20 ఏళ్ల తర్వాత కూడా సూపర్ హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? ఈ చిన్న మార్పులు చేయండి చాలు!
Healthy Eating Habits: మనం రోజూ తీసుకునే ఫుడ్ మన శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే మన లైఫ్‌స్టైల్ బాగుండాలి. ఉదయం మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు ఆరోగ్యరమైన భోజనం తీసుకోవాలి. ఇప్పటి లాగే 20 ఏళ్ల తర్వాత కూడా సూపర్ హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? అయితే, మీ రెగ్యులర్ డైట్‌లో ఈ మార్పులు తప్పనిసరిగా చేయండి. ఎలాంటి రోగాలు మీ దరిచేరకుండా ఉంటాయి.
మనం తీసుకునే ఆహారమే మన ఎలా ఉన్నామో చెబుతుంది. అది మన ముఖంలో కూడా కనిపిస్తుంది. సెలబ్రిటీలు హెల్తీ ఫుడ్ తీసుకుంటారు. పండ్లు, కూరగాయలకే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వారి వయస్సుకు తక్కువగా కనిపిస్తారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం మనం తీసుకునే ఫుడ్ 20 ఏళ్లు తక్కువగా ఉండేలా చేస్తుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో మీరు ఏం తీసుకోబోతున్నాం అని ఓ పది నిమిషాలు ఆలోచించాలి. హెల్తీ ఫుడ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. లంచ్, డిన్నర్‌కు కూడా అదే ప్రాధాన్యత ఇవ్వాలి. సింపుల్‌గా మీ డైట్‌లో కొన్ని రకాల ఫుడ్స్ చేర్చుకోవాలి.
ఆరోగ్య నిపుణులు ప్రకారం ప్రతిరోజూ ఒక గ్లాసు నీటితో మన రోజు ప్రారంభం కావాలి. మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలు కూడా డైట్‌లో చేర్చుకోవచ్చు. ఒక గ్లాసు వెజిటేబుల్ జ్యూస్ తీసుకున్న సరిపోతుంది. ఇక లంచ్ సమయంలో జొన్న రొట్టె తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ చికెన్, చేప కూడా డైట్‌లో చేర్చుకోవాలి. గ్రీన్ టీ కూడా తాగాలి.
ఇక రాత్రి డిన్నర్ విషయానికి వస్తే చికెన్ లేదా చేప తినాలి. సూప్, సలాడ్, రోటీ తీసుకోవాలి. వీటితోపాటు కూరగాయలతో చేసిన కూర, పప్పు, సలాడ్ చేర్చండి. అంటే ప్లేట్ పూర్తిగా సమతుల ఆహారం తీసుకోవాలి. అంతేకాదు ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ తినండి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఫుడ్ తినాలి. మీరు కరెక్ట్‌గా డైట్ ప్లాన్ చేసుకుంటే మీకు లెక్కలేనంత ఆరోగ్యం కూడా.
Also Read: అరటిపండు కంటే పవర్‌ఫుల్! ఈ ట్రోపికల్ ఫ్రూట్ తింటే శరీరంలో మార్పులు ఖాయం..
Also Read: డాక్టర్ రికమండ్ చేసిన డ్రింక్స్.. కీళ్ల నొప్పులు, బాడీ వాపులను తగ్గించే 5 పానీయాలు!
ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటే జీర్ణ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా మీ దరిచేరకుండా ఉంటాయి. అనారోగ్యకరమైన ఆహారంతో హై బ్లడ్ ప్రెజర్ సమస్యలు కూడా వస్తాయి. పోషకాహారం లేమి ఫుడ్ తింటే ఇమ్యూనిటీ కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాదు మనం తీసుకునే ఫుడ్ మన రోజువారీ మూడ్‌పై కూడా ప్రభావం చూపుతుంది. ఒమేగా 3 కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉండే ఫుడ్స్ తినాలి. ఇది మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అదేవిధంగా ప్రాసెస్ చేసిన చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు మన శరీరంపై నెగిటివ్ ప్రభావం చూపిస్తాయి. ఈ ఖనిజాలు మన శరీర ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)