AP govt appoints new specified authority in Tirumala: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నవంబర్ 1న టీటీడీ పాలకమండలిని, ఛైర్మన్‌గా బీఆర్ నాయుడును నియమించింది. ఈ క్రమంలో రెండెళ్ల నుంచి బీఆర్ నాయుడు చైర్మన్ గా కొనసాగుతున్నారు. అయితే.. అక్టోబరు 31న టీటీడీ పాలక మండలి టర్మ్ ముగిసింది. దీంతో ఏపీ ప్రభుత్వం టీటీడీ పాలక మండలి స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీ ని నియమించింది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఈవో ముద్దాడ రవీచంద్రను ఈ అథారిటీకి చైర్మన్‌గా , సభ్యులుగా ఆర్థికశాఖ కార్యదర్శి వినయ్‌చంద్, దేవదాయశాఖ కార్యదర్శి కన్నబాబును నియమించింది. మరోవైపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉండటంతో వల్ల ఎన్నికల కోడ్ ముగిసే వరకు కొత్త పాలక మండలిని నియమించే వెసులుబాటు ఉండదు. అప్పటి వరకుఈ స్పెసిఫైడ్ అథారిటీ ఆధ్వర్యంలో తిరుమల కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చెప్పింది.
తిరుపతిలో మురసు తుపాన్ పై అప్రమత్తం..
మురసు తుపాన్ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి భక్తులకు లు సూచనలు చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్నప్రసాదాల పంపిణీకి అంతరాయం లేకుండా, క్యూలైన్లు బయటకు రాకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంతో పాటు, వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించాలని, సాధ్యమైనంత వరకు క్యూ లైన్లు వెలుపలకు రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. శ్రీవారి భక్తులంతా సురక్షితంగా, సులభంగా శ్రీవారి దర్శనం చేసుకుని వెళ్లాలని సూచించారు.