Fire Accident in karmabhoomi Express: అమృత్ సర్ నుంచి జల్ఫాయ్ గుడికి వెళ్తున్న కర్మభూమి ఎక్స్ ప్రెస్ లో రైలులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో రైలును ఆపి ప్రయాణికులు దాని నుంచి బైటకు దూకేశారు. చూస్తుంగానే మంటలు నాలుగు భోగీలకు వ్యాపించాయి. కోచ్ అంతట నల్లని పొగలు అలుముకున్నాయి. ట్రైన్ పంజాబ్ లోని రాజ్ పురా వద్దకు రాగానే మంటలు వ్యాపించినట్లు ప్రయాణికులు చెబుతున్నారు.
Fire On 4 Coaches Of Karmabhoomi Express In Punjab, Panic Among PassengersAccording to sources, the cause of the fire is suspected to be a short circuit. The exact cause, however, is yet to be officially confirmed. https://t.co/4KHxhBtllh
— Shakeel Yasar Ullah (@yasarullah) November 6, 2026
వెంటనే స్థానికుల సమాచారంతో అధికారులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ట్రైన్ లో విద్యుత్ అఘాతంతో మంటలు చెలరేగాయని రైల్వే అధికారులు ప్రాథమికంగా అంచనావేస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంత మంత టెన్షన్ వాతావరణం నెలకొంది. తొలుత రైలులోని ఒక భోగి లో మంటలు అంటుకున్నాయని, అవి క్రమంగా మిగతా భోగీలకు వ్యాపించాయని దీంతో అప్రమత్తమైన కొంత మంది ప్రయాణికులు చైన్ ను లాగడటంతో అందరు ట్రైన్ నుంచి బైటకు దూకేశారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు భిన్న కోణాల్లో విచారణ చేపట్టారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. అంతే కాకుండా ఆస్తినష్టంపై విచారణ కోసం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.