చలికాలంలో జుట్టు విపరీతంగా రాలుతుందా? ఇంట్లోనే తయారుచేసుకునే ఈ 5 నూనెలతో మీ జుట్టుకు కొత్త ప్రాణం!
చలి తీవ్రత మొదలైంది. వెచ్చని దుస్తులు ధరించడం, ఫుడ్ తీసుకోవడం తప్పనిసరి. అయితే, ఎంత హెయిర్ కేర్ తీసుకున్నా.. చలికాలం జుట్టు రాలిపోతుంది. అంతేకాదు, కుదుళ్ల ఆరోగ్యం కూడా కుంటుపడుతుంది. ఇంట్లోనే తయారు చేసుకునే నూనెలతో సులభంగా హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
Homemade Winter Hair Oil Remedies: చలికాలం వచ్చిందంటే చాలు.. చుండ్రు సమస్య కూడా ఎక్కువ అవుతుంది. దీనివల్ల హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. కుదుళ్ల ఆరోగ్యం బాగుంటేనే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలం కుదుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. చుండ్రు పెచ్చులుగా కూడా ఉండిపోతుంది. దీనివల్ల జుట్టు దురద, రాలిపోవడం కూడా ఎక్కువ అవుతుంది. కుదుళ్లు ఎప్పుడూ మాయిశ్చర్ ఉండేలా చూడాలి. తద్వారా కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఎలాంటి హెయిర్ కేర్ ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల నూనెలను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇవి జుట్టుకు మంచి పోషణ, జీవం కూడా ఇస్తాయి. ప్రధానంగా ఈ నూనెలు చలికాలంలో మన జుట్టుకు ఎంతో అవసరం.
కొబ్బరినూనె..
మన దేశంలో హెయిర్‌కేర్ ఉత్పత్తుల్లో ఇది ప్రధనపాత్ర పోషిస్తుంది. మన బామ్మల కాలం నుంచి కూడా జుట్టుకు కొబ్బరినూనె వాడేవారు. ఇది జుట్టును కఠినంగా, పొడిబారకుండా కాపాడుతుంది. మాయిశ్చర్ కూడా అందిస్తుంది. కాస్మోటిక్ జర్నల్ ప్రకారం కూడా తలస్నానం చేసే ముందు జుట్టుకు కొబ్బరినూనె పెడితే ప్రోటీన్ లాస్ సమస్య కూడా తగ్గుముఖం పట్టింది.
జోజోబా..
జోజోబా ఆయిల్ వంటి చిక్కని నూనెలో తలకు ఎక్కువ కాలంపాటు మాయిశ్చర్ అందిస్తాయి. అందుకే జోజోబా ఆయిల్‌ది హెయిర్ కేర్ ఉత్పత్తుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని చుక్కల నూనె చేతుల్లో వేసుకుని బాగా మసాజ్ చేసి వెంటనే తలస్నానం కూడా చేసుకోవచ్చు. ఈ నూనెతో మనం కొబ్బరి నూనె కూడా వేసుకుని ఉపయోగించవచ్చు.
పొద్దుతిరుగుడు ..
చలికాలం జుట్టు సమస్యలకు చెక్ పెట్టాలంటే సన్‌ఫ్లవర్ ఆయిల్‌ది కూడా కీలకపాత్ర. ఇందులో లైనోలిక్ యాసిడ్, కొన్ని రకాల ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు మాయిశ్చర్ కూడా నిలుపుతాయి. డ్రైస్కిన్ సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది మంచి రెమిడీ. అయితే, ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం తప్పనిసరి. కొంతమందికి ఆయిల్స్ మారిస్తే సైడ్ ఎఫెక్ట్స్ చూపించే అవకాశం ఉంది.
Read Also: కార్తీక మాసం.. ఉసిరి ప్రత్యేకం.. రోజుకు ఒక్కటి తింటే చాలు..! మెరిసే చర్మం, నల్లటి ఒత్తైన జుట్టు మీ సొంతం!
Read Also: బోన్స్ బలహీనంగా మారుతున్నాయా? ఈ 5 అలవాట్లు మానకపోతే ఆస్టియోపోరోసిస్ ప్రమాదం!
బాదం నూనె..
బాదం నూనె కూడా హెయిర్ కేర్ ఆయిల్స్‌లో ఉపయోగిస్తారు. ఇది జుట్టుపై ఉండే చుండ్రును తొలగిస్తుంది. తలస్నానం చేసే ముందు ఈ స్వీట్ బాదం ఆయిల్‌తో హెడ్‌కు బాగా మసాజ్ ఇవ్వండి. ఆ తరవాత తలస్నానం చేయాలి. ఇది కూడా ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం తప్పనిసరి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)