• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కాలేజీ అమ్మాయిలే టార్గెట్‌‎.. రూ.లక్షల్లో ఆఫర్ చూపి అండాల సేకరణ.. వెలుగులోకి సంచలన విషయాలు..!!

కాలేజీ అమ్మాయిలే టార్గెట్‌‎.. రూ.లక్షల్లో ఆఫర్ చూపి అండాల సేకరణ.. వెలుగులోకి సంచలన విషయాలు..!!

Human Egg Donation: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. బేగంపేట ఘటన మరకముందే మరో సంఘటన కలకలం రేపుతోంది. కాలేజీ అమ్మాయిలే టార్గెట్.. లక్ష రూపాయల డబ్బు ఆశ చూపి అండాలు సేకరిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది.

Written ByBhoomi
Published: Oct 31, 2026, 07:32 PM IST|Updated: Oct 31, 2026, 07:34 PM IST
joinshare
కాలేజీ అమ్మాయిలే టార్గెట్‌‎.. రూ.లక్షల్లో ఆఫర్ చూపి అండాల సేకరణ.. వెలుగులోకి సంచలన విషయాలు..!!
Image Credit: Hyderabad Illegal Egg Collection

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Sandeep Reddy Vanga Vs Sekhar Kammula: గంధపు వాసన అందరికీ ఎలా తెలుస్తుంది....!

Sandeep Reddy Vanga Vs Sekhar Kammula: గంధపు వాసన అందరికీ ఎలా తెలుస్తుంది....!

2

కాలేజీ అమ్మాయిలే టార్గెట్‌‎.. రూ.లక్షల్లో ఆఫర్ చూపి అండాల సేకరణ.. వెలుగులోకి సంచలన విషయాలు..!!

3

Bandi Sanjay: కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగిన బండి సంజయ్‌.. ఏ దేశభక్తులు? అని నిలదీత

4

‘జయంత్ అండ్ ది జింగో పెన్’ కథ చాలా బాగుంది.. థియేటర్ మొత్తం బుక్ చేస్తా: ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

5

Petrol Excise Duty Scrap: కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎక్సైజ్ సుంకం రద్దు.. డీజిల్‌పై మరింత పన్ను భారం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Human Egg Donation: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఏం జరుగుతోంది? నిన్న బేగంపేట్.. నేడు సరూర్ నగర్.. అమాయక యువతులకు డబ్బు ఎరవేసి గలీజ్ దందాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయ్యింది. తాజాగా సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని ఓ ఇంట్లో కాలేజీ విద్యార్థులను టార్గెట్  చేసుకుని నిర్వహిస్తున్న అండాల విక్రయాల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని ఓ ఇంట్లో అండాలను సేకరిస్తున్న పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. అక్కడున్న 18 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే.. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఒప్పుకున్నట్లు అంగీకరించారు. యువతులంతా కాలేజీ అమ్మాయిలే. నిరుపేద యువతను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సరూర్ నగర్ పోలీసులు సదరు నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక విచారణలో యువతులకు భారీ మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆశ చూపి అండాలను సేకరించేందుకు ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించారు. ఇందుకోసం ఇంజెక్షన్లు ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రక్రియలో ఎలాంటి వైద్య విధానాలు అనుసరించారు.. అండాల సేకరణకు అవసరమైన వైద్య పరీక్షలు, సమ్మతి, ఇతర చట్టపరమైన నిబంధనలు పాటించారా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే సేకరించిన అండాలను నగరంలోని కొన్ని ఐపీఎఫ్ కేంద్రాలకు అనధికారికంగా సరఫరా చేస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత కేంద్రాలకు ఈ వ్యవహారంతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా.. అండాల సేకరణ, నిల్వ, రవాణా ప్రక్రియలో ఎవరి పాత్ర ఉందన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఏయే కేంద్రాలు ఈ వ్యవహారంలో భాగస్వాములయ్యాయనే విషయం గురించి అధికారికంగా నిర్దారాణ అవ్వాల్సి ఉంది.

హైదరాబాద్ తోపాటు దేశవ్యాప్తంగా అక్రమ అండాల సేకరణ..సరోగసీ ముఠాల అక్రమాలు వరుసగా బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. సరూర్ నగర్ తరహాలోనే ఈమధ్యే బేగంపేట, ప్రకాశ్ నగర్ ప్రాంతాల్లోని గర్ల్స్ హాస్టళ్లపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. హాస్టళ్ల పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి బీహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా నుంచి యువతులను నగరానికి రప్పించి వారి నుంచి చట్టవిరుద్ధంగా అండాలను సేకరి్సతున్న ముఠాలను రట్టు చేశారు. వరుసగా ఇలాంటి దందా ఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో పోలీసులు సైతం కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు.

ఐవీఎఫ్‌ (IVF) ప్రక్రియలో అండాల సేకరణ అనేది అత్యంత విధివిధానాలతో, వైద్య పర్యవేక్షణలో మాత్రమే జరగాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన హార్మోన్ చికిత్సను అందిస్తారు. ఈ సేకరించే క్రమంలో మహిళల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం చట్టరిత్యా తప్పనిసరి. భారతదేశంలో అమల్లో ఉన్న సహాయక పునరుత్పత్తి సాంకేతికత (ART)  సరోగసీ చట్టాల ప్రకారం అండ దాతల ఆరోగ్యం, వారి రక్షణ, స్వచ్ఛంద సమ్మతికి చట్టపరంగా పూర్తి ప్రాధాన్యం ఉంటుంది. ఎలాంటి డబ్బు ఆశలు చూపి ఒత్తిడికి గురిచేయడం గానీ, సరైన వైద్య నిబంధనలు పాటించకుండా అండాలను సేకరించడం గానీ తీవ్రమైన చట్టవిరుద్ధమైన చర్య.

Also Read: 

 

2 లక్షల మందికి  కేవలం 33 వేల మందే దరఖాస్తు.. NMMS స్కాలర్‌షిప్‌పై విద్యాశాఖ డైరెక్టర్‌కు లేఖ..!!

 

పాఠశాల గదిలోనే క్రూరత్వం.. తోటి విద్యార్థినిపై బాలుడి వికృత దాడి.. స్పృహ కోల్పోయినా వదల్లేదు

 

అనంతపురం జిల్లాలో  పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది దాడి.. రంపంతో గొంతు కోసిన దుండగుడు..!

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Crime News
Telugu News