SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Chandrababu: అర్నాబ్‌ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన.. బాధితులతో ముఖాముఖి

AP CM Chandrababu Ground Level Review In Konaseema District: అర్నాబ్‌ తుఫానుతో గజగజ వణికిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అర్నాబ్‌ తుఫాన్‌ విధించిన నష్టాన్ని కళ్లారా చూసి.. అనంతరం బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాధితులకు అండగా తాము ఉన్నామని భరోసా ఇచ్చారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 29, 2026, 07:52 PM IST | Updated: Oct 29, 2026, 08:17 PM IST
Image Credit: Source: Jai TDP X (Twitter)
Join

Arnab Cyclone: డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. నీట మునిగిన పొలాలను పరిశీలించారు. వేట్లపాలెంలో అర్నబ్ తుఫాన్ బాధిత రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. అధికారులు చేపడుతున్న సహయక చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించిందని.. స్థానికంగా ఉన్న ఉద్యోగులు తమకు సూచనలను అందించారని స్థానికులు తెలిపారు.

15 రోజుల్లో కోతకు వచ్చే దశలో ఉండగా తుఫాన్ రావడంతో నష్టపోయామని.. దిగుబడి పడిపోతుందని సీఎం చంద్రబాబు దృష్టికి రైతులు తీసుకువచ్చారు. పంటల బీమా చేయించారా? లేదా? అని స్థానిక అధికారులను అడగ్గా.. బీమా చేయించామని అధికారులు తెలిపారు. దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి.. మువ్వ మొత్తం రాలిపోయిందని దీని వల్ల నష్టం ఎక్కువగా ఉంటుందని కొబ్బరి రైతులు వాపోయారు. సీఎం చంద్రబాబు పర్యటనలో మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌ ఉన్నారు.

అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ ప్రాంతాల్లో నష్టపోయిన వరిచేలు, అరటి, కొబ్బరి తోటలు, ఆక్వా చెరువులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. నిమ్మకూరు, పామర్రు, బంటుమిల్లి, నరసాపురం, పాలకొల్లు, అమలాపురం, కాట్రేనికోన ప్రాంతాల్లో నీట మునిగిన పొలాలను, కూలిన కొబ్బరి చెట్లు పరిశీలించారు.

కాన్వాయ్ దిగి
అర్నబ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు వద్ద కాన్వాయ్ దిగి, పనుల పురోగతిని సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు శ్రమిస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది, కార్మికులను అభినందించారు.

అత్యంత వేగంగా సహాయక చర్యలు
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఆదేశాలతో సహాయక చర్యలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు 30,000 మంది ప్రభుత్వ సిబ్బంది రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారు. రోడ్లపై కూలిన చెట్లను తొలగిస్తూ.. పడిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి వేస్తూ యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి.

అధైర్యపడవద్దని భరోసా
ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు అమలవుతున్నాయి, బాధితులకు ఎలాంటి సహాయం అందుతోంది, ఇంకా ఏ సమస్యలు పరిష్కరించాల్సి ఉందనే అంశాలను స్వయంగా తెలుసుకునేందుకు పర్యటించారు. తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. రైతులు, మత్స్యకారులు, పేద కుటుంబాలు సహా అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES