• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /చెప్పుడు మాటలు వింటే.. కష్టాలు తప్పవు అని చెబుతున్న తండ్రి-కొడుకు-గుర్రం నీతికథ..!!

చెప్పుడు మాటలు వింటే.. కష్టాలు తప్పవు అని చెబుతున్న తండ్రి-కొడుకు-గుర్రం నీతికథ..!!

Moral Story: ఇతరుల చెప్పుడు మాటలు, ఉచిత సలహాలు వింటూ పోతే మన సొంత విచక్షణ కోల్పోయి పెద్ద నష్టాల పాలవుతాం. లోకంలో అందరినీ మెప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. మన పరిస్థితులకు తగ్గట్లుగా, ఏది ధర్మమో మనమే సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 01, 2026, 03:54 PM IST|Updated: Oct 01, 2026, 03:56 PM IST
joinshare
చెప్పుడు మాటలు వింటే.. కష్టాలు తప్పవు అని చెబుతున్న తండ్రి-కొడుకు-గుర్రం నీతికథ..!!
Image Credit: Moral Story

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Moral Story: అనగనగా ఒక అందమైన గ్రామంలో ఒక రైతు, అతని కుమారుడు నివసిస్తుండేవారు. వారు సొంత పనుల కోసం, ఇంటికి కావలసిన కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనడానికి పక్కనే ఉన్న పెద్ద పట్టణంలోని బజారుకు బయలుదేరి వెళ్ళారు. రోజంతా బజారంతా తిరిగి అనేక వస్తువులను చూశారు. కానీ, అక్కడ వాళ్ళకు నచ్చిన వస్తువేదీ దొరకలేదు.

చిట్టచివరకు వాళ్ళు పట్టణంలో ఉన్న పశువుల సంతకు, గుర్రాల అమ్మకాల వద్దకు వెళ్ళారు. అక్కడ ఒక బలంగా, ఎత్తుగా ఉన్న నల్లటి గుర్రం రైతుకు చాలా బాగా నచ్చింది. కొడుకు కూడా ఆ గుర్రాన్ని చూసి సంబరపడి, "నాన్నగారూ! ఈ గుర్రం చాలా బాగుంది, దీనిని కొందాం" అని ఒప్పుకోవడంతో రైతు మంచి ధర చెల్లించి ఆ గుర్రాన్ని కొన్నాడు.

కొత్త గుర్రాన్ని తీసుకుని తండ్రీ కొడుకులు తమ ఊరి వైపు కాలినడకన బయలుదేరారు. చాలా దూరం నడిచేసరికి వేసవి ఎండ తీవ్రతకు, ప్రయాణ అలసటకు వాళ్ళిద్దరికీ బాగా నీరసం వచ్చింది. "కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి కదా, పైగా డబ్బులు పెట్టి కొన్న గుర్రం ఉండి కూడా మనం నడవడమెందుకు?" అని ఆలోచించి, వాళ్ళిద్దరూ ఒకేసారి ఆ నల్ల గుర్రమెక్కి హాయిగా ఇంటికి పోసాగారు.

కొద్దిదూరం వెళ్ళేసరికి దారిలో కొందరు దారినోయే మనుషులు వాళ్ళని చూసి, ఒకరినొకరు గుసగుసలాడుకుంటూ, “ఆహా! ఎంత చక్కని, అందమైన గుర్రము! కానీ పాపం ఆ మూగజీవి ఎందుకో చాలా విచారంగా, అలసిపోయినట్లుంది. ఎద్దుల లాంటి ఇద్దరు బలిసిన మనుషులను ఆ ఒక్క గుర్రం మోయలేకపోతోంది కాబోలు! వీళ్ళకు కొంచెమైనా దయా దాక్షిణ్యాలు లేవు” అని బిగ్గరగా అన్నారు.

ఆ మాటలు విన్న తండ్రీ కొడుకులకు చాలా సిగ్గనిపించింది. "అయ్యో! జనాలు మనల్ని దయలేనివాళ్ళని అనుకుంటున్నారు" అని అనుకుని, వెంటనే రైతు కిందకు దిగాడు. తన కుమారుణ్ణి మాత్రమే గుర్రంపై కూర్చోబెట్టి, తాను పక్కన నడుస్తూ వెళ్ళసాగాడు.

మధ్యలో వారొక పెద్ద బజారు గుండా పోవలసి వచ్చింది. అక్కడి జనం వీళ్ళని చూసి ముక్కున వేలేసుకుని, "చూడండి! ఆ కొడుకెంత దుర్మార్గుడో, సంస్కారం లేనివాడో! కన్న ముసలి తండ్రి అంత ఎండలో కష్టపడుతూ నడచివస్తుంటే, తాను మాత్రం ఏమీ పట్టనట్లు హాయిగా గుర్రంపై కూర్చొని స్వారీ చేస్తున్నాడు. ఎంత సిగ్గుచేటు! ఈ రోజుల్లో పిల్లలకు పెద్దలంటే గౌరవమే లేకుండా పోయింది" అని ఈసడించుకున్నారు.

ఆ మాటలు వినగానే కొడుకు ముఖం చెమర్చింది. తండ్రికి అవమానం జరిగిందని భావించి, వెంటనే కిందకి దిగి తండ్రిని గుర్రమెక్కించి, తాను పక్కన నడవసాగాడు.

మరొక ఊరిచివర ఉన్న ఒక పెద్ద చెరువు దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఉతుక్కుంటున్న కొంతమంది ఆడవాళ్ళు వీళ్ళని చూశారు. వారు రైతు వైపు వేలు చూపిస్తూ, “ఆ ముసలివాడెంత దుర్మార్గుడో చూశారా! పాపం పసివాడు, పట్టుమని పదేళ్ళు కూడా లేని కొడుకును కాళ్ళు మండే ఎండలో నడిపిస్తూ, తాను మాత్రం మహారాజులా హాయిగా గుర్రంపై స్వారీ చేస్తున్నాడు. ఎంత రాతి గుండె రా యజమానీ నీది!” అని గట్టిగా అరిచారు.

ఆ ఆడవాళ్ళ మాటలకు తండ్రి తీవ్రంగా సిగ్గుపడ్డాడు. ఇక ఏమాత్రం తట్టుకోలేక తండ్రి కూడా గుర్రం దిగిపోయాడు. ఇద్దరూ గుర్రం పక్కనే నడవసాగారు. కొద్దిసేపటికి ఎదురుగా వచ్చిన మరికొందరు నవ్వుతూ, "అబ్బో! ఈ తెలివితక్కువ వారిని చూడండి! చక్కటి గుర్రం ఉండీ దాన్ని ఉపయోగించుకోకుండా, ఈ ఎండలో ఇద్దరూ పడిచస్తూ నడుస్తున్నారు. వీరి బుద్ధికి దండం పెట్టాలి" అని ఎగతాళి చేశారు.

దాంతో తండ్రీ కొడుకులకు ఈ గుర్రం వల్ల ప్రతిచోటా తీవ్రమైన అవమానం జరుగుతోందని, అసలు ఈ గుర్రాన్ని కొన్నందుకే తమకు ఈ గతి పట్టిందని కోపం వచ్చింది. ఎట్లాగైనా ఈ గుర్రాన్ని వదిలించుకుంటేనే ప్రశాంతంగా ఉండగలమని ఒక పిచ్చి నిర్ణయానికి వచ్చారు.

అట్లా ముందుకు పోతుండగా వారొక పొంగిపొర్లుతున్న పెద్ద నదిపై ఉన్న వంతెన దాటవల్సి వచ్చింది. వంతెన మధ్యలోకి రాగానే, ఇద్దరూ కలసి కష్టపడి ఆ నల్ల గుర్రాన్ని నదిలోకి తోసివేశారు. ఆ గుర్రం వేగంగా ప్రవహిస్తున్న నీటి అలల మధ్య కొట్టుకుపోయి పూర్తిగా మునిగిపోయింది. అది కొట్టుకు పోయిన తర్వాత, "హమ్మయ్య! ఇప్పటికి ఈ గుర్రం పీడ, జనాల మాటల గొడవ వదిలింది” అనుకుని ఇద్దరూ హాయిగా ఊపిరి పీల్చుకుని, ఆనందంగా ఇంటికి చేరుకున్నారు.

తమ సొంత ఆలోచన లేకపోవడం వల్ల కొన్న గుర్రాన్ని, పెట్టిన సొమ్మును దారుణంగా నష్టపోయామనే చింత వారిలో కొంచెమైనా లేకపోవడం వారి అమాయకత్వానికి, బుద్ధిహీనతకు నిదర్శనం. ఇతరుల చెప్పుడు మాటలు, ఉచిత సలహాలు వింటూ పోతే మన సొంత విచక్షణ కోల్పోయి పెద్ద నష్టాల పాలవుతాం. లోకంలో అందరినీ మెప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. మన పరిస్థితులకు తగ్గట్లుగా, ఏది ధర్మమో మనమే సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

Add Zee News as a Preferred Source
TAGS:
Moral Stories
Telugu News