నిమ్మకాయలు వాడిపోతున్నాయా? నీళ్లలో ఇలా పెడితే 2 నెలలు ఫ్రెష్‌గా ఉంటాయి!
నిమ్మకాయలు ప్రతి వంటగదిలో ఉండాల్సిందే. ఇందులో విటమిన్ సీ ఉంటుంది. దీంతో పులిహోర, నాన్ వెజ్‌లకు కూడా వాడతాం. కాబట్టి నిమ్మకాలు ఇంట్లో ఉండాల్సిందే. అయితే, ఎక్కువ రోజులపాటు నిమ్మకాయలు నిల్వ ఉండవు, వాడిపోతుంటాయి. దీంతో వాటిని పారేయకతప్పదు. అయితే, ఇలా చేస్తే నిమ్మకాయలు ఎక్కువ కాలంపాటు పాడవ్వవు.
నిమ్మకాయలు మార్కెట్‌లకు వెళ్లినప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తాం. అయితే ఒక్కోసారి ఫ్రిజ్‌లో పెట్టినా కూడా నిమ్మకాయలు పాడవుతాయి. చాలా మంది నిమ్మకాయలు సరిగ్గా స్టోర్ చేయరు. దీంతో అవి కుళ్లిపోవడం లేదా వాడిపోవడం జరుగుతాయి. ఇంట్లో మీరు నిమ్మకాయలు స్టోర్ చేసే పద్ధతి మార్చుకుంటే అవి రెండు నెలలు కూడా పాడవ్వకుండా ఉంటాయి.
నిమ్మకాయలు మీరు కూడా ఎక్కువగా కొనుగోలు చేశారా? వాటిని నిల్వ చేయలేక పోతున్నారా? కొన్ని రోజులకే పారేయాల్సి వస్తుంది.
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తికి సహాయపడతాయి.
మీరు తినే వంటలో నిమ్మరసం పిండుకుంటే మంచి ట్యాంగీ రుచి కూడా డిష్‌కు ఇస్తుంది.
ఈ నిమ్మకాయలో విటమిన్ సీ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది
నిమ్మకాయలు స్టోర్ చేసే విధానం..
నిమ్మకాయలు సులభంగా నిల్వ చేసుకోవచ్చు. వాటిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టాలి. అవి మునిగే వరకు నీళ్లను నింపండి. ఆ తర్వాత గాలి చొరబడకుండా మూత పెట్టండి. దీంతో నిమ్మకాయలు పాడవ్వకుండా ఉంటాయి.
నిమ్మకాయలు కడిగి నీటి చుక్క లేకుండా తుడవండి. ఆ తర్వాత వాటిని ఒక టిష్యూ పేపర్‌లో చుట్టండి. ఒక్కో నిమ్మకాయను ఒక్కో పేపర్‌లో చుట్టండి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో నిల్వ చేయండి. దీనికి బదులు జిప్ లాక్ బ్యాగ్‌ను కూడా ఉపయోగించవచ్చు. వీటిని రిఫ్రిజిరేటర్‌లో పెడితే ఎక్కువ కాలంపాటు తాజాగా ఉంటాయి.
నిమ్మకాయలను కడిగిన తర్వాత వాటిని ఆరబెట్టండి. ఇప్పుడు పై నుంచి నూనె రుద్దండి. ఇంట్లో వాడే ఏ వంట నూనె అయినా ఉపయోగించవచ్చు. ఇప్పుడు వీటిని కంటైనర్‌లో పెట్టి ఫ్రీజర్‌లో నిల్వ చేసుకోవచ్చ. ఈ ఆయిల్ లేయర్ నిమ్మకాయను మాయిశ్చర్ కాకుండా చేస్తుంది. అవి ఎక్కువ కాలంపాటు పాడవ్వకుండా ఉంటాయి.
ఇలా నిమ్మకాయలు ఇంటికి తీసుకువచ్చి.. పాడయ్యాక పారేయకుండా.. ఎక్కువ కాలంపాటు నిల్వ చేసుకోవచ్చు. ఈసారి నిమ్మకాయలు తీసుకువస్తే ఇలా స్టోర్ చేయండి. మీకు కావాల్సినప్పుడు వెంటనే ఉపయోగించండి.