• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /వైఎస్‌ షర్మిల సంచలన ట్వీట్‌.. కుమార్తె వివాహ వేదికపై కీకల ప్రకటన..

వైఎస్‌ షర్మిల సంచలన ట్వీట్‌.. కుమార్తె వివాహ వేదికపై కీకల ప్రకటన..

YS Sharmila Tweet About Yalahanka Palace: మానవ సంబంధాలన్ని ఆర్ధిక సంబంధాలే అన్నట్టుగా ఉంది ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల చూస్తుంటే. తాజాగా బెంగళూరులోని వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన యలహంక ప్యాలెస్ ఇష్యూ ఇపుడు మరోసారి వివాదానికి కేంద్ర బిందువు అయింది. తాజాగా ఈ ప్యాలెస్ తనదేనంటూ వైయస్ షర్మిల ఎక్స్ వేదిక అన్న జగన్మోహన్ రెడ్డి తీరును ఎండగడుతూ సుదీర్ఘ ట్వీట్ చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 31, 2026, 11:47 AM IST|Updated: Oct 31, 2026, 11:50 AM IST
joinshare
వైఎస్‌ షర్మిల సంచలన ట్వీట్‌.. కుమార్తె వివాహ వేదికపై కీకల ప్రకటన..
Image Credit: YS Sharmila Tweet (File/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
విడుదలకు ముందే రామాయణ మరో రికార్డు.. ఈ రేంజ్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు..

విడుదలకు ముందే రామాయణ మరో రికార్డు.. ఈ రేంజ్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు..

2

విడుదలకు ముందే ‘రామాయణ’ పై ఈ స్థాయి నెగిటివిటీ ఏంటి.. అసలేం జరుగుతోంది..

3

వైఎస్‌ షర్మిల సంచలన ట్వీట్‌.. కుమార్తె వివాహ వేదికపై కీకల ప్రకటన..

4

మార్కెట్‌లోకి Honor కొత్త ఫోన్.. 80W ఫాస్ట్ ఛార్జింగ్, అదిరిపోయే ఫీచర్లు!

5

2 లక్షల మందికి కేవలం 33 వేల మందే దరఖాస్తు.. NMMS స్కాలర్‌షిప్‌పై విద్యాశాఖ డైరెక్టర్‌కు లేఖ..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

YS Sharmila Vs YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ఆర్‌సీపీ సుప్రీమో వై.యస్. జగన్మోహన్ రెడ్డికి ఆమె చెల్లెలు ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైన వై.యస్. షర్మిల మధ్య మరోసారి ఆస్తి వివాదం రాజుకుంది. బెంగళూరులో వై.యస్.జగన్ ఉంటున్న యలహంక ప్యాలెస్‌లో తన కూతురు పెళ్లికి అనుమతులు నిరాకరించిన నేపథ్యంలో ఈ ఇష్యూ చినికి చినికి గాలివానల మారింది.

తాజాగా ఈ అన్నా చెల్లెల్ల మధ్య చిచ్చు రేపుతోన్న   ఆస్తుల వివాదంపై వైఎస్ షర్మిల ఎక్స్ వేధికగా సంచలన ట్వీట్ చేశారు. తనది కాని దానికోసం ఆశపడే నీచ మనస్తత్త్వం తనది కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం తనకే దఖలు పడిందన్నారు. ఆ ప్యాలెస్ తన పిల్లల భాగానికి వచ్చిందని తెలిపారు. ఇది దేవుడి సాక్షిగా నిజం.

 

నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు. జగన్ మోహన్ రెడ్డి గారు @ysjagan ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం. నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న YSR తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది.. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని. కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం. వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం. కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.

— YS Sharmila (@realyssharmila) October 31, 2026


తన బిడ్డల హక్కు కాబట్టి, నాన్న YSR తిరిగిన ఇల్లు కాబట్టి, కుమార్తె అంజిలి కోరినట్లుగా ఆమె వివాహం అక్కడ చేయాలనుకున్నాను.  తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా అదే విషయాన్ని చెబుతారు.  సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమన్నారు.  తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదికగా మారాలన్న తన  బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయినందుకు  చాలా బాధపడుతున్నామని షర్మిల ఎక్స్ వేదిక ఆవేదన వ్యక్తం చేశారు. వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, తన బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు వైయస్ జగన్ తల్లి విజయమ్మ కూడా ఈ ఆస్తి షర్మిలదే అన్నట్టు నోటరీ కాగితం చూపించిన సంగతి తెలిసిందే కదా. 
 

 

Add Zee News as a Preferred Source
TAGS:
YS Jagan Mohan Reddy
YCP
AP News
Andhra Pradesh