SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకంగా మారిన రిజర్వేషన్లు.. చక్రం తిప్పనున్న మహిళా నేతలు..

AP Muncipal Corporation Elections Reservation: మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఆసక్తికరంగా మారాయి. రాజకీయాల్లో రాణిస్తూ కీలక పదవులు పొందాలనుకున్న వారికి దిమ్మతిరిగేలా చేశాయి. మేయర్ పదవులు, మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవులతో కలను సాకారం చేసుకోవాలనుకున్న వారిని మున్సిపల్ రిజర్వేషన్లతో ఖంగుతిన్నారు. ఇంతకీ ఏపీలో ఏయే మున్సిపల్ కార్పొరేషన్ ఎవరి రిజర్వేషన్ అయిందో ఇపుడు చూద్ధాం…!

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 17, 2026, 10:17 AM IST | Updated: Oct 17, 2026, 10:20 AM IST
Image Credit: AP Local Body Elections (File Pic/Source)
Join

Muncipal Corporation Elections Reservations: ఎన్నికల రిజర్వేషన్లు మున్సిపాల్టీల్లో మహిళల సారథ్యానికి ఊతమిచ్చాయి. 17 మున్సిపల్ కార్పొరేషన్లలో ఏడు స్థానాలను మహిళలకు రిజర్వు చేశారు. అందులో మచిలీపట్నం, కాకినాడ కార్పొరేషన్లను బీసీ మహిళలకు రిజర్వు చేశారు. విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, విశాఖ మేయర్ స్థానాలను జనరల్ మహిళలకు రిజర్వు చేశారు. రాజధాని ప్రాంతం ఉన్న మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ను ఎస్టీకి రిజర్వు చేశారు.  రాజధాని కేంద్రంలో మేయర్ పదవి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని ప్రాంతంలో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న నాయకులు రిజర్వేషన్ ఖరారుతో ఖంగుతిన్నారు.

ఎస్సీలకు రిజర్వ్ అయిన రాజమహేంద్ర వరం, కర్నూలు మున్సిపాలిటీలు.. 
రాజమహేంద్ర వరం, కర్నూలు మున్సిపాలిటీలను ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న నేతలు రిజర్వేషన్లతో తెల్లమొహం వేశారు. రిజర్వుడు స్థానాల్లో అనుచరులను నిలబెట్టి గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏలూరు, అనంతపురం, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లను బీసీ జనరల్ చేశారు. తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లను అన్ రిజర్వు చేశారు.

మహిళలకు పెద్దపీఠ..

ఏపీలో మిగిలిన 106 మున్సిపాల్టీలకు అధికార యంత్రాంగం రిజర్వేషన్లు ఖరారు చేసింది. వీటిలో ఎస్టీ జనరల్‌కు 2, ఎస్టీ మహిళలకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు 7, ఎస్సీ మహిళలకు 7, బీసీ జనరల్‌కు 18, బీసీ మహిళలకు 18, జనరల్‌ అభ్యర్థులకు 26, జనరల్‌ మహిళలకు 27 స్థానాలకు కేటాయించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

చక్రం తిప్పబోతున్న మహిళలు..

ఓవరాల్ గా ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో నగర కార్పొరేషన్లలో ఏడుగురు మేయర్లు, మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్లుగా 53 మంది మహిళల ప్రాతినిథ్యం పెరగబోతోంది. నగర కార్పొరేషన్లలో కార్పరేటర్లు, మున్సిపాల్టీ వార్డుల్లోనూ మహిళా కౌన్సిలర్లు చక్రం తిప్పబోతున్నారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చే వారిని  ప్రోత్సహించి రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో దింపుతున్నాయి.

కీలక నేతల కుటుంబాల మహిళలు.. 
రాజకీయ పార్టీల అభ్యర్థిత్వాలకోసం మగవారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మహిళలకు రిజర్వు చేసిన స్థానాల్లో గెలుపు గుర్రాలకోసం రాజకీయ పార్టీలు అన్వేషిస్తున్నాయి. చాలా స్థానాల్లో రాజకీయ పార్టీలకు బరిలో దిగేందుకు మహిళా అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా మారబోతున్నాయిన తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీపడి ఖర్చును భరించలేమని పోటీలో దిగేందుకు మహిళలు వెనుకాడుతున్నారని సమాచారం. రాజకీయాల్లో కీలక నేతలుగా రాణిస్తున్న కొందరు తమ బంధువర్గాల్లోని మహిళలను కొత్తగా తెరపైకి తీసుకొస్తున్నారు.  
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES