School roof collapsed in Peshawar school Pakistan: పాకిస్తాన్ లో ఘోరం చోటు చేసుకుంది. పెషావర్ జిల్లాలోని ఒక ప్రైవేటు స్కూల్ లో పాఠశాల భవనం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలీంది. ఈ శిథిలాల్లో అనేక మంది విద్యార్థులు చిక్కుకున్నారు. పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు వెళ్లి చూడగా అందరు శిథిలాల కింద విగత జీవుల్లా మారిపోయారు. ఈ ఘటనలో ఎక్కడ చూసిన విద్యార్థుల శరీర భాగాలు తెగిపడి కన్పించాయి. రక్తపు మరకలతో ఆ ప్రాంతమంతా భయనకంగా మారిపోయింది.
PAKISTAN: 17 CHILDREN, TEACHER KILLED AS SCHOOL ROOF COLLAPSES IN PESHAWAR At least 17 students, all under 13, and one teacher were killed when a school roof collapsed in Peshawar, Pakistan. More than a dozen people were injured, according to a hospital spokesperson.
— Subodh Kumar (@kumarsubodh_) October 15, 2026
ఆ ప్రదేశంలో 30 మంది వరకు విద్యార్థులు చనిపోయినట్లు సమాచారం. వీరిలో ఒక ఉపాధ్యాయుడు కూడా ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. వెంటనే పాఠశాల సిబ్బంది ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. సహాయక బృందాలు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.
నగరంలోని దిర్ కాలనీలో ఈ ఘటన జరిగిందని పోలీస్ చీఫ్ మియాన్ సయీద్ తెలిపారు. పాఠశాలకు చెందిన పలువురిని ఈ ఘటనకు బాధ్యులను చేస్తే అరెస్టు చేశామని ఆయన వెల్లడించారు.
లేడీ రీడింగ్ ఆసుపత్రి వైద్యుల ప్రకారం, ఈ ఘటనలో ఆరుగురు బాలికలు, ఒక మహిళా ఉపాధ్యాయురాలితో సహా 30 మంది విద్యార్థులు మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారని కూడా ఆయన తెలిపారు.
ఈ ఘటనలో మరణించిన స్కూల్ పిల్లల వయస్సు 13 ఏళ్లు లేదా అంతకంటే తక్కువేనని అక్కడి వారు చెబుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆస్పత్రిలో ఉన్నవారి కొంత మంది పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం.
సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తూ, కూలిపోయిన కట్టడం కింద ఇంకా ఎవరైన చిక్కుకుని ఉండవచ్చని గాలిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.