SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అరటిపండు ఉదయం లేదా సాయంత్రం.. ఏ సమయంలో తింటే శరీరానికి ఎక్కువ శక్తి వస్తుంది?

అరటిపండు మన డైలీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇది మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందులో ఫైబర్‌, పొటాషియం, కార్బోహైడ్రేట్స్‌ కూడా ఉంటాయి. మన శరీరానికి తక్షణ శక్తిని కూడా అరటిపండు అందిస్తుంది. అయితే, ఈ పండును ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలో తీసుకుంటే గరిష్టంగా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి తెలుసా?

Written By Renuka Godugu
Published: Oct 06, 2026, 05:28 PM IST | Updated: Oct 06, 2026, 05:33 PM IST
Image Credit: Best Time To Eat Banana:
Join

Best Time To Eat Banana: అరటిపండు తక్కువ ధరలోనే లభిస్తుంది. అన్నీ సీజన్‌లలో కూడా ఈ పండు అందుబాటులో ఉంటుంది. మరి అరటి పండు ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలో తినాలి? ఎప్పుడు తింటే గరిష్ట ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, ఈ పండును ఉదయం పరగడపున తీసుకోకూడదు. ముందుగా నీరు ఏదైనా ఫుడ్‌ తిన్నాక తీసుకోవాలి. ఈ అరటిపండును ఓట్స్‌, యోగార్ట్‌ లేదా పాలతో కలిపి తీసుకోవాలి. వీటిని ప్రోటీన్‌, కార్బొహైడ్రేట్స్‌తో కలిపి తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ప్రోటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిపి తీసుకోవాలి. ఇందులో పొటాషియం, విటమిన్‌ సీ, బీ6, మెగ్నీషియం కూడా ఉంటుంది.

అరటిపండు ఏ సమయంలో తినాలి?
అరటిపండు తినడానికి ఒక సమయం అంటూ లేదు.. సాధారణంగా ఏ పండ్లు అయినా రాత్రి 6 తర్వాత తినకూడదు. ఎందుకంటే వీటిలో ఉండే ఫైబర్‌ జీర్ణ మెల్లిగా అవుతుంది. ఇక అరటిపండు విషయానికి వస్తే ప్రీ వర్కౌట్‌ సమయంలో తినాలి. ఇది మంచి స్నాక్‌ మాదిరి పని చేస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే ఎక్సర్‌సైజ్‌ చేసే ఒక గంట ముందు కొంతమంది తింటారు. ఇది కండరాల పనితీరును మెరుగుచేస్తుంది. సహజంగా ఎలక్ట్రాలైట్‌ల కూడా పనిచేస్తుంది. మెదడు పనితీరును కూడా ఇది మెరుగు చేస్తుంది.

సాయంత్రం తింటే ఏమవుతుంది?
అరటిపండు సాయంత్రం తినకూడదు అనే రూల్‌ ఎక్కడా లేదు.. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ సమయంలో మీకు ఆకలి వేస్తే అరటిపండు తినవచ్చు. ఇది పోషకాహారం, బిస్కట్లు, చిప్స్‌ తినేకంటే ఇదే మేలు. అయితే, కడుపులో గ్యాస్‌, అజీర్తి చేస్తే తినకూడదు

అయితే, పచ్చ అరటి, పండిన అరటిలో టేస్ట్‌తోపాటు వీటి ప్రయోజనాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. బాగా పండిన అరటిపండు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఒకేసారి ఎక్కువ మొత్తం కాకుండా కొద్దిమొత్తంలో తీసుకోవాలి. అంతేకాదు ఈ పండును ప్రోటీన్‌తో కలిపి తీసుకోవాలి. గింజలు, యోగార్ట్‌తో కలిపి తీసుకుంటే మంచి సమతుల ఆహారం అవుతుంది.

డయాబెటీస్‌వారు తినవచ్చా?
సాధారణంగా డయాబెటీస్‌వారు కార్బొహైడ్రేట్స్‌ మితంగా తినాలి. వీరికి రక్తంలో చక్కెర స్థాయిు పెరుగుతుంటాయి. పండిన అరటిపండులో కార్బొహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మితంగా వైద్యుల సూచన మేరకు తినాలి.

Also Read: అరటిపండు కంటే పవర్‌ఫుల్! ఈ ట్రోపికల్ ఫ్రూట్ తింటే శరీరంలో మార్పులు ఖాయం.. 

Also Read: డాక్టర్‌ రికమండ్ చేసిన డ్రింక్స్.. కీళ్ల నొప్పులు, బాడీ వాపులను తగ్గించే 5 పానీయాలు!

ఉదయం అరటిపండు తినాల్సి వస్తే ఓట్స్‌, యోగార్ట్‌, పాలు, గింజలతో కలిపి తీసుకోండి. ఒకవేళ సాయంత్రం తింటే స్నాక్‌ సమయంలో తినాలి. ప్రీ వర్కౌట్‌ ముందు తినాలి. మొత్తానికి అరటిపండు మీ డైట్‌లో చేర్చుకోవాలి. టైమ్‌తో సంబంధం కాదు.. ఆకలిగా ఉన్నప్పుడు తింటే మేలు.. అరటిపండులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఒక సమతుల ఆహారం, ఫైబర, పొటాషియం, విటమిన్‌ బీ6 ఇతర ఖనిజాలు కూడా కలిగి ఉంటాయి. మన రోజువారీ డైట్‌లో అరటి పండు తినాలి. (Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES