SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 3 రోజులు స్కూళ్లకు సెలవులు!

November 1 Holiday: విద్యార్థులకు మరోసారి సెలవులు రాబోతున్నాయి. విశాఖపట్నం నగరంలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. దీంతో వచ్చే నాలుగు రోజుల్లో మూడు రోజులు కొన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఉండనున్నాయి.

Written By Vishnu Priya
Published: Oct 31, 2026, 09:26 AM IST | Updated: Oct 31, 2026, 09:30 AM IST
Join

Schools Closed in Visakhapatnam: విశాఖపట్నం నగరంలో నవంబర్ 1న జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నగర పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, స్థానిక సంస్థలకు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్ స్థానిక సెలవు ప్రకటించారు.

ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి మాత్రం ఈ సెలవు వర్తించదు.

ఎన్నికల ఏర్పాట్ల కోసం పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన పాఠశాలలు, కళాశాలలకు ప్రత్యేక సెలవులు ప్రకటించారు.

అక్టోబర్ 31న పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు, ఎన్నికల సామగ్రి పంపిణీ, భద్రతా చర్యలు చేపట్టనున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలుగా ఉన్న విద్యాసంస్థలకు ఆ రోజు కూడా సెలవు ఉంటుంది. నవంబర్ 1న పోలింగ్ రోజు కూడా ఆయా విద్యాసంస్థలు మూసివేయనున్నారు.

ఇక నవంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు ఆ రోజు కూడా సెలవు ప్రకటించారు.

 

ప్రైవేట్ ఉద్యోగులకు కూడా సెలవు

 

విశాఖ నగరంలోని ప్రైవేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు నవంబర్ 1న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

అత్యవసర సేవలు, పనులు నిలిపివేయలేని పరిశ్రమల్లో పనిచేసేవారికి పూర్తి రోజు సెలవు ఇవ్వడం సాధ్యం కాకపోతే, ఓటు వేసేందుకు కనీసం మూడు గంటల సమయం కేటాయించాలని సూచించారు.

 

ఎవరికి సెలవులు వర్తిస్తాయి?

 

ఈ సెలవులు విశాఖపట్నం నగర పరిధిలోని సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలకు వర్తిస్తాయి. ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయని భావించకూడదు.

విద్యార్థులు, తల్లిదండ్రులు తమ పాఠశాల యాజమాన్యం నుంచి సెలవులపై పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఎన్నికల ఏర్పాట్లకు అనుగుణంగా ప్రకటించిన ఈ సెలవులతో విద్యార్థులకు మరోసారి విశ్రాంతి లభించనుంది.

Also Read: 

తలుపులు, లైట్లు లేని టాయిలెట్లు.. హైదరాబాద్ బస్తీల్లో ఆడపిల్లల పీరియడ్స్ కష్టాలపై షాకింగ్ రిపోర్ట్..!!

Add Zee News as a Preferred Source

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES