• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP 3D Printed House: ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ విప్లవం..రూ.5 లక్షలకే పేదలకు 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్లు..

AP 3D Printed House: ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ విప్లవం..రూ.5 లక్షలకే పేదలకు 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్లు..

AP 3D Printed House Project: ఆంధ్రప్రదేశ్ పేదల గృహ నిర్మాణం కోసం దేశంలోనే తొలిసారిగా '3డీ కాంక్రీట్ ప్రింటింగ్' సాంకేతికతను వినియోగించనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ 2.0 (PMAY-G 2.0) కింద రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI) సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో 100 ఇళ్లు, గుంటూరు గ్రామీణ పరిధిలోని ఓబుల్‌నాయుడుపాలెంలో దివ్యాంగుల కోసం 77 ఇళ్లను ప్రయోగాత్మకంగా నిర్మించనున్నారు.

Written ByHarish Darla
Published: Oct 02, 2026, 11:15 AM IST|Updated: Oct 02, 2026, 11:22 AM IST
joinshare
AP 3D Printed House: ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ విప్లవం..రూ.5 లక్షలకే పేదలకు 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్లు..

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఎంపీ అవినా‌ష్‌కు ట్విస్ట్..నోటీసులు జారీ చేసిన ఈడీ..విచారణకు రావాల్సిందే!

Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఎంపీ అవినా‌ష్‌కు ట్విస్ట్..నోటీసులు జారీ చేసిన ఈడీ..విచారణకు రావాల్సిందే!

2

నవరాత్రుల్లో సూర్యుడి ఎఫెక్ట్‌.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్‌ జాక్‌ఫాట్, బంపర్‌ లాభాలు!

3

CEC జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు కోరుతూ రోడ్డెక్కిన CJP.. ముంబైలో హైడ్రామా..

4

AP 3D Printed House: ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ విప్లవం..రూ.5 లక్షలకే పేదలకు 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్లు..

5

అక్టోబర్ 4న సూర్య, శని గ్రహాల అరుదైన యోగం.. ఈ 3 రాశులకు ధనలాభం, బంపర్ జాక్‌ఫాట్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP 3D Printed House Project: సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే పేద ప్రజల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యాధునికమైన '3డీ కాంక్రీట్ ప్రింటింగ్' సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నాయి. గృహ నిర్మాణ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులను జోడించి, అతి తక్కువ సమయంలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఇళ్లను నిర్మించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశంగా మారింది. రూర్కీలోని ప్రఖ్యాత 'సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్' (సీబీఆర్‌ఐ) ఈ ప్రాజెక్టుకు సంపూర్ణ సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది.

నిర్మాణ వ్యయం, మౌలిక వసతులు.. 
ఈ నూతన 3డీ సాంకేతికతతో నిర్మించే ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ. 5.10 లక్షలుగా ఖరారు చేశారు. సాధారణంగా పీఎంఏవై పథకం కింద లభించే రూ. 2.39 లక్షల ఆర్థిక సాయానికి అదనంగా, ఈ కొత్త టెక్నాలజీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరిన్ని నిధులను సమకూరుస్తోంది. ఈ రూ. 5.10 లక్షల వ్యయంలోనే కేవలం గోడలు, స్లాబ్ మాత్రమే కాకుండా స్థలం అభివృద్ధి, మెట్లు, మరుగుదొడ్డి, ర్యాంప్, షెడ్ వంటి అన్ని ప్రాథమిక మౌలిక వసతులను కల్పిస్తారు.

కేంద్రమంత్రి పెమ్మసాని చొరవతో పైలట్ ప్రాజెక్ట్.. 
ఈ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక పాత్ర వహించారు. సీబీఆర్‌ఐలోని ప్రయోగాత్మక 3డీ ఇళ్లను ఆయన స్వయంగా పరిశీలించిన తర్వాత, తన స్వగ్రామమైన బుర్రిపాలెంలో 100 ఇళ్లను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించారు. దీనికి తోడు ఓబుల్‌‌నాయుడుపాలెంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా 77 ఇళ్లను ఈ విధానంలోనే నిర్మించనున్నారు.

రూ. 13.93 కోట్ల నిధులు 
ఈ మొత్తం ప్రయోగాత్మక ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 13.93 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ. 9.44 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 4.49 కోట్లను వెచ్చించనుంది. అక్టోబర్ 4న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, సీబీఆర్‌ఐ ప్రతినిధుల మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదరనుంది. పేదలకు తక్కువ వ్యవధిలోనే నాణ్యమైన వసతులు కల్పించే ఈ నిర్ణయం గృహ నిర్మాణ రంగంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
Telugu News
Chandrababu Naidu