• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /ఏపీ డీఎస్సీలో 23 వేల టీచర్ పోస్టులు ఖాళీలు..? 6,500 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకంపై అభ్యర్థుల నిలదీత.. 16న భారీ ధర్నా..!!

ఏపీ డీఎస్సీలో 23 వేల టీచర్ పోస్టులు ఖాళీలు..? 6,500 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకంపై అభ్యర్థుల నిలదీత.. 16న భారీ ధర్నా..!!

AP DSC Posts Hike Demand; ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురుచూస్తున్న డీఎస్సీ అభ్యర్థులు పోస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు

Written ByBhoomi
Published: Nov 11, 2026, 07:51 PM IST|Updated: Nov 11, 2026, 08:01 PM IST
joinshare
ఏపీ డీఎస్సీలో 23 వేల టీచర్ పోస్టులు ఖాళీలు..?  6,500 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకంపై అభ్యర్థుల నిలదీత.. 16న భారీ ధర్నా..!!
Image Credit: AP DSC 2026

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Babu Mohan: నన్ను తీసుకోకపోవడమే వాళ్ల దురదృష్టం.. నాని ‘ది ప్యారడైజ్’పై బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!

Babu Mohan: నన్ను తీసుకోకపోవడమే వాళ్ల దురదృష్టం.. నాని ‘ది ప్యారడైజ్’పై బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!

2

ఏపీ డీఎస్సీలో 23 వేల టీచర్ పోస్టులు ఖాళీలు..? 6,500 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకంపై అభ్యర్థుల నిలదీత.. 16న భారీ ధర్నా..!!

3

Sonia Gandhi Film: సోనియా గాంధీ జీవితంపై సినిమా చేస్తా.. డబ్బులు రెడీ పెట్టుకోండి!

4

Jayanth and the Jingo: చిల్డ్రన్స్ డే స్పెషల్‌.. థియేటర్లలోకి ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ మూవీ..!

5

జీవో నెం. 25 సవరణపై సీఎం రేవంత్‌తో చర్చిస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు కీలక హామీ..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP DSC Posts Hike Demand; ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురుచూస్తున్న డీఎస్సీ అభ్యర్థులు పోస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, రాబోయే ఏపీ డీఎస్సీలో ఆశించిన స్థాయిలో పోస్టులు ప్రకటిస్తారా లేదా అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలు, ప్రభుత్వ నియామకాలు, రాబోయే రిటైర్మెంట్లను ప్రస్తావిస్తూ ఎక్కువ సంఖ్యలో పోస్టులతో డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఈ నెల 16న భారీ స్థాయిలో ధర్నా నిర్వహించాలని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని చర్చించుకుంటున్నారు.

23 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయా?
ప్రభుత్వం వద్ద ఉపాధ్యాయ పోస్టులు లేవన్న వాదనపై అభ్యర్థులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 6,500 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించారని, ఖాళీలు లేకపోతే ఈ నియామకాలు ఎలా చేపట్టారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కమిషనర్ వెల్లడించిన క్యాడర్ స్ట్రెంత్ జీవో ప్రకారం సుమారు 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ ఖాళీలను పరిగణనలోకి తీసుకుని డీఎస్సీ పోస్టుల సంఖ్యను నిర్ణయించాలని కోరుతున్నారు.

ఏటా 10 వేల మంది రిటైర్మెంట్లు!
ఉపాధ్యాయుల పదవీ విరమణలు కూడా కీలక అంశమని అభ్యర్థులు చెబుతున్నారు. ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కనీసం 10 వేల మంది ఉపాధ్యాయులు రిటైర్ అయ్యే అవకాశం ఉందని, దీంతో రానున్న కాలంలో ఖాళీలు మరింత పెరుగుతాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను కూడా దృష్టిలో పెట్టుకుని నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆలస్యమైనా ఎక్కువ పోస్టులతో డీఎస్సీ నిర్వహించాలి
డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యమైనా తమకు అభ్యంతరం లేదని, అయితే తక్కువ పోస్టులతో కాకుండా భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులతో పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. పోస్టుల సంఖ్య విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ఖాళీలన్నింటినీ భర్తీ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

16న భారీ ధర్నాకు ప్రణాళిక
డీఎస్సీ పోస్టుల పెంపు డిమాండ్‌తో ఈ నెల 16న భారీ స్థాయిలో ధర్నా నిర్వహించాలని అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మొదట ఈ ధర్నాను విజయవంతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, అప్పటికీ పోస్టుల సంఖ్య పెరగకపోతే తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని చర్చిస్తున్నారు. తమ పోరాటానికి మీడియా మద్దతుతో పాటు, ఉపాధ్యాయ నియామకాల విషయంలో న్యాయం కోసం నిలబడే రాజకీయ నాయకుల సహకారం కూడా అవసరమని, ఈ అంశంపై వైఎస్ జగన్‌తో ప్రెస్‌మీట్ నిర్వహింపజేస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి, అధికారులు స్పందించే అవకాశం ఉంటుందని  అభిప్రాయపడుతున్నారు.

మొత్తంగా 23 వేల ఖాళీలు, 6,500 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలు, ఏటా 10 వేల మంది రిటైర్మెంట్లను ప్రస్తావిస్తూ ఏపీ డీఎస్సీలో పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు పట్టుబడుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఎలా స్పందిస్తుందో, 16వ తేదీ ధర్నా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Add Zee News as a Preferred Source
TAGS:
AP News
Telugu News