SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP Inter Exam Fee Deadline: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్..పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు గడుపు పెంపు! ఎప్పటి వరకు?

AP Inter Exam Fee Deadline News: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 10వ తేదీ వరకు పరీక్షల ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత చెల్లించే పరీక్షా ఫీజులకు రూ.1,000 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్ర విద్యా మండలి కార్యదర్శి వెల్లడించారు.

Written By Harish Darla
Published: Oct 30, 2026, 05:16 PM IST | Updated: Oct 30, 2026, 05:21 PM IST
Join

AP Inter Exam Fee Deadline News: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యా మండలి విద్యార్థులకు ఒక కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. అమరావతిలో అక్టోబర్ 30న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు సంబంధించి గడువు పొడిగిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల ప్రయోజనార్థం పరీక్ష ఫీజు చెల్లింపునకు అదనపు సమయాన్ని కేటాయించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

నవంబర్ 10 వరకు ఫైన్ లేకుండా..
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబరు 10 వరకు ఎలాంటి అపరాధ రుసుము (Late Fee) చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టమైంది. అయితే ఇంటర్ పరీక్షా ఫీజులను చెల్లించేందుకు ఇప్పుడు విద్యార్థులకు తగిన సమయం అందుబాటులో ఉంది.

రూ.1,000 ఫైన్ అప్పటి నుంచే!
అయితే ఇప్పుడు ఫీజు చెల్లింపునకు తేదీ పొడిగించిన నేపథ్యంలో సాధారణ గడువులోగా ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థుల కోసం విద్యా మండలి మరో అవకాశాన్ని అందుబాటులో ఉంచింది. నవంబర్ 10వ తేదీలోగా ఫీజు చెల్లించలేని విద్యార్థులు రూ. 1,000 ఆలస్య రుసుము (ఫైన్)తో నవంబర్ 17వ తేదీ వరకు తమ పరీక్ష ఫీజును చెల్లించేందుకు అవకాశం ఉంది. విద్యార్థులు ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

విద్యార్థులకు అధికారుల ముఖ్య సూచనలు..
పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా పరీక్ష ఫీజు ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిదని అధికారులు సూచించారు. పరీక్ష ఫీజు చెల్లింపుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం లేదా సందేహాల నివృత్తి కోసం విద్యార్థులు తమ కళాశాలల ప్రిన్సిపాళ్లను / యాజమాన్యాన్ని లేదా ఇంటర్మీడియట్ విద్యా మండలికి చెందిన అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని విద్యా మండలి తెలిపింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES