మన శరీరానికి నిజమైన ఇంజన్ ఆయిల్ ఇదే.. ఈ పోషకం లోపిస్తే అనారోగ్య సమస్యల సునామీ తప్పదు..!!
Omega 3 fatty acids: మన శరీరం ఒక యంత్రం లాంటిది. అది సక్రమంగా పనిచేస్తేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. మరి అలాంటి మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే తగిన పోషకాలు అందించడం అవసరం.
Omega 3 fatty acids: మన శరీరం ఒక యంత్రం లాంటిది. అది సక్రమంగా పనిచేస్తేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. మరి అలాంటి మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే తగిన పోషకాలు అందించడం అవసరం. ఒక వేళ మన శరీరంలో కొన్ని ముఖ్యమైన పోషకాలు లోపించినట్లయితే.. అనేక రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతాయి. నిత్య జీవితంలో మనల్ని ఇబ్బంది పెట్టే పలు రకాల అనారోగ్య సమస్యలకు అసలు కారణం ఏంటో చూద్దాం.
చాలా మందిలో ఫోకస్ తగ్గుతుంది.. దేనిపై శ్రద్ద పెట్టలేకపోతుంటారు.. మెమరీ లాస్ అవుతుంది.. గుండె భారంగా అనిపిస్తుంది.. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులు వేధిస్తుంటాయి.. చర్మం పొడిబారిపోతుంది..ఇలాంటి రకరకాల మిమ్మల్ని వేధిస్తున్నాయంటే.. మీ శరీరంలో ఒక అత్యంత కీలకమైన పోషకం కరువులో ఉందని అర్థం చేసుకోవాలి. మన మెదడు తయారవ్వడంలో మేజర్ పార్ట్ ఈ న్యూట్రియంట్ తోనే ముడిపడి ఉంటుంది. ఇది మన మొత్తం శరీరానికి ఒక నాచురల్ ఇంజిన్ ఆయిల్ వంటిది. అదే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్.
అసలు ఈ పోషకం ఎందుకంత ముఖ్యం? తెలుసుకుందాం:
ఒమేగా 3 అనేది ఎక్కువ ట్యూనా వంటి చేపల్లో లభిస్తుంది. ఒమేగా 3 గుండె పోటు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గించడంతోపాటు.. శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి.. చర్మానికి తగిన మాయిశ్చరైజన్ ను అందించి చర్మం మెరిచేలా చేస్తుంది. అంతేకాదు కంటి చూపుకు ఒమేగా 3 ఎంతో ముఖ్యమైంది. కళ్లలోని రెటీనాకి ఇది ఒక అద్భుతమైన పవర్ ను ఇస్తుంది. ముఖ్యంగా గర్భిణీలకు ఒమేగా 3 చాలా మంచిది. ఎందుకంటే కడుపులో బిడ్డకు కంటిచూపు అభివ్రుద్ధి చెందడానికి, బ్రెయిన్ గ్రోత్ కు బాగా సహాయపడుతుంది. అంతేకాదు చదువుకునే పిల్లల్లో ఏకాగ్రతను కూడా పెంచి వారికి గుర్తుండేలా చేస్తుంది.
అమ్మాయిల్లో పీఎంఎస్ (PMS), పీసీఓఎస్ (PCOS) లాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. మెటబాలిజంను కంట్రోల్ చేసి షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా చూస్తుంది. అంతేకాకుండా ఫ్యాటీ లివర్ రాకుండా సహాయపడుతుంది. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్
సాధారణంగా కొన్ని రకాల చేపలలో పుష్కలంగా లభిస్తుంది.
అయితే మాంసాహారులతో పాటు శాఖాహారులు కూడా ప్రతిరోజూ సులభంగా తినగలిగే వాల్ నట్స్, చియా సీడ్స్, అవిసె గింజల్లో పుష్కలంగా లభిస్తుంది. ఇవి చేపలకు ప్రత్యామ్నాయాలుగా చెప్పవచ్చు. శరీరాన్ని ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉంచుకోవడానికి ఒమేగా-3 అందించే ఈ ఆహార పదార్థాలను మన డైట్‌లో చేర్చుకోవడం ఎంతో మేలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Also Read:
తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ధర ఎంతో తెలుసా?