• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /జీవో నెం. 25 సవరణపై సీఎం రేవంత్‌తో చర్చిస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు కీలక హామీ..!!

జీవో నెం. 25 సవరణపై సీఎం రేవంత్‌తో చర్చిస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు కీలక హామీ..!!

GO 25:తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను బలోపేతం చేయడానికి జీవో నెంబర్ 25ను సవరించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

Written ByBhoomi
Published: Nov 11, 2026, 07:12 PM IST|Updated: Nov 11, 2026, 07:27 PM IST
joinshare
జీవో నెం. 25 సవరణపై సీఎం రేవంత్‌తో చర్చిస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు కీలక హామీ..!!
Image Credit: go 25

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Babu Mohan: నన్ను తీసుకోకపోవడమే వాళ్ల దురదృష్టం.. నాని ‘ది ప్యారడైజ్’పై బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!

Babu Mohan: నన్ను తీసుకోకపోవడమే వాళ్ల దురదృష్టం.. నాని ‘ది ప్యారడైజ్’పై బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!

2

ఏపీ డీఎస్సీలో 23 వేల టీచర్ పోస్టులు ఖాళీలు..? 6,500 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకంపై అభ్యర్థుల నిలదీత.. 16న భారీ ధర్నా..!!

3

Sonia Gandhi Film: సోనియా గాంధీ జీవితంపై సినిమా చేస్తా.. డబ్బులు రెడీ పెట్టుకోండి!

4

Jayanth and the Jingo: చిల్డ్రన్స్ డే స్పెషల్‌.. థియేటర్లలోకి ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ మూవీ..!

5

జీవో నెం. 25 సవరణపై సీఎం రేవంత్‌తో చర్చిస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు కీలక హామీ..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

GO 25:తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను బలోపేతం చేయడానికి జీవో నెంబర్ 25ను సవరించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ టీచర్‌తో నడుస్తున్న పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించడంతో పాటు, విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుడిని, ఒక ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వినతిపత్రం అందించాయి.

4,793 పాఠశాలల్లో సింగిల్ టీచర్‌తోనే బోధన
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏకంగా 4,793 పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో కొనసాగుతున్నాయని తెలిపారు. మరో సుమారు 7 వేల పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులే విద్యాబోధన చేస్తున్నారని వివరించారు. ఐదు తరగతులకు చెందిన విద్యార్థులకు 18 సబ్జెక్టులను ఒకరిద్దరు ఉపాధ్యాయులే బోధించాల్సి వస్తోందని, దీనికి అదనంగా ప్రధానోపాధ్యాయుడి బాధ్యతలు కూడా నిర్వహించాల్సి వస్తోందని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని, బేస్‌లైన్ సర్వే ఫలితాలు కూడా ఈ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలకు దూరమవుతున్న విద్యార్థులు
గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ పాఠశాలలే ప్రధాన విద్యావనరులని ఉపాధ్యాయ సంఘాలు గుర్తుచేశాయి. అయితే తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేకపోవడం, అన్ని పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్య అందుబాటులో లేకపోవడం, ఇంగ్లీష్ మీడియం కొరత వంటి కారణాలతో తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపాయి. ఉపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు వెళ్లడం కూడా గ్రామీణ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణమవుతోందని పేర్కొన్నాయి. కొన్ని గ్రామాల తల్లిదండ్రులు ఆర్థిక భారం భరిస్తూనే తమ పిల్లలను 20 కిలోమీటర్లకు పైగా దూరంలోని ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారని వివరించాయి.

విద్యా వాలంటీర్లను నియమించాలి
ప్రస్తుతం సింగిల్ టీచర్‌తో నడుస్తున్న పాఠశాలల్లో తక్షణమే విద్యా వాలంటీర్లను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్న పాఠశాలల్లోనూ అవసరాన్ని బట్టి అదనపు వాలంటీర్లను నియమించి విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని విజ్ఞప్తి చేశాయి. డిసెంబర్‌లోగా ఈ నియామకాలు చేపట్టాలని కోరాయి.

అలాగే ఒకరిద్దరు ఉపాధ్యాయులతో నడుస్తున్న చిన్న పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేసి, అక్కడ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కాకుండా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని, అదనంగా ప్రధానోపాధ్యాయుడిని నియమించేలా చర్యలు తీసుకోవాలని సూచించాయి.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కీలక సూచనలు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీతో కూడిన ప్రీ-ప్రైమరీ విద్యను ప్రారంభించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన అందుబాటులోకి తీసుకురావాలని సూచించాయి.

ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏడు తరగతులకు ఏడుగురు ఉపాధ్యాయులను నియమించాలని, ఇంగ్లీష్ బోధన కోసం ప్రత్యేకంగా ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌ను కేటాయించాలని కోరాయి. గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల నియామకం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని జీవో నెం.25ను సవరించాలని విజ్ఞప్తి చేశాయి.

ప్రభుత్వ విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలకు ప్రశంసలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించి పలు సంస్కరణలు చేపడుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు అభినందించాయి. 2024 డీఎస్సీ ద్వారా సుమారు 11 వేల మంది ఉపాధ్యాయుల నియామకం, 25 వేలకు పైగా పదోన్నతులు, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యం వంటి నిర్ణయాలను స్వాగతించాయి.

అదేవిధంగా ప్రీ-ప్రైమరీ పాఠశాలల విస్తరణ, విద్యార్థులకు అల్పాహార పథకం, యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలు ప్రభుత్వ విద్యారంగానికి మేలు చేస్తాయని పేర్కొన్నాయి. విదేశీ విద్యావిధానాల అధ్యయనం ద్వారా రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా అభినందించాయి.

ప్రభుత్వం ఇప్పటికే విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపడుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను కూడా పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. జీవో నెం.25 సవరణతో పాటు తమ సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని, గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి చేశాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News