SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

సాధారణ పండే కదా అని నిర్లక్ష్యం చేస్తున్నారా? రోజువారీ ఆరోగ్యానికి బత్తాయి చేసే మ్యాజిక్ ఇదే!

మోసంబి కూడా విటమిన్ సి పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ పండును చాలా మంది తక్కువగా కొనుగోలు చేస్తారు.. కానీ ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ సి తో పాటు పొటాషియం, ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తాయి. వీటిని రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చుకోవడం వల్ల చర్మ ఆరోగ్యంతో పాటు ఇమ్యూనిటీ, గుండె పనితీరు కూడా మెరుగవుతాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 22, 2026, 16:36 IST | Updated: Nov 22, 2026, 16:40 IST
Image Credit: Mosambi Health Benefit:
Join

Mosambi Health Benefit: మామిడి, ఆపిల్, దానిమ్మ, సంత్ర వంటివి చాలామంది కొనుగోలు చేస్తారు, కానీ మోసంబిని చాలా మంది పక్కన పెడతారు. అయితే ఇందులో కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది చర్మంతో పాటు గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో ఆమ్లత్వ స్థాయిలు తక్కువగా ఉంటాయి, కాబట్టి సులభంగా జీర్ణమవుతుంది. ఇది నిమ్మకాయ, ఆరెంజ్ వంటిదే, జీవక్రియ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. తాజాగా తినవచ్చు లేదా జ్యూస్ రూపంలో తయారు చేసుకోవచ్చు..

మోసంబి రుచి స్వీట్ లైమ్ మాదిరిగానే ఉంటుంది. ఇది కూడా ఒక సిట్రస్ పండే, కానీ ఇందులో ఆమ్లత్వం తక్కువగా ఉంటుంది. ఇది సీడ్‌లెస్ టైప్ కూడా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు కూడా చాలామంది దీని జ్యూస్ తీసుకుంటారు, ఇది తక్షణ శక్తినీ అందిస్తుంది. దక్షిణాది ప్రాంతాల్లో మోసంబిని బాగానే తీసుకుంటారు.

కొంతమంది ఈ పండును పక్కన పెట్టేస్తారు, కానీ ఇందులో క్యాలరీలు తక్కువగా, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పొటాషియం, కాల్షియం కూడా లభిస్తాయి. డైటరీ ఫైబర్ కూడా కలిగి ఉండటం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఇందులో ఉంటాయి. ఇందులోని ఖనిజాలు ఇమ్యూనిటీ పనితీరును మెరుగుపరచి, కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. రోజంతటికీ కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది, గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. నీటి శాతం అధికంగా ఉండటం వల్ల శరీరానికి మంచి ద్రవాహారంగా పనిచేస్తుంది.

మోసంబి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ ఉండటం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది, జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్ సమతుల్యతకు కూడా సహాయపడుతుంది. రక్తపోటు, గుండె పనితీరును మెరుగుపరిచే గుణం ఉంటుంది. ఇది వాపు సమస్యను కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది.

Read Also: బరువు తగ్గాలా? ఎముకలు ఉక్కులా మారాలా?.. రోజూ రాగులు తింటే కలిగే 5 ఆశ్చర్యకరమైన లాభాలు ఇవే!

దీన్ని తీసుకోవడం వల్ల విటమిన్ సి మనకు అందుతుంది. ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలతో కలిపి తీసుకుంటే మరింత పోషకంగా మారుతుంది. దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.. లేదా సలాడ్‌లా కూడా తినవచ్చు. మోసంబిని నేరుగా తింటే యాసిడ్ తక్కువగా ఉండటం వల్ల దంత ఆరోగ్యానికి కూడా హాని కలిగించదు. మార్కెట్లో మోసంబి విరివిగా లభిస్తుంది.. కానీ చాలామంది దాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపరు. అయితే ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయం తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నీటి శాతంతో పాటు ఇమ్యూనిటీ, తక్షణ శక్తి కూడా లభిస్తాయి. (Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES