SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌ను వెంటాడుతున్న మరో ముప్పు..రాబోయే 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు!

Andhra Pradesh Rain Alert: అండమాన్ సమీపంలోని బంగాళాఖాతం సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడుతూ అల్పపీడనంగా మారింది. ఇప్పుడా అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. దీని కారణంగా ఏపీ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు మూడు రోజులు పాటు కురిసే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Written By Harish Darla
Published: Oct 30, 2026, 04:32 PM IST | Updated: Oct 30, 2026, 04:36 PM IST
Join

Andhra Pradesh Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మరో వాతావరణ ముప్పు పొంచి ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ దక్షిణ భాగంలోని బంగాళాఖాతం సముద్రం పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం అక్కడే కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉంది.

ఈ వ్యవస్థ పశ్చిమ - వాయువ్య దిశగా ప్రయాణం చేస్తూ.. అక్టోబర్ 31 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం సహా అండమాన్ - నికోబార్ దీవుల సమీపంలో మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఆ విధంగా ఏర్పడిన అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తీరం వైపుగా కదిలే సూచనలున్నాయని తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రం, యానాం పరిసర ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు వీస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

వివిధ ప్రాంతాల్లో వర్షపాత వివరాలు..
కోస్తాంధ్రలోని యానాం ప్రాంతంలో శుక్ర, శనివారాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ పిడుగులు పడే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం అనగా నవంబరు 1 నాటికి వర్ష ప్రభావం పెరిగి పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం మెండుగా ఉంది. ఈ మూడు రోజుల పాటు తీరం వెంబడి గాలుల వేగం గంటకు 30 నుండి 40 కిలోమీటర్లు ఉండబోతుందని అంచనా. అలాగే గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం కూడా ఉందని అధికారులు బలంగా చెబుతున్నారు.

రాయలసీమ ప్రాంతంలోనూ శుక్ర, శనివారాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఆదివారం నాడు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు జల్లులు కొన్ని ప్రాంతాల్లో పడే వీలుంది. ఈ ప్రాంతంలోనూ గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

అధికారుల హెచ్చరికలు, జాగ్రత్తలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బలమైన ఈదురుగాలులు, పిడుగుల తీవ్రత దృష్ట్యా ప్రజలు, రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాలు, ఉరుముల సమయంలో చెట్ల కింద గానీ.. లేదా శిథిలావస్థలో ఉన్న భవనాల కింద గానీ ఆశ్రయం పొందవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES