• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /"ఆమె ధైర్యమే నన్ను నిలబెట్టింది".. ఆమె క్యాన్సర్ పోరాటం నా జీవితాన్ని మార్చేసింది: కివీస్ బౌలర్ ..!!

"ఆమె ధైర్యమే నన్ను నిలబెట్టింది".. ఆమె క్యాన్సర్ పోరాటం నా జీవితాన్ని మార్చేసింది: కివీస్ బౌలర్ ..!!

Blair Tickner: న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్ తన జీవితంలోని అత్యంత కఠినమైన రోజులను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. క్యాన్సర్‌తో తన భార్య చేసిన పోరాటం.. ఆ సమయం తన జీవితాన్ని.. క్రికెట్‌పై ఉన్న దృక్పథాన్ని ఎలా మార్చివేసిందో వెల్లడించాడు.

Written ByBhoomi
Published: Nov 06, 2026, 03:22 PM IST|Updated: Nov 06, 2026, 03:24 PM IST
joinshare
"ఆమె ధైర్యమే నన్ను నిలబెట్టింది".. ఆమె క్యాన్సర్ పోరాటం నా జీవితాన్ని మార్చేసింది: కివీస్ బౌలర్ ..!!
Image Credit: Blair Tickner

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
DVC ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నోటిఫికేషన్ 2026.. పరీక్ష లేకుండానే ఎంపిక!  అర్హతలు, ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ ఇదే!

DVC ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నోటిఫికేషన్ 2026.. పరీక్ష లేకుండానే ఎంపిక! అర్హతలు, ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ ఇదే!

2

Diwali Tips: మంచిర్యాలలో ప్రకృతి మిత్ర ర్యాలీ.. 'టపాసులు వద్దు.. మట్టి దీపాలే ముద్దు'

3

Amitabh House Bomb Threat: ముంబైలో మరోసారి బాంబు కలకలం..ఏకంగా అమితాబ్ బచ్చన్ ఇంటికే స్పాట్ పెట్టిన దుండగులు!

4

వధూవరులను ఎత్తుకుని గిరగిరా తిరుగుతూ మహిళల డ్యాన్స్.. వీడియో వైరల్!

5

భూమి గుండ్రంగా ఉంటే మనం ఎందుకు కింద పడిపోము? భూమిపై నిలబడటం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Blair Tickner: న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్ తన జీవితంలోని అత్యంత కఠినమైన రోజులను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. క్యాన్సర్‌తో తన భార్య చేసిన పోరాటం.. ఆ సమయం తన జీవితాన్ని..  క్రికెట్‌పై ఉన్న దృక్పథాన్ని ఎలా మార్చివేసిందో వెల్లడించాడు.  ఈ ఏడాది ఏప్రిల్‌లో టిక్నర్ భార్య సారా  లుకేమియా  (బ్లడ్ క్యాన్సర్) బారిన పడింది. ఆ తర్వాత సుదీర్ఘంగా 8 నెలల పాటు ఆసుపత్రిలోనే ఉంటూ నిరంతర చికిత్స పొంది..  ఎట్టకేలకు ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా కోలుకుంది. ఈ గండం నుంచి బయటపడే క్రమంలో అనుభవించిన మానసిక వేదన తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని టిక్నర్ పేర్కొన్నాడు. భార్య చూపించిన ధైర్యం తనకు కొండంత కొండంత అండగా నిలిచిందని.. ఆమె పోరాటమే తనకు అసలైన స్ఫూర్తి అని తెలిపాడు. జీవితంలో అసలైన ప్రాధాన్యతలు ఏంటో ఈ కష్టకాలం తనకు నేర్పించిందని ఆవేదనతో పంచుకున్నాడు.

భారత్ కు రెండో వన్డేకు ముందు వెల్లింగ్టన్ మీడియాతో టిక్నర్ మాట్లాడారు. నా జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. ఈ కష్టకాలంలో నా భార్య సారా, నా కుటుంబం అండగా నిలవడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు నేను మళ్లీ నా క్రికెట్ ను ఆస్వాదిస్తున్నాను. నా కెరీర్ ప్రారంభంలో చాలా ఒత్తిడికి గురయ్యాను. ఆ తర్వాత నా భార్య క్యాన్సర్ చికిత్స సమయంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు ఆ దశ నుంచి వచ్చాక సరదాగా క్రికెట్ ఆడాలని నిర్ణయం తీసుకున్నాను. అదే నేను ఇప్పుడు చేస్తున్నానంటూ వివరించాడు.

ఈ  కష్టకాలం తనకు విలువైన పాఠం నేర్పించిందని టిక్నర్ అన్నాడు. క్రికెట్ నా కెరీర్ లో ఒక ముఖ్యమైన భాగమే. అయినప్పటికీ అదే నా సర్వస్వం కాదు. జీవితం అనేది అంతకంటే పెద్దది. ఆట ముగిసిన తర్వాత నా కూతురు కోసం.. నా భార్య కోసం ఇంటికి వెళ్లడం కంటే సంతోషం మరొకటి ఉండదు. అలా వెళ్లగలుగుతున్నందుకు నేను చాలా అద్రుష్టవంతుడిని. అందుకే ఇప్పుడు క్రికెట్ కు ప్రాధాన్యం కాస్త తగ్గిందని తెలిపాడు.

ఇటీవల భారత్‌తో జరిగిన తొలి వన్డేలో టిక్నర్ తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. 11వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ.. అతను నాలుగు సిక్సర్లతో సహా 34 పరుగులు చేశాడు. అతను సరదాగా స్పందిస్తూ.. నేను ఇంతకుముందు ఇంగ్లాండ్‌పై బాగా బ్యాటింగ్ చేశాను. ఒకవేళ నన్ను బ్యాటింగ్ ఆర్డర్‌లో 10వ స్థానానికి ప్రమోట్ చేస్తే సంతోషిస్తాను. నేను క్రమంగా మూడో స్థానానికి చేరుకోవాలనుకుంటున్నాను  అని నవ్వుతూ అన్నాడు.

వన్డేలలో పరిస్థితులు బౌలర్లకు అనుకూలంగా ఉంటాయని..  400 వంటి భారీ స్కోర్లు నమోదయ్యే మ్యాచ్‌లు తనకు నచ్చవని టిక్నర్ అభిప్రాయపడ్డాడు. వెల్లింగ్టన్ పిచ్‌పై అదనపు మద్దతు, బౌన్స్ ఆశిస్తున్నట్లు అతను చెప్పాడు. న్యూజిలాండ్‌లోని ప్రతి మైదానం భిన్నంగా ఉంటుందని.. దానికి అనుగుణంగా డెత్ ఓవర్లలో తన బౌలింగ్‌ను ప్లాన్ చేసుకుంటానని అతను వివరించాడు.

Also Read: 

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కొత్త బాదుడు.. ఏకంగా 29 నెలల కరెంట్ బిల్లు కట్టాల్సిందే!

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News
Telugu News