SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఇంట్లో చేసే ఫ్రైడ్ రైస్ హోటల్ రుచి రావడం లేదా? చెఫ్‌లు పాటించే ఆ ఒక్క సీక్రెట్ ట్రిక్ ఇదే!

రోడ్డుపై దొరికే ఆహారం ఆరోగ్యానికి హానికరం అనే అవగాహన ఇటీవల చాలామందిలో పెరిగింది, అందుకే ఇంట్లోనే వండుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. అయితే హోటల్ స్టైల్‌లో మనం ఎన్నిసార్లు ఫ్రైడ్ రైస్ చేసినా ఆ రుచి రావడం లేదు. మీరు కూడా కొన్ని తప్పులు చేస్తున్నందున అనుకున్న రుచి రాకపోవచ్చు. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే, రెస్టారెంట్ స్టైల్‌లో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఫ్రైడ్ రైస్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

Written By Renuka Godugu
Published: Sep 29, 2026, 03:51 PM IST | Updated: Sep 29, 2026, 03:54 PM IST
Image Credit: Restaurant Style Fried Rice
Join

Restaurant Style Fried Rice: మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా హోటల్ స్టైల్ ఫ్రైడ్ రైస్ రావడం లేదా? రోడ్లపై దొరికే ఫ్రైడ్ రైస్ లాగా ఇంట్లో రాకపోవడానికి ప్రధాన కారణాలు మనం వాడే బియ్యం, కూరగాయలు, సాస్‌లు మరియు ఫ్రై పాన్ కావచ్చు. చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రుచితో, ఆరోగ్యకరమైన ఫ్రైడ్ రైస్‌ను పొందవచ్చు. ముందుగా కొన్ని మార్పులు చేసుకుంటే ఇంట్లోనే రుచికరమైన ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. ఇందులో ఉపయోగించే బియ్యం తాజాగా వండినదైతే అందులో తేమ ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల ఫ్రైడ్ రైస్ ముద్దగా అయిపోయే అవకాశం ఉంది. అందుకే కొంచెం సేపు చల్లబడిన అన్నాన్ని ఉపయోగించండి. చల్లటి అన్నం డ్రైగా ఉండటం వల్ల పొడిపొడిగా వస్తుంది, తద్వారా ఫ్రైడ్ రైస్ అద్భుతంగా తయారవుతుంది.

అంతేకాకుండా, ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఇంట్లో వాడే సాధారణ పాన్ సరిపోకపోవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా కడాయిలను వాడితే మంచి ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. ఇందులో ఉపయోగించే నూనె బాగా వేడెక్కాలి. అలాగే పదార్థాలను కలిపేటప్పుడు అవి పాన్‌లో సులభంగా కదిలేలా ఉండాలి.
మంచి ఫలితాల కోసం కొంచెం పెద్ద ఫ్రై పాన్‌ను ఎంచుకోండి, ఎందుకంటే ఫ్రైడ్ రైస్‌తో పాటు కూరగాయలను కూడా కలపాల్సి ఉంటుంది కాబట్టి పెద్ద పాన్ సౌకర్యంగా ఉంటుంది. అలాగే సాస్‌లను మరీ ఎక్కువగా వాడకండి. కొంతమంది సోషల్ సాస్ ఎక్కువగా వాడితే రుచి వస్తుందని అనుకుంటారు. కానీ దీనివల్ల ఉప్పు ఎక్కువగా అయ్యి, రైస్ స్టిక్కీగా మారుతుంది తప్ప రుచి పెరగదు.

ఫ్రైడ్ రైస్ తయారు చేసేటప్పుడు కొన్ని సువాసన ఇచ్చే పదార్థాలను మర్చిపోకూడదు. అల్లం, వెల్లుల్లి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్ కచ్చితంగా వాడాలి. దీనివల్ల మంచి అరోమా, రుచి వస్తుంది. నూనె బాగా వేడెక్కిన తర్వాత వీటిని వేసి, మంచి టెక్స్చర్ కోసం ఎక్కువ సమయం పాటు నాన్-స్టాప్‌గా కలుపుతూ ఉండాలి. అలాగే రైస్‌ను పాన్‌లో టాస్ చేస్తూ ఉండాలి. చివరగా, కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా సెసామ్ ఆయిల్, పెప్పర్ వంటివి జోడించడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. ఈ చిట్కాలన్నీ పాటిస్తే, మీరు ఇంట్లోనే హోటల్ స్టైల్‌లో పర్ఫెక్ట్ ఫ్రైడ్ రైస్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు, దీనివల్ల బయట కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES