Honor X9e S Launched: ఇంటర్నేషనల్ మార్కెట్‌లో హానర్ కంపెనీ స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్ ఉంది. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో అత్యంత తక్కువ ధరల్లోనే అందుబాటులోకి వస్తాయి. అందుకే వీటిని చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇదిలా ఉంటే హానర్ కంపెనీ తమ హానర్ X9e s స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని కంపెనీ అద్బుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఇది చాలా అద్భుతమైన డిస్ల్పేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హానర్ X9e s ధర వివరాలు ఇవే..
ఈ హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ కంపెనీ సౌదీ అరేబియాలో లాంచ్ చేసింది. అంతేకాకుండా ఇది అక్కడ ధర 1,499 సౌదీ రియాల్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే, దీని ధర భారత మార్కెట్‌లో సుమారుగా రూ.38,000 వరకు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ అధికార వెబ్‌సైట్‌లోకి కూడా అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం డాన్ ఆరెంజ్, గ్లేసియర్ వైట్‌తో పాటు మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌ను కలిగి ఉండబోతోంది.
హానర్ X9e ఫీచర్ల వివరాలు..
హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ 6.79-అంగుళాల డిస్‌ప్లేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే 1.5K రిజల్యూషన్‌తో కూడిన స్పెషల్ AMOLED ప్యానెల్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో పాటు గరిష్ట బ్రైట్‌నెస్ 1800 నిట్స్, 3840Hz PWM డిమ్మింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రావడం విశేషం.. అలాగే ఇది అద్భుతమై ప్రాసెసర్‌తో లాంచ్ అయ్యింది. ఇది స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌పై రన్ అవుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చింది. గేమింగ్ చేసేవారికి గ్రాఫిక్స్ కోసం Adreno 810 GPU సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇది 8GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంటుంది.
కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరాతో పాటు 5MP అల్ట్రావైడ్ సెన్సార్ కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సెల్ఫీతో పాటు వీడియో కాలింగ్ కోసం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతంగా 16MP ఫ్రంట్ కెమెరాను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇది చాలా అద్భుతమైన బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్‌లో ఎంతో శక్తివంతమైన 8,560mAh బ్యాటరీతో వచ్చింది. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.