ఉడికించిన అన్నం – 2 కప్పులు, నూనె – 2 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ – 1, క్యారెట్ – 1 చిన్నది, టమోటాలు – 2, పచ్చిమిర్చి – 2 నుంచి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్ తీసుకోవాలి. మ్యాగీ మసాలా – 2 ప్యాకెట్లు, కారం – ½ టీస్పూన్, పసుపు – ¼ టీస్పూన్, ఉప్పు – ¼ నుంచి ½ టీస్పూన్, కరివేపాకు, కొత్తిమీర అవసరానికి తీసుకోండి.
వెడల్పాటి కడాయిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు వేయాలి. హై ఫ్లేమ్‌పై సుమారు 30–40 సెకన్లు వేగంగా కలుపుతూ వేయిస్తే కూరగాయలు కొద్దిగా క్రంచీగా ఉంటాయి.
ఇప్పుడు తరిగిన టమోటాలు వేసి కొద్దిసేపు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, కొద్దిగా ఉప్పు వేసి కలిపిన తర్వాత 2 ప్యాకెట్ల మ్యాగీ మసాలా జోడించాలి.
మసాలా కూరగాయలకు బాగా పట్టిన తర్వాత పొడిపొడిగా ఉన్న ఉడికించిన అన్నం వేయాలి. హై ఫ్లేమ్‌పై 1–2 నిమిషాలు మెల్లగా టాస్ చేస్తూ కలిపితే మసాలా అన్నం అంతా సమంగా పట్టుకుంటుంది.
చివరగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. పిల్లల రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కారం పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు.
అంతే.. వేడి వేడి మ్యాగీ మసాలా ఫ్రైడ్ రైస్ సిద్ధం. లంచ్ బాక్స్‌లో పెట్టే ముందు కొద్దిగా చల్లార్చి, పెరుగు లేదా వారికి నచ్చిన సైడ్‌తో అందించవచ్చు.
మ్యాగీ మసాలాలోనే ఉప్పు ఉండే అవకాశం ఉన్నందున అదనపు ఉప్పును తక్కువగా వేసి, చివర్లో రుచి చూసి అవసరమైతే మాత్రమే పెంచండి.