SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Local Body Elections: ఏపీలో స్థానిక సమరం.. తిరుపతి, మార్కాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

AP Local Body Elections High Tension: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పలు మున్సిపల్‌ కేంద్రాల్లో రాజకీయ పార్టీల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, పోలీసుల లాఠీచార్జి తదితర సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 22, 2026, 12:19 AM IST | Updated: Oct 22, 2026, 12:25 AM IST
Image Credit: High Tension In AP Local Body Elections
Join

High Tension In AP: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలతో పరిస్థితులు రణరంగంగా మారాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లు చేయకుండా ఒక పార్టీ నాయకులను మరో పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు. పోటీలో ఉండకుండా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. పలు మున్సిపల్‌ కేంద్రాల్లో ఆయా రాజకీయ పార్టీల నాయకుల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. తిరుపతి, మార్కాపురం జిల్లాల్లో పలుచోట్ల పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుపతిలో ఉద్రిక్తత పరిస్థితులు
తిరుపతి కలెక్టరేట్ వద్ద ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల అంశంపై వైఎస్సార్సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆందోళనకు దిగగా ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తీవ్ర వాగ్వాదం అనంతరం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ అభ్యర్థులతో కలిసి నామినేషన్లు దాఖలు చేసే అంశంపై వారు చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ సమక్షంలో తమ నిరసన కొనసాగించడంతో పోలీసులు జోక్యం చేసుకున చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీడీపీ శ్రేణుల ఆందోళన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుతమ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్నారంటూ కలెక్టరేట్ ఎదుట తెలుగు దేశం పార్టీచంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన కుమారుడు పులివర్తి వినీల్ నిరసనకు దిగారు. అవాంచనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందస్తు శాంతి భద్రతలో భాగంగా ఎమ్మెల్యే పులివర్తి నాని, టీడీపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు.

నామినేషన్ పత్రాల చించివేత
మార్కాపురం జిల్లా పుల్లల చెరువు నామినేషన్ కేంద్రం వద్ద హైటెన్షన్ నెలకొంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లల చెరువు మండలంలో నామినేషన్ పత్రాల చించివేయడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంలో కేంద్రంలోకి చొరబడిన వ్యక్తులు అభ్యర్థుల చేతుల్లోని నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని చించివేశారు. నామినేషన్ పత్రాలను కాపాడుకునేందుకు అభ్యర్థుల ప్రయత్నం చేశారు. అభ్యర్థులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆ వ్యక్తులు బీభత్సం సృష్టించారు. దీంతో పుల్లల చెరువు నామినేషన్ కేంద్రం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నామినేషన్ల వేళ చోటుచేసుకున్న ఘటనతో మార్కాపురం జిల్లాలో   కలకలం రేపింది. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవడంతో నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

రొంపిచర్లలో
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలకేంద్రంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నామినేషన్ వేసేందుకు తన అనుచరులతో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బయల్దేరగా నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో రోడ్డుపై పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. టీడీపీ, వైసీపీ వర్గీయులను ఎక్కడికక్కడ చెదరగొట్టారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు నరసరావుపేట నుండి రొంపిచర్లక అదనపు బలగాలు రప్పించారు.

బెస్తవారిపేటలో..
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలుకు వెళ్లిన వైసీపీ అభ్యర్థి ఓసూరా రెడ్డి పత్రాలను తీసుకొని చించివేసిన కొందరు వ్యక్తులు. నామినేషన్ పత్రాలు చించివేయడంతో బెస్తవారిపేటలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నామినేషన్ పత్రాలు చించివేయడంపై వైసీపీ వర్గాలు ఆందోళన చేపట్టారు. తమ నామినేషన్ పత్రాలను చించివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎంపీటీసీ నామినేషన్ల దాఖలు
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల దాఖలు మొదలైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రత చర్యలు చేపట్టారు. ఎన్నికలకు నామినేషన్ వేయడానికి వస్తున్న అభ్యర్థుల దగ్గర నుంచి సరైన ధ్రువపత్రాలను పరిశీలించి అన్ని ధ్రువపత్రాలను  సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతనే ఎంపీటీసీ పోటీ చేస్తున్న అభ్యర్థులను పోలీసులు నామినేషన్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో నిశ్శబ్ద వాతావరణంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు  నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నాలుగు మండలాల్లో ఉన్న 50 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు సమర్పిస్తున్నారు. నామినేషన్ల కేంద్రాల వద్ద మూడంచెల భారీ కేడ్లను ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్, ఇతర సెక్షన్లు అమల్లోకి తీసుకువచ్చారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES