• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Andhra Pradesh Drought: ఆంధ్రప్రదేశ్‌లో కరువు వస్తుందా? 53 ఏళ్లలో అధ్యయనంలో భయంకరమైన నిజాలు!

Andhra Pradesh Drought: ఆంధ్రప్రదేశ్‌లో కరువు వస్తుందా? 53 ఏళ్లలో అధ్యయనంలో భయంకరమైన నిజాలు!

Andhra Pradesh Drought Threat: భారత వాతావరణ శాఖ (IMD), నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ (NCMRWF), ఆస్ట్రియా విశ్వవిద్యాలయ పరిశోధకులు సంయుక్తంగా 1971 నుండి 2022 వరకు నిర్వహించిన 52 ఏళ్ల సమగ్ర అధ్యయనంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా పొడిబారుతూ తీవ్ర కరువు ప్రాంతంగా మారుతోందని వెల్లడైంది. వర్షపాతం తగ్గడం, పగలు, రాత్రి ఉష్ణోగ్రతల తీవ్ర పెరుగుదల.. పట్టణీకరణ వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి రాబోతుందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

Written ByHarish Darla
Published: Sep 20, 2026, 09:46 AM IST|Updated: Sep 20, 2026, 09:53 AM IST
joinshare
Andhra Pradesh Drought: ఆంధ్రప్రదేశ్‌లో కరువు వస్తుందా? 53 ఏళ్లలో అధ్యయనంలో భయంకరమైన నిజాలు!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Andhra Pradesh Drought Threat: ఒకప్పుడు సుభిక్షంగా విలసిల్లిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అత్యంత వేగంగా పొడిబారుతూ, దేశంలోనే తీవ్ర కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఒకటిగా మారుతోందని శాస్త్రీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD), NCMRWF, ఆస్ట్రియా విశ్వవిద్యాలయ పరిశోధకులు కలసి 1971 నుండి 2022 వరకు నిర్వహించిన 52 ఏళ్ల అధ్యయనంలో ఈ నిజాలు బయటపడ్డాయి. 'భారత ఉపఖండంలో వాతావరణ తీవ్రతల పరిణామ క్రమం' పేరిట రూపొందించిన ఈ నివేదిక అంతర్జాతీయ ప్రఖ్యాత పరిశోధనా పత్రిక 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లైమటాలజీ'లో ప్రచురితమైంది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..తగ్గిపోతున్న చల్లని రాత్రులు
వాతావరణ మార్పుల తీవ్రతల్లో కరువు అనేది అత్యంత వేగంగా విస్తరిస్తోందని ఈ పరిశోధనా సంస్థలు పేర్కనగా.. రాష్ట్రం గత కొన్నేళ్లుగా తీవ్ర క్షామ పరిస్థితులను చవిచూస్తోందని కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి ఎం. రాజీవన్ వివరించారు. గతంలో పగటిపూట ఎండలు ఉన్నప్పటికీ రాత్రివేళల్లో వాతావరణం చల్లబడేది. కానీ వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న ఉద్గారాలు, 'అర్బన్ హీట్ ఇండెక్స్' ప్రభావం వల్ల రాత్రివేళల్లో చల్లదనం పూర్తిగా లోపిస్తోంది.

బంగాళాఖాతానికి సమీపంలో ఉండటం వల్ల తేమ, ఉష్ణోగ్రతలు కలిసి తీవ్రమైన ఉక్కపోతను కలిగిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, వాయుగుండాలు నేరుగా లోతట్టు ప్రాంతాలకు విస్తరించడం తగ్గడం కూడా వర్షాభావానికి ప్రధాన కారణమవుతోంది. రాత్రి ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల పంటల ఎదుగుదల దెబ్బతినడమే కాక ప్రజలు అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

భవిష్యత్ కార్యాచరణ..
ఈ విపత్కర పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు తక్షణ కార్యాచరణ చేపట్టడం అత్యవసరం. సమగ్ర నీటి నిర్వహణ విధానాలను అమలు చేయడం, వర్షపు నీటిని ఒడిసిపట్టే పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం తప్పనిసరి. పట్టణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించడానికి హరిత ప్రణాళికలతో పచ్చదనాన్ని పెంపొందించాలని, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

(గమనిక: ఇక్కడ పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని అధ్యయనాల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించింది మాత్రమే. దీన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో నీటి ఎద్దడి, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అవగాహన కోసం పొందుపరిచినది. ఇందులో పేర్కొన్న అధ్యయనాలను జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also  REad: ప్రయాణికులకు దసరా, దీపావళి కానుక.. వచ్చే నెల నుంచి ఈ రూట్‌లో వందే భారత్ స్లీపర్!

Also REad: AP Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర అలజడి..తుఫానుగా మారి అనేక జిల్లాలకు అలెర్ట్!

 


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source