YS Jagan slams on ap cm Chandrababu naidu over Arnab cyclone: ఆంధ్ర ప్రదేశ్ ఇటీవల అర్నాబ్ తుపాన్ ప్రభావంతో అల్లాడిపోయింది. ఈ క్రమంలో తుపాన్ ప్రభావంలో బలమైన ప్రచండ గాలులు వీడయంతో ఎక్కడికక్కడ చెట్లు కూలిపోయాయి. కరెంట్ స్తంభాలన్ని నెలకొరిగాయి. ఇక అర్నబ్ తీవ్ర తుపాన్ గా మారి తీరందాటింది. అయితే అర్నాబ్ ప్రభావంపై ఎప్పటికప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సహాయక చర్యలుపై ఆదేశాలు ఇస్తునే ఉన్నారు. మరోవైపు అర్నాబ్ పై బాధితులకు పరహరంసైతం ప్రకటించారు. కేంద్రం కూడా పంట నష్టంపై అధికారులు వచ్చి పంటనష్టంపైస తగిన సాయం అందజేయాలని లేఖను రాశారు. ఈ క్రమంలో అర్నబ్ తుపాన్ ప్రభావంపై మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అర్నబ్ తుపాన్ నష్టం అంచనాల్లో చంద్రబాబువన్ని తప్పుడు లెక్కలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం కనిపిస్తుందన్నారు. కోనసీమ, ఈస్ట్, వెస్ట్, కాకినాడ, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో వరి పంట నష్టం బాగా కనిపిస్తోందన్నారు. మిగిలిన పంటలో 50శాతం దిగుబడి దక్కడం కూడా కష్టమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు వరి రైతు రూ.40వేలు, అరటిమీద ఎకరాకు రూ.2 లక్షలు, ఆక్వారైతులు ఎకరాకు రూ.4-5లక్షలు నష్టపోతున్నారన్నారు. అయినా ప్రభుత్వానికి రైతులను ఆదుకోవడంలో సీరియస్‌నెస్ లేదన్నారు.
తుపాన్ వస్తే ఒక్కరూ చనిపోకూడదని అంటారని, ఇక్కడ 8 మంది చనిపోయినా, చంద్రబాబు మాత్రం అంతా సవ్యంగా ఉందనడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఆర్‌టీజీఎస్‌లో కూర్చుని సీసీ కెమెరాల్లో చూసి, పంట నష్టం తెలుసుకున్నానడం ఎంత వరకు సమంజసమన్నారు. బియ్యం ధరలు విపరీతంగా పెంచారని, ఏపీలోని పలుచోట్ల.. కేజీ రూ.85-90 వరకు అమ్ముతున్నారన్నారు.
సీజ్ ది షిప్ అన్నవారు సీజ్ లేదు, షిప్ లేదంటూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. నాదెండ్లకు ఇంత కమీషన్లు, నారా లోకేష్ కు మరింత కమీషన్లు అంటూ జగన్ సెటైర్లు వేశారు. అసలు బియ్యాన్ని బ్లాక్ చేసి, ఎక్సోపోర్ట్ చేస్తున్నది అంతా టీడీపీ నాయకులేనంటూ విమర్శించారు. మంత్రి పయ్యావుల, టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఇందులో ఉన్నారని వైఎస్ జగన్ మాట్లాడారు.
తుపాను దెబ్బకు రైతులు విలవిలలాడుతుంటే.. చంద్రబాబు మాత్రం పబ్లిసిటీ స్టంట్ లు చేస్తున్నారన్నారు. వరి రైతుకు ఎకరాకు రూ.40 వేల వరకు, అరటి రైతుకు రూ.2 లక్షల వరకు, ఆక్వా రైతుకు రూ.4నుంచి రూ. 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని జగన్ మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయంలో ఉన్న వాలంటరీ, సచివాలయం వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లి బాధితులకు అండగా ఉండాలన్నారు. తుపాన్ బాధితులకు న్యాయం జరిగే వరకు కూటమిపై తమ పోరాటం ఆగదని వైఎస్ జగన్ తెల్చి చెప్పారు.