• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు..మేయర్ సీట్లపై కూటమి ప్రభుత్వం కసరత్తు..ఫైనల్ లిస్ట్ ఇదే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు..మేయర్ సీట్లపై కూటమి ప్రభుత్వం కసరత్తు..ఫైనల్ లిస్ట్ ఇదే!

AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం, రాజకీయ పార్టీలు వేగంగా సిద్ధమవుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత వెలువడిన వెంటనే మున్సిపల్ పోరుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య మేయర్ స్థానాల సర్దుబాటుపై కీలక చర్చలు సాగుతున్నాయి.

Written ByHarish Darla
Published: Oct 08, 2026, 12:03 PM IST|Updated: Oct 08, 2026, 12:08 PM IST
joinshare
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు..మేయర్ సీట్లపై కూటమి ప్రభుత్వం కసరత్తు..ఫైనల్ లిస్ట్ ఇదే!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Flipkart సేల్‌లో హెచ్‌ఎండీ వైబ్ 2 ప్రో 5G ధమాకా.. కేవలం రూ. 14,999కే మీ సొంతం!

Flipkart సేల్‌లో హెచ్‌ఎండీ వైబ్ 2 ప్రో 5G ధమాకా.. కేవలం రూ. 14,999కే మీ సొంతం!

2

Vijay Sai reddy: జగన్ క్రిస్టియన్ నుంచి హిందూ మతంలోకి మారు.!. విజయసాయిరెడ్డి సెన్సెషనల్ కామెంట్స్..

3

IPL 2027 Updates: ప్రీతి జింటా జట్టుకు ఊహించని షాక్.. ఆ ఇద్దరు టీమ్‌ నుంచి ఔట్..!

4

అక్టోబర్‌ 24 నుంచి బుధుడు, శుక్రుడు వక్రగతి.. ఈ 4 రాశులకు బంపర్‌ జాక్‌పాట్!

5

హోమ్‌వర్క్ ఉండదు.. ఎగ్జామ్స్ టెన్షన్ అసలే ఉండదు.. ప్రపంచంలోనే నంబర్-1 ఎడ్యుకేషన్ సిస్టమ్‌ వెనుకున్న అసలు రహస్యం ఏమిటి?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం, పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం భావిస్తుండగా, శుక్రవారం లేదా ఈ నెల 12వ తేదీన అధికారిక షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. స్థానిక పోరులో భాగంగా అందరికంటే ముందుగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణపైనే స్పష్టమైన ప్రకటన రానుంది. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం వచ్చిన వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పోరును కూటమి భాగస్వామ్య పక్షాలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.

కూటమిలో స్థానాల సర్దుబాటు కసరత్తు..
మూడు పార్టీల మధ్య సఖ్యత సాధిస్తూ మేయర్ సీట్లను ఖరారు చేసేందుకు శరవేగంగా చర్చలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడితో జరిగిన ప్రత్యేక సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ పోటీ చేయాలని భావిస్తున్న స్థానాల జాబితాను సమర్పించారు. ప్రధానంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మేయర్ స్థానాలను మూడూ పార్టీలు కోరుతుండటంతో వీటిపై తుది నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పార్టీల ప్రతిపాదనలు - అవకాశాలు..
విశాఖపట్నం మేయర్ స్థానంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పట్టుబడుతోంది. అయితే ఆ పార్టీకి రాజమండ్రి, తిరుపతి స్థానాలను కేటాయించేందుకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. ఒకవేళ మేయర్ స్థానాలు తగ్గితే పరిహారంగా జిల్లా పరిషత్ స్థానాలను పెంచాలని బీజేపీ ప్రతిపాదిస్తోంది.

జనసేన పార్టీ తరఫు నుంచి విజయవాడ, ఏలూరు, ఒంగోలు, కాకినాడ, మచిలీపట్నం స్థానాలను తమకు కేటాయించాలని కోరినట్లు సమాచారం. ప్రస్తుత చర్చల ప్రకారం కాకినాడ, మచిలీపట్నం, ఏలూరు, విజయనగరం స్థానాలు జనసేనకు దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అయితే ఒంగోలు, నెల్లూరు స్థానాల కేటాయింపుపై టీడీపీ, జనసేనల మధ్య ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వీటితో పాటు తమ నియోజకవర్గాల్లోని మున్సిపాల్టీలతో పాటు విశాఖ, ఉభయ గోదావరి ఎస్టీ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాల్టీలను కూడా తమకు కేటాయించాలని జనసేన కోరుతోంది.

వైసీపీ సన్నాహాలు..
ఈసారి మేయర్ ఎన్నికలను ప్రత్యక్ష విధానంలో నిర్వహించనుండటంతో బరిలోకి దింపే అభ్యర్థుల ఎంపిక కూటమికి కీలకంగా మారింది. మరోవైపు వైసీపీ నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరును ఇప్పటికే ఖరారు చేసింది. అయితే బీసీ రిజర్వేషన్లలో మార్పులు వస్తే అభ్యర్థిని మార్చాలని నిర్ణయించింది. నేడు జరిగే కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో రిజర్వేషన్ల ఆధారంగా తుది జాబితా ఖరారు కానుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
AP News
Telugu News