నేటి తరానికి గొప్ప పాఠం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Lal Bahadur Shastri Biography: ప్రతి ఏటా అక్టోబర్ 2వ తేదీ రాగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది గాంధీ జయంతి. అయితే.. అదే పవిత్రమైన రోజున భరతమాత కన్న మరొక మహానాయకుడు, భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కూడా జన్మించారు. గాంధీజీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెస్తే.. శాస్త్రిజీ తన నిరాడంబరత, ధైర్యసాహసాలతో స్వతంత్ర భారతాన్ని ప్రగతి పథంలో నడిపించారు.

జననం.. తొలి అడుగులు:
లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొఘల్‌సరాయ్‌ గ్రామంలో శారదా ప్రసాద్ రాయ్, రామ్‌దులారీ దేవి దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా, స్వయంకృషితో చదువుకుని ఉన్నతమైన ఆదర్శాలను అలవర్చుకున్నారు. చిన్ననాటి నుంచి కష్టాలను అనుభవించడం వల్లే ఆయన ప్రజా సమస్యలను సులువుగా అర్థం చేసుకోగలిగారు.

దేశానికి రెండవ ప్రధానిగా బాధ్యతలు:
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మరణానంతరం.. తాత్కాలిక ప్రధానిగా గుల్జారీలాల్ నందా కొద్దిరోజులు సేవలందించారు. ఆ తర్వాత దేశానికి రెండవ పూర్తిస్థాయి ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి బాధ్యతలు స్వీకరించారు. కాకిలా కలకాలం జీవించడం కంటే హంసలా కొద్దికాలం జీవించినా సమాజానికి మేలు చేయాలనే సిద్ధాంతాన్ని శాస్త్రిజీ విశ్వసించారు. ప్రధానిగా ఆయన పనిచేసింది స్వల్పకాలమే అయినా, భారత రాజకీయ యవనికపై చెరిపివేయలేని ముద్ర వేశారు.

1965 పాక్ యుద్ధం ..జై జవాన్ జై కిసాన్:
1965లో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం సంభవించినప్పుడు శాస్త్రిజీ అసాధారణమైన ధైర్యసాహసాలను, వ్యూహాత్మక ఆలోచనను ప్రదర్శించారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్ కుతంత్రాలను తిప్పికొట్టారు. ఆ సమయంలో దేశంలో ఏర్పడిన ఆహార కొరతను, సరిహద్దు భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయన ఇచ్చిన 'జై జవాన్ - జై కిసాన్' నినాదం దేశంలోని ప్రతి పౌరుడిలో దేశభక్తిని, ఐక్యతను రగిల్చింది. సరిహద్దులో పోరాడే సైనికుడికి, చేనులో కష్టపడే రైతుకు సమప్రాధాన్యత ఇస్తూ ఆయన దేశాన్ని విజయపథంలో నడిపారు.

తాష్కెంట్ ఒప్పందం.. వీడని మరణ మిస్టరీ:
1965 యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయం తర్వాత, ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో యుద్ధ విరమణ చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా 1966 జనవరి 10న సోవియట్ యూనియన్‌లోని తాష్కెంట్ (ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్) నగరంలో శాస్త్రిజీ పాకిస్తాన్‌తో శాంతి ఒప్పందంపై సంతకం చేశారు.

అయితే.. ఒప్పందం జరిగిన మరుసటి రోజే (1966 జనవరి 11న) ఆయన గుండెపోటుతో కన్నుమూశారని ప్రకటించారు. ఒక విదేశీ గడ్డపై, ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే దేశాధినేత అనుమానాస్పద స్థితిలో మరణించడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఘటన. శాస్త్రిజీ మరణంపై సమగ్రమైన విచారణ జరగకపోవడం, దానికి సంబంధించిన పత్రాలు అందుబాటులో లేకపోవడం నేటికీ ఒక వీడని మిస్టరీగానే మిగిలిపోయింది.

చరిత్రలో తొలి  మరణానంతర భారతరత్న:
లాల్ బహదూర్ శాస్త్రిజీ స్వచ్ఛమైన వ్యక్తిత్వానికి, నీతి, నిజాయితీ, త్యాగ నిరతికి నిదర్శనం. ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన  భారతరత్నతో గౌరవించింది. మరణించిన తర్వాత భారతరత్న అందుకన్న మొట్టమొదటి వ్యక్తిగా లాల్ బహదూర్ శాస్త్రి చరిత్రలో నిలిచిపోయారు. ఆడంబరాలకు దూరంగా బతికిన ఈ మహానాయకుడి జీవితం ప్రతి భారతీయుడికి నిత్య స్ఫూర్తిదాయకమని చెప్పాలి..

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News