• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /మెదడుకు విశ్రాంతినివ్వండి.. ఓవర్ థింకింగ్ అనేది పుట్టుకతో వచ్చేది కాదు!

మెదడుకు విశ్రాంతినివ్వండి.. ఓవర్ థింకింగ్ అనేది పుట్టుకతో వచ్చేది కాదు!

Overthinking Is Not Inborn: ప్రస్తుతం చాలా మంది యువత డిప్రెషన్‌తో పాటు ప్రతికూల ఆలోచనలు వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీని కారణంగా చాలా మంది రాత్రుల్లో నిద్ర కూడా పోవడం లేదు. అయితే, దీని నుంచి విముక్తి పొందడం ఎలాగో? మెటాకాగ్నిటివ్ థెరపీ అంటే ఏమిటో మెంటల్‌ హెల్త్ కోచ్‌ ప్రదీప్‌ మాటాల్లో తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 17, 2026, 14:44 IST|Updated: Nov 17, 2026, 14:50 IST
joinshare
మెదడుకు విశ్రాంతినివ్వండి.. ఓవర్ థింకింగ్ అనేది పుట్టుకతో వచ్చేది కాదు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Overthinking Is Not Inborn: ఆధునిక జీవనశైలిలో చిన్న సమస్య వచ్చినా.. దాని గురించి గంటల తరబడి ఆలోచించడం చాలా మందికి అలవాటుగా మారింది.. ఆరోగ్య సమస్యలు లేదా ఆఫీసులో ఎదురయ్యే ఒత్తిళ్ల గురించి పదేపదే ఆలోచిస్తూ పరిష్కారం కోసం వెతకడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని ప్రముఖ మెంటల్‌ హెల్త్ కోచ్‌ ప్రదీప్‌ స్పష్టం చేశారు. అతి ఆలోచన వల్ల సమస్యలు తగ్గకపోగా.. మనిషి ఏమి చేయలేని స్థితికి వెళ్లిపోతారని ఆయన తెలిపారు.

నిరంతరం ఆలోచనల్లో మునిగిపోవడం వల్ల నిద్రలేమి.. ఏకాగ్రత లోపించడం, నీరసం వంటి శారీరక, మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది చివరకు తీవ్రమైన ఆందోళనతో పాటు డిప్రెషన్‌కు దారితీసే అవకాశాలు ఉన్నాయని ప్రదీప్‌ తెలిపారు. ఆందోళన తగ్గించుకోవడానికి మనం చేసే కొన్ని పనులు పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు..

చిన్నపాటి అనారోగ్య లక్షణాలను కూడా భూతద్దంలో పెట్టి చూడటం.. ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో? అని నిరంతరం గమనించడం వల్ల భయం మరింత పెరుగుతుందని ఆయన చెబుతున్నారు.. అనారోగ్య లక్షణాల గురించి ఇంటర్నెట్‌లో గంటల తరబడి వెతకడం వల్ల లేనిపోని రోగాల గురించి చదివి మరింత భయాందోళనలకు గురవుతుంటారని ఆయన వెల్లడించారు.. భవిష్యత్తులో జరగబోయే ప్రతి చిన్న విషయాన్ని ముందే.. ఊహించి ప్లాన్‌ వేసుకోవడం వల్ల, అనుకోని మార్పులు జరిగినప్పుడు తట్టుకోలేక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని మెంటల్‌ హెల్త్ కోచ్‌ ప్రదీప్‌ అన్నారు.

పరిష్కారం మన చేతుల్లోనే..
అతి ఆలోచన అనేది కంటి రంగు లాగా పుట్టుకతో వచ్చే లక్షణం కాదని.. అది మనం నేర్చుకున్న ఒక అలవాటు మాత్రమేనని మెంటల్‌ హెల్త్ కోచ్‌ ప్రదీప్‌ అన్నారు. సాంప్రదాయ  కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో చెడు ఆలోచనలను మార్చడానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

2020లో 174 మంది డిప్రెషన్ బాధితులపై జరిపిన పరిశోధనలో.. సాధారణ థెరపీ  52 శాతం కంటే మెటాకాగ్నిటివ్ థెరపీ 74 శాతం ద్వారా ఎక్కువ మంది కోలుకున్నట్లు తేలింది.. మన మెదడులో మెదిలే ప్రతి ఆలోచనకు స్పందించాల్సిన అవసరం లేదని గుర్తించడమే.. ఈ చికిత్సలోని ప్రధాన సూత్రమని మెంటల్‌ హెల్త్ కోచ్‌ ప్రదీప్‌ తెలిపారు. ఆలోచనలను వాటి మానాన వాటిని వదిలేయడం నేర్చుకుంటే.. అతి ఆలోచన అనే అంశం నుంచి సులభంగా బయటపడి ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చని ఆయన సూచిస్తున్నారు.


సేకరణ: మెంటల్‌ హెల్త్ కోచ్‌ ప్రదీప్‌
ఈ మెయిల్‌ ఐడీ: Pradeeptalks90@gmail.com
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News