• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధం..మీ ఓటు ఉందా? లేదా? ఎలా చెక్ చేయాలంటే?

AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధం..మీ ఓటు ఉందా? లేదా? ఎలా చెక్ చేయాలంటే?

AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, పోటీ చేసే అభ్యర్థుల సౌకర్యార్థం రాష్ట్ర ఎన్నికల సంఘం తమ అధికారిక ఆన్‌లైన్ పోర్టల్‌ను రీమోడల్ చేసింది. ఈ పోర్టల్ ద్వారా ఓటర్లు తమ ఓటు భద్రంగా ఉందో లేదో తనిఖీ చేసుకోవడంతో పాటు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రం చిరునామా, వార్డులు, స్థానాల రిజర్వేషన్ కేటాయింపు వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

Written ByHarish Darla
Published: Oct 15, 2026, 01:27 PM IST|Updated: Oct 15, 2026, 01:32 PM IST
joinshare
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధం..మీ ఓటు ఉందా? లేదా? ఎలా చెక్ చేయాలంటే?

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Gymnastics Coach Sentenced: కోచింగ్‌కి వచ్చిన యువతుల అశ్లీల దృశ్యాలు రికార్డు..జిమ్నాస్టిక్స్ కోచ్‌కు 90 ఏళ్ల జైలుశిక్ష!

Gymnastics Coach Sentenced: కోచింగ్‌కి వచ్చిన యువతుల అశ్లీల దృశ్యాలు రికార్డు..జిమ్నాస్టిక్స్ కోచ్‌కు 90 ఏళ్ల జైలుశిక్ష!

2

Vijayawada: ప్రియుడికి కోసం డ్రగ్స్ పెడ్లర్ గా మారిన యువతి.. అసలు విషయం తెలిస్తే షాక్ ..

3

బ్రిటన్ టీనేజర్ల సరికొత్త ఆలోచన.. రంగులు మారే కండోమ్ వెనుక అసలు కథ ఇదే!

4

నథింగ్ ఫోన్ 4aపై రూ.7,700 వరకు డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్!

5

Pakistan: పాకిస్తాన్ లో కుప్పకూలీన స్కూల్ పైకప్పు.. 30 మంది విద్యార్థుల దుర్మరణం, 40 మందికిపై తీవ్ర గాయాలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతోనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్ కోడ్) తక్షణమే అమల్లోకి వచ్చింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి రాగా.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సైతం తమ పార్టీ అభ్యర్థుల ఖరారు, ఎన్నికల వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు

పోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీలు..
ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 28వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఈ నెల 30వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ (ZPTC), ఎంపీటీసీ (MPTC) ఎన్నికలను ఒకే దశలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అయితే, గ్రామ పంచాయతీ ఎన్నికలను మాత్రం మూడు వేర్వేరు విడతల్లో నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు

ఆన్‌లైన్ పోర్టల్‌లో ఓటు వివరాల తనిఖీ విధానం..
ఎన్నికల సమయాన్వయంలో ఓటర్లకు, పోటీ చేసే అభ్యర్థులకు ఉపయోగపడేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన పోర్టల్‌లో పలు నూతన ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. ఓటర్లు తమ వద్ద ఉన్న ఫొటో ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్/EPIC) నంబరును నమోదు చేసి తమ ఓటు వివరాలను పరిశీలించుకోవచ్చు. ఒకవేళ ఎపిక్ నంబరు అందుబాటులో లేకపోతే, వ్యక్తిగత వివరాలను నమోదు చేసి ఎపిక్ నంబరును పొందే అవకాశం కల్పించారు. జాబితాలో ఓటు లేకపోతే ఏం చేయాలో కూడా ఎన్నికల సంఘం స్పష్టమైన సూచనలు ఇస్తోంది.

పోలింగ్ కేంద్రాలు, అభ్యర్థుల సమాచారం..
ఈ పోర్టల్ ద్వారా జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపాలిటీ వార్డుల వారీగా పురుషులు, మహిళలు ఇతరులతో సహా మొత్తం ఓటర్ల సంఖ్యను తెలుసుకోవచ్చు. ప్రతి ఓటరు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రం చిరునామా, లొకేషన్ వివరాలను చూడవచ్చు. స్థానిక సంస్థల్లో ఏయే స్థానాలను ఏ కేటగిరీకి కేటాయించారనే వివరాలతో పాటు పోటీ చేసే అభ్యర్థుల సమాచారం కోసం ప్రత్యేకంగా 'అభ్యర్థుల పోర్టల్' అనే ఆప్షన్‌ను అందుబాటులో ఉంచారు.

Add Zee News as a Preferred Source
TAGS:
AP News
Elections
Telugu News