• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /బంగాళాఖాతంలో వాయుగుండం.. అతి తీవ్ర తుఫాన్‌గా మారి ఏపీ వైపు దూకుడు! 19, 20 తేదీల్లో ఆ జిల్లాల్లో కుంభవృష్టి!

బంగాళాఖాతంలో వాయుగుండం.. అతి తీవ్ర తుఫాన్‌గా మారి ఏపీ వైపు దూకుడు! 19, 20 తేదీల్లో ఆ జిల్లాల్లో కుంభవృష్టి!

వారం రోజుల వ్యవధిలో సంభవించిన రెండు తుఫాన్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కోస్తా జిల్లాలకు మరో తీవ్ర తుఫాన్ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం నేటి అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున తుఫానుగా బలపడనుంది. ఇది రేపటికి తీవ్ర తుఫానుగా మారి వాయువ్య దిశగా కదులుతూ ఏపీ తీరం వైపు దూసుకొస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Written ByRenuka Godugu
Published: Nov 16, 2026, 08:46 IST|Updated: Nov 16, 2026, 08:48 IST
joinshare
బంగాళాఖాతంలో వాయుగుండం.. అతి తీవ్ర తుఫాన్‌గా మారి ఏపీ వైపు దూకుడు! 19, 20 తేదీల్లో ఆ జిల్లాల్లో కుంభవృష్టి!
Image Credit: AP Weather Update:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP Weather Update: 18వ తేదీ నాటికి అది అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఆదివారం రాత్రికి ఇది విశాఖపట్నానికి 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. తీవ్ర తుఫాను ప్రభావంతో ఈ నెల 18వ తేదీ నుంచి కోస్తా ప్రాంతంలో వర్షాలు ప్రారంభమవుతాయి. ఆ రోజున శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి.

19వ తేదీన కాకినాడ, కోనసీమ, యానం, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తుంది. మిగిలిన శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్ జిల్లా వరకు అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో కుంభవృష్టి, శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు మిగిలిన జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.

ఈ నెల 16వ తేదీ నుంచి తీర ప్రాంతం వెంబడి బలమైన గాలులు వీస్తాయి. 19 నుంచి 20వ తేదీ వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 145 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన జిల్లాల్లో 90 నుంచి 100 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, ఈ నెల 13వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం బలపడుతోందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈరోజు అది వాయుగుండంగా బలపడుతుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 18వ తేదీన అది అతి తీవ్ర తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో 19, 20 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అలాగే గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని, ప్రజలు, ప్రభుత్వ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. వారం వ్యవధిలో వచ్చిన రెండు తుఫాన్లు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని చెప్పవచ్చు. మొదట వచ్చిన అర్ణబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని దాదాపు ఆరు, ఏడు జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. అనంతరం వచ్చిన మురుసు తుఫాను నెల్లూరు, నరసాపురం మధ్య ఒంగోలు వద్ద తీరం దాటే సమయంలో గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల ధాటికి పెద్ద ఎత్తున చెట్లు నేలకూలడమే కాకుండా విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపడ్డాయి.

ప్రస్తుతం అల్పపీడనం వాయుగుండంగా బలపడిన తర్వాత తీవ్ర వాయుగుండంగా మారి, అనంతరం తుఫానుగా పరిణమిస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఇది ఉత్తర కోస్తాలోనే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తర్వాత శ్రీలంకలోని కింకోమలికి 620 కిలోమీటర్ల దూరంలో, అండమాన్ దీవుల్లోని శ్రీవిజయపురానికి 680 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1070 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది. ఇది సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తర్వాత తుఫానుగా మారుతుందని అధికారులు తెలిపారు. ఈరోజు తుఫానుగా మారిన అనంతరం మంగళవారానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి, క్రమంగా తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఇది కోస్తా తీరానికి దగ్గరగా వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది.

ఇటీవల వచ్చిన రెండు తుఫాన్లు పెద్ద ఎత్తున నష్టాన్ని మిగిల్చాయి. మొదట వచ్చిన అర్ణబ్ తుఫాను కాకినాడ, కోనసీమ ప్రాంతంలోని యానాం వద్ద తీరం దాటే సమయంలో గంటకు 195 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. వీటి ప్రభావంతో ఏడు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. అనంతరం వచ్చిన మురుసు తుఫాను నెల్లూరు, నరసాపురం, ఒంగోలు మధ్య తీరం దాటినప్పుడు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. రెండు, మూడు రోజులపాటు ఎడతెరపి లేని భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. ముఖ్యంగా అర్ణబ్ తుఫాను ప్రభావంతో ఇచ్చాపురం వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరగా, మురుసు తుఫాను ప్రభావంతో విజయవాడ వంటి పట్టణాల్లో మోకాళ్ల లోతు వరకు నీరు చేరింది. ఈ నెల 19వ తేదీన కాకినాడ, కోనసీమ, యానం, కృష్ణ, బాపట్ల జిల్లాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

అంతేకాకుండా, శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్ జిల్లా వరకు అతి భారీ వర్షాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో, ఇప్పటికే అప్రమత్తమైన విపత్తుల నిర్వహణ శాఖ, భారీ వర్షాలు కురిసే ప్రదేశాలను రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ముందుగానే గుర్తించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు చర్యలు చేపడుతోంది. మిగతా జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు నమోదు కానున్న నేపథ్యంలో, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు, ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశారు. ఎందుకంటే, ఇటీవల వచ్చిన రెండు తుఫానుల ప్రభావంతో వేలాది వృక్షాలు నేలకూలగా, వేలాది ఎకరాల్లోని పంటలు పూర్తిగా నష్టపోయాయి.

ప్రస్తుతం కొనసాగుతున్న ఈ వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి తీరాన్ని తాకే సమయంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అప్పుడప్పుడు ఈ వేగం 145 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, సముద్రంలో అలలు ఎగసిపడే అవకాశం ఉందని, తీర ప్రాంతాల్లోకి అలలు చొచ్చుకు వచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా, ఈ నెల 21వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
AP Weather
AP News
Telugu News