పరగడుపున నానబెట్టిన అంజీర్ తింటున్నారా? మీ శరీరంలో జరిగే ఊహించని మార్పులు ఇవే!
అంజీర్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, వీటిని డ్రైఫ్రూట్స్ అని కూడా పిలుస్తారు. వీటిని ప్రతిరోజూ నానబెట్టి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అంజీర్ పండ్లలో ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Eat Soaked Figs Daily: అంజీర్ పండ్లు జీర్ణ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఎముకల దృఢత్వానికి కూడా సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది. ప్రతిరోజూ ఉదయం పరగడుపున నానబెట్టిన అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఖనిజాలు అందుతాయి. సాధారణంగా అంజీర్ పండ్లలో ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఐరన్ మరియు కాల్షియం కూడా ఉంటాయి, ఇవి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. పోషకాహార నిపుణుల ప్రకారం, అంజీర్ పండ్లు దీర్ఘకాలిక మలబద్ధక సమస్యను తగ్గించడమే కాకుండా, ఆరోగ్యకరమైన పేగు కదలికలకు సహాయపడతాయి.
జీర్ణ ఆరోగ్యానికి సహాయం..
అంజీర్ పండ్లను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఇందులోని డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఇది మలబద్ధక సమస్యకు మంచి పరిష్కారంగా పనిచేస్తుంది. పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది.
ఎముక ఆరోగ్యం..
అంజీర్ పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అందుతాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడతాయి. కాబట్టి వీటిని మీ డైట్‌లో చేర్చుకోవడం మంచిది.
గుండె ఆరోగ్యం..
అంజీర్ పండ్లలోని పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరుస్తూ, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇందులోని ఫైబర్ గుండె ఆరోగ్యానికి సహాయపడటమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి సమతుల్య ఆహారంగా మారుతుంది.
బరువు తగ్గడం..
బరువు తగ్గాలనుకునే వారు అంజీర్ పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులోని సహజమైన ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సేపు కలిగిస్తుంది, దీనివల్ల అతిగా తినకుండా ఉండవచ్చు. బరువు పెరగకుండా నియంత్రించుకోవచ్చు.
శక్తిని పెంచుతుంది..
అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఖనిజాలు లభిస్తాయి. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. రాత్రిపూట నానబెట్టిన పండ్లను ఉదయం పరగడుపున తీసుకోవాలి. అంజీర్ పండ్లను నానబెట్టిన నీటిని కూడా తాగడం వల్ల ఇందులోని పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)