SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మిమ్మల్ని మీరు గౌరవించుకోండిలా.. ఈ 7 సూత్రాలు తెలిస్తే ఎవరి ముందూ తలదించుకోవాల్సిన అవసరం రాదు..!!

Self Respect Rules: మనిషికి జీవితంలో డబ్బు.. హోదా కంటే విలువైంది ఆత్మగౌరవం. మనం ఇతరుల నుంచి గౌరవాన్ని ఆశించే ముందు.. మనల్ని మనం గౌరవించుకోవడం మొదట నేర్చుకోవాలి. మన ప్రవర్తన.. మాటతీరు.. ఇతరులకు మనం ఇచ్చే ప్రాధాన్యతను బట్టి సమాజంలో మన విలువ అనేది ఆధారపడి ఉంటుంది.

Written By Bhoomi
Published: Nov 19, 2026, 15:33 IST | Updated: Nov 19, 2026, 15:35 IST
Image Credit: Self Respect Tips:
Join

Self Respect Rules: మనిషికి జీవితంలో డబ్బు.. హోదా కంటే విలువైంది ఆత్మగౌరవం. మనం ఇతరుల నుంచి గౌరవాన్ని ఆశించే ముందు.. మనల్ని మనం గౌరవించుకోవడం మొదట నేర్చుకోవాలి. మన ప్రవర్తన.. మాటతీరు.. ఇతరులకు మనం ఇచ్చే ప్రాధాన్యతను బట్టి సమాజంలో మన విలువ అనేది ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి పాటించాల్సిన ఏడు ముఖ్యమైన రూల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. ఒకరి ముందు తలదించుకోవాల్సిన పరిస్ధితి ఎప్పటికీ రాదు.


1. నిన్ను చూడని వాళ్ల కోసం చూడకు:
ఒక వ్యక్తి మనల్ని పట్టించుకోడం లేదంటే.. ఆ వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మనకు విలువ ఇవ్వని వారి కోసం సమయాన్ని.. ఎమోషన్స్ ను వేస్ట్ చేసుకోవద్దు. మన ఉనికిని గుర్తించని వారి వైపు చూడటం మానేస్తే మన విలువ మనకు తెలుస్తుంది.


2. ఎవరినీ బతిమాలకూడదు:
ఒక వ్యక్తిని బతిమాలకూడదు. అది ప్రేమ కావచ్చు.. స్నేహం కావచ్చు.. లేదంటే మరేదైనా బంధం కావచ్చు. మనతో ఉండాలని లేదంటే మనకు సమయం ఇవ్వాలని ఎప్పుడూ బతిమాలకూడదు. బతిమాలి పొందే సాన్నిహిత్యం కంటే ఒంటరిగా ఉండటం ఆత్మగౌరవానికి ఎంతో మేలు చేస్తుంది.


3. అవసరం కంటే ఎక్కువ మాట్లాడకు
అవసరం ఉంటే తప్పా ఎక్కువ మాట్లాడకూడదు. అవసరం లేని చోట ఎక్కువగా మాట్లాడి.. మన మాటకున్న విలువను పోగోట్టుకోవద్దు. మౌనం, మితభూషణం మనిషికి ఎప్పుడూ హుందాతనాన్ని తెస్తాయి.


4. ఎవరైనా నిన్ను తక్కువ చేస్తే వెంటనే ఎదురు తిరుగు
మన మంచితనాన్ని చేతకానితనంగా భావించి ఎవరైనా అవమానించినా లేదా తక్కువ చేసి మాట్లాడినా మౌనంగా భరించకూడదు. ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు వెంటనే స్పందించి.. వారికి తగిన సమాధానం చెప్పాలి. అప్పుడే నిన్ను తక్కువ చేసి మాట్లాడరు.  

5. వాళ్లు నీ ఇంట్లో తిన్నంత కంటే ఎక్కువ వాళ్ల ఇంట్లో తినకు
ఇది కేవలం ఆహారానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు... ఇచ్చిపుచ్చుకునే బంధాలకు కూడా వర్తిస్తుంది. ఇతరులు మనకు ఇచ్చే గౌరవం, ఆతిథ్యం లేదా సహాయం కంటే ఎక్కువగా మనం వారి నుంచి ఆశించకూడదు, తీసుకోకూడదు. అప్పుడే ఏ బంధంలోనైనా సమానత్వం, గౌరవం నిలుస్తాయి.   
 

6. నిన్ను పట్టించుకోని వాళ్ల దగ్గరికి తక్కువగా వెళ్లు:
మనల్ని పట్టించుకోని వ్యక్తుల దగ్గరకు పదేపదే వెళ్లకూడదు. మనకు గౌరవం దక్కని చోటుకు దూరంగా ఉండటమే ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ఉత్తమ మార్గం.   
 

7. నీ మీదే పెట్టుబడి పెట్టు, నిన్ను నువ్వే సంతోషపెట్టుకో:
ఇతరుల నుంచి సంతోషాన్ని ఆశించకూడదు.. మన ఆనందానికి మనమే బాధ్యత తీసుకుంటు... మన ఆరోగ్యం, నైపుణ్యాలు, మానసిక ప్రశాంతతపై సమయాన్ని వెచ్చిస్తూ మనల్ని మనం మెరుగుపర్చుకోవచ్చు.

ఈ 7 సూత్రాలను మీ జీవితంలో భాగం  చేసుకున్నట్లయితే.. ఎదుటివారి ద్రుష్టిలో మీ గౌరవం పెరగడమే కాదు.. మీలో ఆత్మ విశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. 
 

Also Read: 

 

 

 

 

మీ కూతురి భవిష్యత్తుకు బంగారు బాట.. నెలకు రూ.12,500 పొదుపుతో చేతికి రూ.70 లక్షలు..!!

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES