SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Anand Mahindra: రాప్తాడు బాలిక లక్ష్మికి ఆనంద్ మహీంద్రా అండ.. చదువు ఖర్చులన్నీ భరిస్తానని హామీ..

Raptadu girl incident: రాప్తాడులో ఉన్మాది హేమంత్ గోపికపై దాడి చేసేటప్పుడు లక్ష్మి అనే ఆమె స్నేహితురాలు తన ధైర్యంతో అతడ్ని నిలువరించింది. ఈ ఘటనలో ప్రస్తుతం ఆస్పత్రిలో కొలుకుంటుంది. బాలికకు చదువు విషయంలో అన్ని విధాలుగా అండగా ఉంటానని బిజినెస్ మెన్ ఆనంద్ మహీంద్రా ట్విట్ చేశారు.

Written By Inamdar Paresh
Published: Nov 06, 2026, 02:10 PM IST | Updated: Nov 06, 2026, 02:17 PM IST
Image Credit: anandmahindra(file)
Join

Anand mahindra promises education support to raptadu brave girl: అనంతపురంలోని రాప్తాడులో  ఉన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ గోపిక, లక్ష్మిలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతే కాకుండా  గోపిక బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆమెకు వైద్యులు ఇటీవల కుడిభుజంకు శస్త్ర చికిత్స అందించారు. నార్మల్ గా లేచి నడిచేందుకు బాలిక ప్రయత్నం చేస్తుంది. మరోవైపు గోపిక స్నేహితురాలు లక్ష్మి సైతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.  అంతే కాకుండా  లక్ష్మిపేరును ఇటీవల ఏపీ ప్రభుత్వం నేషనల్ బ్రేవరీ అవార్డుకు సైతం నామినేట్ చేసింది. 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం బాలికతో మాట్లాడి.. అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. మరోవైపు  లక్ష్మి తల్లి రమాదేవి ప్రైవేట్‌ కాలేజీలో స్వీపర్‌, తండ్రి నాగరాజు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. లక్ష్మి నానమ్మ అంజినమ్మ కాళ్లు చచ్చుపడిపోయాయి. ఈ క్రమంలో బాలికను ఆదుకొవాలని ఒక నెటిజన్లు వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రను ట్యాగ్ చేసి ట్విట్ చేశారు. దీనిపై ఆనంద్ మహీంద్ర తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు.

బిజినెస్ మెన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా సమజంలో జరిగే అనేక ఘటనలపై తనదైన స్టైల్ లో రియాక్ట్ అవుతుంటారు. ముఖ్యంగా యువతకు తన ట్విట్ లతో మోటివేట్ చేస్తుంటారు. ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కూడా అండగా నిలిచారు. ఈ  క్రమంలో రాప్తాడు బాలిక లక్ష్మి విషయంపై కూడా ఆనంద్ మహీంద్రా రియాక్ట్ అయ్యారు. బాలిక ఉన్మాది దాడి చేసే క్రమంలో చూపిన ధైర్యంకు ప్రశంసించారు. వీరులు కొన్నిసార్లు స్కూల్ యూనిఫాంలోనూ కనిపిస్తారంటూ ఆమెసాహాసంను కొనియాడారు.

ధైర్యం అంటే భయం లేకపోవడం కాదని.. క్లిష్టమైన పరిస్థితుల్లో మరోకరికి అండగా ఉండటం నిజమైన ధైర్యం అని బాలికపై  ప్రశంసలు కురిపించారు. బాలిక పూర్తి చదువుకు తాను అండగా ఉంటానని ప్రకటించారు. అన్ని ఖర్చులన్ని భరించి ఆదుకుంటానని సైతం భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో ఆనంద్ మహీంద్రా నిర్ణయం పట్ల మంత్రి నారా లోకేష్ సైతం హర్షం వ్యక్తం చేశారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES