SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మొలకెత్తిన మెంతులు.. ఆరోగ్యానికి అమృతంతో సమానం.. ఇవి తెలిస్తే ఒక్క గింజ కూడా వదలరు!

మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మొలకెత్తిన విత్తనాలు అంటే కేవలం శనగలు మాత్రమే కాదు, మొలకెత్తిన మెంతులు కూడా చాలా ఆరోగ్యకరం. వీటి ప్రయోజనాలు తెలిస్తే మీరు వీటిని అస్సలు వదిలిపెట్టరు.

Written By Renuka Godugu
Published: Sep 27, 2026, 07:30 PM IST | Updated: Sep 27, 2026, 07:34 PM IST
Image Credit: Sprouted Fenugreek Benefits:
Join

మొలకెత్తిన మెంతుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వీటిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం అమృతంలా పనిచేస్తుంది. మొలకెత్తిన విత్తనాలు అంటే కేవలం శనగలే కాకుండా, మెంతులను కూడా మీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొలకెత్తిన విత్తనాలు డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సేపు ఉంటుంది, తద్వారా అతిగా తినకుండా బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.

మొలకెత్తిన విత్తనాల వల్ల గట్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, దీర్ఘకాలిక మలబద్ధకం, ఎసిడిటీ మరియు అజీర్తి సమస్యలతో బాధపడేవారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇవి ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. వివిధ రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడతాయి.

రాత్రి నానబెట్టిన మెంతులను మరుసటి రోజు మొలకెత్తించవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒక గుప్పెడు మొలకెత్తిన మెంతులను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మెంతులలో ఆరోగ్య ప్రయోజనాలు అపారం. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు మెంతులను ఉపయోగిస్తుంటారు.

మెంతులను నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చాలామంది మెంతుల పొడిని కూడా వాడుతుంటారు, అయితే ఇలా మొలకెత్తించి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. సాధారణంగా ఏ విత్తనాలైనా మొలకెత్తించి తీసుకోవడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలతో పాటు దీర్ఘకాలిక మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES