• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • / ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలా? సెలూన్‌ను కూడా మరిపించే 5 బెస్ట్ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్!

ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలా? సెలూన్‌ను కూడా మరిపించే 5 బెస్ట్ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్!

ముఖం కాంతివంతంగా కనిపించడానికి చాలా డబ్బులు ఖర్చు చేసి పార్లర్‌లకు వెళ్తుంటారు, కానీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ మెరుపు కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అయితే, ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి మీ ముఖాన్ని చంద్రబింబంలా మెరిపించుకోవచ్చు, అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Sep 24, 2026, 05:51 PM IST|Updated: Sep 24, 2026, 05:54 PM IST
joinshare
 ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలా? సెలూన్‌ను కూడా మరిపించే 5 బెస్ట్ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్!
Image Credit: Glowing Skin Tips:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Glowing Skin Tips: ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అందరి ముందు చంద్రబింబంలా మెరిసే కాంతివంతమైన ముఖం పొందాలంటే ఇంట్లో ఉండే ఈ మూడు వస్తువులను ఉపయోగించండి. దీనివల్ల మీరు ఎలాంటి ఖర్చు లేకుండా, పార్లర్‌కు వెళ్లకుండానే సులభంగా అందమైన ముఖాన్ని పొందవచ్చు. ఇవన్నీ సాధారణంగా మన ఇంట్లోనే అందుబాటులో ఉంటాయి కాబట్టి, మీరు సులభంగా ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. వీటి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగానే మెరిసే ముఖాన్ని పొందవచ్చు.

పసుపు..
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి కాబట్టి దీనిని ముఖానికి ఉపయోగించవచ్చు. ఇది మన కిచెన్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది, కాబట్టి ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు. ఒక టేబుల్ స్పూన్ పెరుగులో ఒక చిటికెడు పసుపు కలిపి ముఖం, మెడ భాగంలో అప్లై చేసి, అరగంట పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. పసుపు చర్మానికి మంచి మెరుపును ఇవ్వడమే కాకుండా, పెరుగు మాయిశ్చరైజర్‌గా పనిచేసి గ్లోయింగ్ స్కిన్‌ను అందిస్తుంది.

శనగపిండి, రోజ్ వాటర్..
శనగపిండి, రోజ్ వాటర్ కూడా సాధారణంగా అందరి ఇంట్లో అందుబాటులో ఉంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజమైన మెరుపు పొందడానికి ఈ రెండింటినీ కలిపి ముఖం మరియు మెడ భాగంలో అప్లై చేయాలి. వీటితో ఒక మెత్తని పేస్టులా తయారు చేసుకుని ముఖంపై రాసి, అది ఆరిపోయే వరకు ఆగండి. ఇది ముఖంపై ఉండే ఓపెన్ పోర్స్‌ను తగ్గించడమే కాకుండా, అదనపు నూనెను కూడా గ్రహించి ముఖానికి మంచి తాజాదనాన్ని ఇస్తుంది. దీనివల్ల క్రమంగా మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.

ముల్తానీ మట్టి..
ముల్తానీ మట్టి, టమాటో ఉపయోగించి కూడా మీ ముఖం మంచి అందాన్ని పొందవచ్చు. ముల్తానీ మట్టితో టమాటో గుజ్జును కలిపి పేస్టులా తయారు చేసుకుంటే అది మంచి నేచురల్ ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ఇది ముఖంపై ఉండే అదనపు నూనెను గ్రహించడమే కాకుండా, ముఖ రంధ్రాలను కూడా తగ్గిస్తుంది.

అరటిపండు..
అరటిపండును తేనెతో కలిపి ఫేస్ ప్యాక్‌లా వేసుకోవడం వల్ల మంచి యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. దీనిని సుమారు 20 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత ఫేస్ వాష్ చేయండి. అరటిపండులో విటమిన్ ఏ, సి ఉంటాయి. ఇది చర్మానికి మంచి సాగే గుణాన్ని అందిస్తుంది, దీనివల్ల మీరు నిత్య యవ్వనంగా కనిపిస్తారు.

కుంకుమపువ్వు..
మీరు కొంచెం ఖర్చు చేయగలిగితే, కుంకుమపువ్వును తేనెతో కలిపి కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. కుంకుమపువ్వు ముఖానికి మంచి రంగును ఇవ్వడమే కాకుండా, పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది. గ్లోయింగ్ స్కిన్ పొందడానికి ఈ ప్యాక్ చాలా ఉపయోగపడుతుంది.

వేప..
వేప ముల్తానీ మట్టితో కలిపి వాడితే మొటిమలను తగ్గించవచ్చు. ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ మరియు వేప ఆకులను కలిపి పేస్టులా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేయండి. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బ్యాక్టీరియా పెరగకుండా చేస్తాయి. దీనివల్ల ముల్తానీ మట్టితో పాటు ముఖానికి మంచి మృదువైన చర్మం లభిస్తుంది.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:
Beauty Tips